ఫిరంగి నాలా, రంగారెడ్డి జిల్లా

(ఫిరంగి నాల రంగారెడ్డి జిల్లా నుండి దారిమార్పు చెందింది)

ఫిరంగి నాలా (ఫిరంగి కాలువ) తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళ సమీపంలో ఉన్న కాలువ. హైదరాబాదు నగరానికి తాగునీటిని అందించే హిమయత్‌ సాగర్‌కు దానికి పశ్చిమ, వాయువ్య దిశలో ఉన్న 50 గ్రామాలకు తాగు, సాగునీటిని అందించే ఉద్దేశ్యంతో 1872లో నిజాం రాజు ఈ కాలువను తవ్వించాడు.[1]

చరిత్ర

మార్చు

1872వ సంవత్సరంలో నిజాం రాజు ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌ ఇంజనీర్ల సలహాలతో రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు తాగు, సాగు నీరు అందించేలా ఈ కాలువను నిర్మించాడు. షాబాద్ నుండి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వరకు త్రవించిన నీటి కాలువ ద్వారా ఆరోజుల్లో కొన్ని వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకు వచ్చారు. ఈ కాలువా దక్షిణ చందనవెల్లి, సోలిపేట, రామానుజపూర్, నానాజ్‌పూర్, జూకల్, నర్రూడ, ఊట్‌పల్లి, శంషాబాద్, ఉందానగర్, వెంకటాపూర్, మంగల్‌పల్లి మీదుగా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో కలుస్తుంది. షాబాద్‌ మండలం చందన్‌వల్లి గ్రామానికి తూర్పున చేవెళ్ళ, మొయినాబాద్‌ మండలాల సరిహద్దుల్లో ‘ఈసీ’ నదిపై సర్వే నంబర్‌ 160లో సుమారు రెండు ఫర్లాంగుల పొడవున 48 మీటర్ల వెడల్పు, 85 కిలోమీటర్ల పొడవుతో ఈ ఆనకట్ట నిర్మించారు. కాలువ పొడవునా అన్ని మండలాల్లోని పలు చెరువులకు నీటిని అందించే విధంగా ఈ కాలువ నిర్మాణం జరిగింది.[2]

ప్రస్తుత స్థితి

మార్చు

కాలువ పొడవునా కబ్జాలు జరిగి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు పెరిగడంతోపాటు కాలువలో పిచ్చిచెట్లు పెరిగి అస్తవ్యస్తంగా తయారయింది. కొన్నిచోట్ల కాలువను పూడ్చి భారీ నిర్మాణాలు కూడా చేపట్టారు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. డైలీహంట్, ఈనాడు (30 October 2017). "ఫిరంగి పునరుద్ధరణ.. చెరువులకుఆలంబన". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (16 December 2014). "'ఫిరంగి' కలేనా?". www.andhrajyothy.com. Archived from the original on 29 June 2020. Retrieved 29 June 2020.