బంగారుపాళ్యం

ఆంధ్ర ప్రదేశ్, చిత్తూరు జిల్లా లోని మండలం
(బంగారుపాలెం నుండి దారిమార్పు చెందింది)

బంగారుపాళ్యం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం లోని గ్రామం.[1]. బంగారుపాళ్యం జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి 20 కిలోమీటర్ల దూరంలో మద్రాసు - బెంగుళూరు జాతీయ రహదారి 4 పై ఉంది. బంగారుపాళ్యం మామిడి పళ్లకు ప్రసిద్ధి. చుట్టుపక్కల గ్రామాలలో చాలామంది రైతులు మామిడి తోటలను నిర్వహిస్తున్నారు. మామిడి గుజ్జును తయారుచేసి, ఎగుమతి చేసే అనేక చిన్న పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. వాటితో పాటు గోమతి స్పిన్నర్స్ అనే దారాలు ఉత్పత్తి చేసే కర్మాగారం స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నది. మండలంలోని మొగిలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన పురాతన మొగిలీశ్వరాలయం ఉంది. ప్రస్తుతం బంగారుపాళ్యం పట్టణంలో ఐదు ప్రైవేటు పాఠశాలలు, ఒక ప్రభుత్వోన్నత పాఠశాల ఉన్నాయి.

{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం బంగారుపాలెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
బంగారుపాళ్యం చివరి జమీందారు ముద్దు బంగారు శేషాచలపతి రాజా (1911 - 1964)

బంగారుపాళ్యం స్వాతంత్ర్యానికి పూర్వము జమిందారీ జాగీరు. శతాబ్దాలుగా జమీందారీ పాలనలో ఉంది. ఈ జమీందారులు మొగిలీశ్వరాలయంతో పాటు అనేక ఆలయాలను కట్టించి, నిర్వహించారు. ఇప్పటికీ ఈ జమీందారు కుటుంబీకులే వంశపారంపర్యంగా ఆలయధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.[2] బంగారుపాళ్యం జమీందారు ముద్దు బంగారు శేషాచలపతి నాయుడు 1895లో చిత్తూరులో ఒక ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించాడు. బంగారుపాళ్యం జమిందారీ 1911కు పూర్వం ఉత్తర ఆర్కాటు జిల్లాలో భాగంగా ఉంది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడినప్పుడు, అందులో భాగమైంది. 1960లో చిత్తూరు తాలూకాలో ఉన్న 145 గ్రామాలతో బంగారుపాళ్యం ఫిర్కాను ఏర్పరచారు.[3] ఆ తర్వాత 1985లో మండలాలేర్పడినప్పుడు బంగారుపాళ్యం ఫిర్కా, బంగారుపాళ్యం మండలంగా మారింది.

.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-20. Cite web requires |website= (help)
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-09-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-18. Cite web requires |website= (help)
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-10-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-16. Cite web requires |website= (help)