కుబేరులు (సినిమా)
కుబేరులు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 2008లో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో శివాజీ, ఫర్జానా, ఆలీ, రఘుబాబు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోదావరి టాకీస్ పతాకంపై కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. జీవన్ థామస్ సంగీతం అందించాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.[1]
కుబేరులు | |
---|---|
దర్శకత్వం | శ్రీనివాసరెడ్డి |
రచన | దాసరి బ్రహ్మం (మాటలు), శివ - సురేష్ (కథ) |
స్క్రీన్ ప్లే | శ్రీనివాసరెడ్డి |
నిర్మాత | కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ |
తారాగణం | శివాజీ, ఫర్జానా, ఆలీ, అపూర్వ, రఘుబాబు, భువనేశ్వరి, చలపతిరావు, హేమ, కవిత, జీవా, కొండవలస లక్ష్మణరావు, ఎమ్.ఎస్.నారాయణ |
ఛాయాగ్రహణం | రాం పినిశెట్టి |
కూర్పు | నాగిరెడ్డి |
సంగీతం | జీవన్ థామస్ |
నిర్మాణ సంస్థ | గోదావరి టాకీస్ |
విడుదల తేదీ | డిసెంబరు 5, 2008 |
భాష | తెలుగు |
కథ
మార్చు500 కోట్ల విలువైన నిజాం వారసత్వ సంపదను ఒక దొంగ దొంగిలిస్తాడు. పోలీసులు వెంటపడగా వివేకానంద కాలనీలలో ఒక చోట దాన్ని భూమిలో పాతిపెడతాడు. ఆ స్థలం ఫోటోలు తీసుకుని ఇంట్లో ఉంచుతాడు. కానీ అతను వెంటనే పోలీస్ ఎన్ కౌంటర్లో మరణిస్తాడు. దొంగల బాస్ కు ఆ ఫోన్ వివేకానంద కాలనీలో ఉందని తెలుసు, కానీ ఎక్కడ ఉందని మాత్రం తెలియదు. అతని మనుషులు దాని కోసం వెతుకుతుంటారు.
శివప్రసాద్ తన మంచితనంతో ఊరిని బాగుచేయాలనుకుని మోసపోయి అప్పుల్లో కూరుకుపోతాడు. ఏదోలా డబ్బులు సంపాదించాలని హైదరాబాదుకు వస్తాడు. పేపర్లో నగల దొంగతనం వార్త చదివి తాను కూడా వాటి కోసం ప్రయత్నించాలనుకుంటాడు. అతని ప్రయత్నం సఫలమైందా లేదా అన్నది మిగతా కథ.
తారాగణం
మార్చుపాటలు
మార్చుఈ సినిమాకు జీవన్ థామస్ సంగీత దర్శకత్వం వహించాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.
మూలాలు
మార్చు- ↑ "Kuberulu movie review - Telugu cinema Review - Sivaji & Farzana". www.idlebrain.com. Retrieved 2020-07-06.