ఫ్రిట్జ్ హేబర్
ఫ్రిట్జ్ హేబర్ (Fritz Haber) (జ: 9 డిసెంబర్ 1868 – 29 జనవరి 1934) జర్మనీ రసాయన శాస్త్రవేత్త. ఇతడు 1918 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతని ముఖ్యమైన ఆవిష్కరణలు అమ్మోనియా ఎరువులు, మందుగుండు సామగ్రి తయారీలో అత్యవసరమైన హేబర్ ప్రక్రియ (Haber process).
ఫ్రిట్జ్ హేబర్ | |
---|---|
జననం | 9 డిసెంబర్ 1868 Breslau, జర్మనీ |
మరణం | 1934 జనవరి 29 Basel, స్విట్జర్లాండ్ | (వయసు 65)
జాతీయత | జర్మనీ |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | Swiss Federal Institute of Technology University of Karlsruhe |
చదువుకున్న సంస్థలు | హీడెల్బర్గ్ విశ్వవిద్యాలయం, Humboldt University of Berlin బెర్లిన్ సాంకేతిక విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | రాబర్ట్ బున్సెన్ |
ప్రసిద్ధి | ఎరువులు, Explosives, హేబర్ ప్రక్రియ, Haber-Weiss reaction, రసాయన యుద్ధం |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1918) |
ఇతడు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో క్లోరిన్, ఇతర విష వాయువులను అభివృద్ధి చేసినందుకు ఇతనిని "రసాయన యుద్ధ పితామహుడు"గా పరిగణిస్తారు.
ఇతని భార్య, క్లారా ఇమ్మర్వార్ కూడా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొంది, విష వాయువుల అభివృద్ధిని వ్యతిరేకించి, ఆత్మహత్య చేసుకున్నది.[1]
మూలాలు
మార్చు- ↑ Hobbes, Nicholas (2003). Essential Militaria. Atlantic Books. ISBN 978-1843542292.
బయటి లింకులు
మార్చు- Nobel e-Museum - Biography of Fritz Haber Archived 2001-12-04 at the Wayback Machine
- HABER - A Biographical Film about Fritz Haber
- Photographs of Fritz Haber's life
- A short biography of Fritz Haber, by Bretislav Friedrich
- Encyclopedia Britannica: Nobel Prizes - Fritz Haber
- "The Synthesis of Ammonia from its Elements", Nobel Lecture, 2 June 1920