ఫల్వార నూనె
ఫల్వారచెట్టు సపోటేసి వృక్షకుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రనామము డిప్లొనెమ బుటిరేసి (Diploknema butyracea).ఈ చెట్టును చిహరి, ఛుర, ఫల్వా (phulwa) అనికూడా పిలుస్తారు.[1][2] దీని తెలుగు పేరు ఇరుకు చెట్టు.
చెట్టు-వ్యాప్తి
మార్చుపొడవైన ఆకురాల్చు వృక్షము.ఇంచుమించు 15 మీటర్లేత్తు పెరుగుతుంది. ఏపుగా పెరుగుతుంది.నేపాల్, సిక్కింలలో కొన్నిచోట్ల 40 మీటర్లేత్తు పెరిగినవికూడా ఉన్నాయి. చెట్టుబెరడు గ్రే లేదా బ్రౌన్ గా వుండును. ఇవి సముద్రమట్టంనుండి 400-1500 మీటర్లవరకు వ్యాపించి పెరుగుతాయి. ఈచెట్లు కొండలోయల్లోని నదులవడ్దున, కొండవాలుల్లో (Hill slopes) పెరుగుతాయి.5-10 సంవత్సరాలకు గట్టిపడి, కాయల దిగుబడి మొదల్వైతుంది. 50-60 సంవత్సరాల వరకు కాపునిస్తాయి. ఒక చెట్టు నుండి 100-250 కిలోల వరకు కాయలదిగుబడి వుంటుంది. భారతదేశంలో హిమాలయ పరిసరప్రాంతాలు, కుమోన్ (kumoan), సిక్కిం, ఉత్తరబెంగాల్. భూటన్ వరకు ఉన్నాయి. సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వీటిపెంపకానికి అనువైన ప్రాంతాలు.5-10 సంవత్సరాలనుండి చెట్టుపండ్లను కాయడం ప్రారంభమవుతుంది[3].[4]
పూలు :ఏప్రిల్-మే నెలలలో పూస్తాయి.పూలు తెల్లగా లేదా పాలిపోయిన పసుపురంగులో వుండును
పళ్ళు : గ్లోసిగా బాదంకాయ ఆకారంలో, దీర్ఘ అండాకారంలో వుండును.పళ్ళు 2.0-3.5 సెం.మీ.పొడవు, 2-2.5 సెం, మీవ్యాసం కలిగి వుండును. పళ్లలో చక్కెర 8.5%, పీచు పదార్దం 5.6% వుండును.[5] పళ్లు మే-అగస్టునెలల్లో పక్వానికివచ్చును.జూన్-జులైలలో పండ్లను సేకరించవచ్చును.
గింజలు (seeds) : గింజలు గ్లోసిగా, నల్లగా వుండి,1.8-2.0 సెం.మీ. పరిమాణంలో వుండును. పండులో విత్తనశాతం 80% వుండును.గింజలో విత్తనము (kernel) తెల్లగా బాదంపప్పు ఆకారంలో వుండును. గింజలో నూనె 42-47%, విత్తనము/బీజములో 60% వరకు నూనెశాతం వుండును. ప్రొటిన్ 18% వుండును.
నూనె
మార్చుమంచివిత్తనములనుండి తీసిననూనె మంచిరుచి, వాసనకల్గి తెలుపుగా వుండును.ఎక్కువకాలం నిల్వవుంచినను త్వరగా పాడవదు.
ఫల్వార నూనె భౌతికలక్షణాల పట్టిక[6]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.4552-1.4650 |
ఐయోడిన్ విలువ | 90-101 (44-48) * |
సపనిఫికెసను విలువ | 191-200 |
అన్సఫొనిపియబుల్ పదార్థం | 1.4-5% |
ఆమ్ల విలువ | 9.1% |
విశిష్ట గురుత్వం 300Cవద్ద | 0.856-0.862 |
ద్రవీభవ ఉష్ణోగ్రత | 39-510C |
టైటరు విలువ | 48-520C |
గమనిక=*కొన్నిరకాలనూనెల్లో
ఫల్వార నూనెలోని కొవ్వు ఆమ్లంల శాతం[3][7]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 56.6 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 3.6 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 36.0 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 3.8 |
నూనె ఉపయోగాలు
మార్చుఇవికూడా చూడండి
మార్చుఉల్లేఖన/మూలాలు/ఆదారాలు
మార్చు- ↑ "CHYUR- INDIAN BUTTER TREE". chyura.blogspot.in. Retrieved 2015-03-20.
- ↑ "Phulwara oil". encyclo.co.uk. Retrieved 2015-03-20.
- ↑ 3.0 3.1 3.2 SEA Hand Book-2009.By The Solvent Extractors' Association of India
- ↑ 4.0 4.1 "Extraction Of High Quality Dna From Diploknema Butyracea" (PDF). sciencepub.net. Retrieved 2015-03-20.
- ↑ "Phulwara". manoramagroup.co.in. Archived from the original on 2015-02-23. Retrieved 2015-03-20.
- ↑ "VEGETABLE PRODUCTS(REGULATION)ORDER,1998" (PDF). fssai.gov.in. Archived from the original (PDF) on 2013-11-26. Retrieved 2015-03-20.
- ↑ "Triglyceride composition ofmadhuca butyraceae seed fat". link.springer.com. Retrieved 2015-03-20.
- ↑ "CHEURA" (PDF). novodboard.com. Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2015-03-20.