ఫర్జానా తెలుగు చలనచిత్ర నటి, నృత్యదర్శకురాలు, ప్రచారకర్త. ఫర్జానా మొదటగా హిందీ చిత్రరంగంలో నృత్య దర్శకురాలు గా పనిచేస్తుండేది. నిధి ప్రసాద్ తీసిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.[1]

ఫర్జానా
Farzana.jpg
ఫర్జానా
జననం
వృత్తినటి, నృత్య దర్శకురాలు, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2006–2009

జననంసవరించు

ఫర్జానా మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించింది.

సినీరంగ ప్రస్థానంసవరించు

ఫర్జానా మొదటగా హిందీ సినిమాలలో నృత్యకారిణిగా, నృత్య దర్శకురాలిగా పనిచేసింది. అనేక ఫ్యాషన్ షోలకు, వీడియా ఆల్బమ్ లను నృత్య దర్శకత్వం వహించింది. హీరో హోండా, సన్ సుయ్, గోద్రెజ్ హెయిర్ కేర్, బిగ్ బజార్ వంటి సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసింది. నిధి ప్రసాద్ తీసిన భాగ్యలక్ష్మి బంపర్ డ్రా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై, అటుతర్వాత కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితాసవరించు

చిత్రంపేరు సంవత్సరం భాష పాత్రపేరు ఇతర వివరాలు
భాగ్యలక్ష్మి బంపర్ డ్రా 2006 తెలుగు
సీమ శాస్త్రి 2007 తెలుగు
బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ 2008 తెలుగు
గజి బిజి 2008 తెలుగు
మల్లెపువ్వు 2008 తెలుగు ప్రత్యేక పాట[2]
కుబేరులు 2008 తెలుగు
1977 2009 తమిళం

మూలాలుసవరించు

  1. మీడియా1 వెబ్ దునియా. "సంతోషంలో "ఫర్జానా" ఉక్కిరిబిక్కిరి". media1.webdunia.com. Retrieved 29 May 2017.[permanent dead link]
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఫర్జానా అప్పుడేనా?". telugu.filmibeat.com. Retrieved 29 May 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫర్జానా&oldid=2882354" నుండి వెలికితీశారు