బంటుమిల్లి

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలం లోని గ్రామం

బంటుమిల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 521324. ఎస్.టీ.డీ. =08672.

బంటుమిల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,867
 - పురుషులు 4,066
 - స్త్రీలు 3,962
 - గృహాల సంఖ్య 1,928
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672


బంటుమిల్లి
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో బంటుమిల్లి మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో బంటుమిల్లి మండలం స్థానం
బంటుమిల్లి is located in Andhra Pradesh
బంటుమిల్లి
బంటుమిల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో బంటుమిల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°21′00″N 81°17′00″E / 16.3500°N 81.2833°E / 16.3500; 81.2833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం బంటుమిల్లి
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 52,257
 - పురుషులు 26,343
 - స్త్రీలు 25,914
అక్షరాస్యత (2001)
 - మొత్తం 66.43%
 - పురుషులు 71.81%
 - స్త్రీలు 60.97%
పిన్‌కోడ్ 521 324

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలుసవరించు

కృత్తివెన్ను, కలిదిండి, ముదినేపల్లి, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

బంటుమిల్లి, సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 76 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజి, సెయింట్ జాన్సు స్కూల్, కె.ఆర్.టాలెంట్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్, మార్గదర్శి హైస్కూల్,కొమ్మారెడ్డి పాఠశాల, బంటుమిల్లి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

కవిసామ్రట్ విశ్వనాధ సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా, 2015,సెప్టెంబరు-10వ తేదీనాడు, విజయవాడ సిద్ధార్ధ అడిటోరియంలో, రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఒక జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తోంది. ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేయుచున్న శ్రీమతి గుడిపూడి రాధికారాణికి, ఈ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వనం అందినది. ఆమె ఈ సదస్సులో, "విశ్వనాధవారి నవ్య కవిత రీతులు" అను అంశంపై ఒక పరిశోధనా వ్యాసాన్ని సమర్పించనున్నరు. ఈమె మొదటిగా, "ఈనాడు హాయ్ బుజ్జీ" పజిల్స్ ద్వారా పాఠక లోకానికి పరిచయమైనారు. అనంతరం కథలు, బాల సాహిత్యం ద్వారా సాహితీ మిత్రులలో ఒకరిగా పేరొందినారు. [12]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

వైద్య సౌకర్యంసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

శ్రీ అమీర్ :- 2001లో ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికై ఐదేళ్ళపాటు పనిచేశారు. వీరు తన పదవీ కాలంలో అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటుచేసి ప్రజల మన్ననలను పొందారు. సర్పంచిగా పనిచేసి, తన పదవీకాలం ముగిసిన తర్వాత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం గల అమీర్, తిరిగి తన వ్యాపారం (మాంసం కొట్టు) కొనసాగించుచున్నారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ కనక దుర్గఅమ్మవారి దేవాలయంసవరించు

ఈ ఆలయం శ్హుక్ల నమ సంవత్సర ఆస్వియుజ శ్హుద్ద పౌర్నమి అనగా 14.10.1989 నాడు స్తపించబదింది. ఉగాది సశ్రావణ మాసం దసర ఉత్సవాలు భవాని దీక్షలు ఈ ఆలయంలో జరిగి ముఖ్యమైన ఉత్సవ్వాలు ఆలయంలో జరిగే నిత్య పూజదికాల వివారల కోసం ఆలయ ధర్మకర్త శ్రీ గరికపాటి కూనారావూ (9502995114) గారిని గాని ఆలయ అర్చకులు శ్రీ నాగ వెంకట దుర్గ జితెంద్ర శర్మ (నాగమల్లి) (9705708492) గారిని సంప్రదించ గలరు.

శివాలయంసవరించు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయంసవరించు

విగ్రహ ప్రతిష్ఠాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, అంకురార్పణతో, 2014,మార్చ్-31న, వైఖానస ఆగమ ప్రకారం మొదలయినవి. 2014,ఏప్రిల్-4వ తేదీన ఉదయం, 9-36 గంటలకు శ్రీదేవీ, గోదాదేవీ, వేంకటేశ్వరస్వామి, గరుడాళ్వార్, జయ, విజయుల విగ్రహ ప్రతిష్ఠతోపాటు, ఆలయ శిఖరాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ఏకకాలంలో జరిగినవి. ఉదయంనుండి, రోజంతా సాగిన పూజా కార్యక్రమాలలో భాగంగా, గోవిందనామాలతో బంటుమిల్లి మారుమ్రోగింది. రాత్రి, స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి, బంటుమిల్లిలోని ప్రతి కుటుంబంవారు, వారి బంధువులను, మిత్రులకు ఆహ్వానం పంపగా, ప్రధానంగా వారి ఆడబడుచులు ఈ కార్యక్రమానికి విచ్చేయటంతో, ఏప్రిల్-4వ తేదీన, ఊరంతా పండుగ వాతావరణం కనిపించింది. ఆ రోజు మద్యాహ్నం, ఇరవై వేలమందికి అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటుచేసారు. తొలి రోజున 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3] & [4]

  1. ఈ ఆలయంలో 2014, ఆగస్టు-10, ఆదివారం నాడు, శ్రావణపౌర్ణమి సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి "మనగుడి" కార్యక్రమంలో భాగంగా, స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద యెత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసారు. అనంతరం తి.తి.దేవస్థానం నుండి వచ్చిన రక్షాబంధన్ లను భక్తులకు అందజేసినారు. [6]
  2. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవాలు 2015,మార్చ్-24వ తేదీ శనివారం నాడు నిర్వహించెదరు. [7]

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయంసవరించు

  1. స్థానిక ధర్మశాస్తాసేవా సమితి ఆధ్వర్యంలో బంటుమిల్లిలో, రు. 1.5 కోట్లతో, ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014,జూన్-11, గురువారం నాడు ప్రారంభించెదరు. గణపతి, సరస్వతీదేవి, మాలికపురుత్తిణి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ నాగబంధ, ధ్వజ-శిఖర-బలిపీఠాది ప్రతిష్ఠలు 15వ తేదీ, ఆదివారం నాడు నిర్వహించెదరు. ఇక్కడ ఆలయనిర్మాణంతోపాటు, అన్నదాన సత్రం గూడా నిర్మించారు. అయ్యప్ప భక్తులకు దీక్షా సమయంలో ఉచిత భోజన ఏర్పాట్లు చేసేటందుకు, కొందరు అయ్యప్ప భక్తులు కార్యక్రమాన్ని చేపట్టినారు. దీని ఆధారంగా భారీ విరాళాలు సమకూరడంతో, అయ్యప్ప ఆలయనిర్మాణం చేపట్టాలని భక్తులు తలచిన వెంటనే నిర్మాణం ప్రారంభించారు. [5]
  2. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,జూన్-5వతేదీ శుక్రవారంనాడు, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం అభిషేకాలు, మద్యాహ్నం మల్లెలతో పూజలు, రాత్రి, ఈ ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. [8]

శ్రీ రామాలయంసవరించు

ఈ ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-6వ తేదీ శనివారం ప్రారంభమైనవి. ఇందుకోసం, 37 అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభాన్ని కొనుగోలుచేసారు. 7వ తేదీ ఆదివారం గూడా పూజలు నిర్వహించి, 8వ తేదీ సోమవారం ఉదయం 7-40 గంటలకు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, వందలాదిమంది భక్త జనసందోహం మధ్య, అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఆపై శ్రీ సీతారాముల శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆలయం కిటకీలాడినది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, బంటుమిల్లిలోని ప్రతి ఇల్లూ బంధువులతో కళకళలాడినది. ఆడబడుచులంతా పుట్టింటికి రావడంతో సందడి చోటుచేసుకున్నది. అనంతరం మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [9]&[10]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

  1. బంటుమిల్లిలోని చెరుకుమిల్లిలో, "మిలేష్" పేరుతో ఒక రొయ్యల ఎగుమతి కర్మాగారాన్ని నిర్మించారు. ఈ కర్మాగారాన్ని బాలాజీ దంపతులు, 2015,అక్టోబరు-23వ తేదీ శుక్రవారం రాత్రి గృహప్రవేశం చేయడం ద్వారా ప్రారంభించారు. తీరప్రాంతానికి మణిహారంగా వెలసిన ఈ కర్మాగారం, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి ప్రాంతరైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. [13]
  2. బంటుమిల్లి వ్యవసాయశాఖ కార్యాలయంలో విస్తరణాధికారిణిగా పనిచేయుచున్న దాసరి జోయసీరాణి, కేంద్ర ప్రభుత్వ పట్టుమండలి అర్ధశాస్త్ర విభాగ శాస్త్రవేత్తగా ఎంపికై ప్రస్తుతం మైసూరులో శిక్షణ పొందుచున్నారు. [14]

గ్రామాలుసవరించు

జనాభాసవరించు

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆముదాలపల్లి 215 752 367 385
2. అర్తమూరు 1,148 4,555 2,358 2,197
3. బంటుమిల్లి 1,928 8,028 4,066 3,962
4. బర్రిపాడు 261 902 460 442
5. చినతుమ్మిడి 259 1,030 500 530
6. చొరంపూడి 1,553 6,795 3,461 3,334
7. కంచడం 498 2,007 1,000 1,007
8. కొర్లపాడు 165 660 340 320
9. మద్దేటిపల్లి 215 839 416 423
10. మల్లేశ్వరం 780 3,104 1,555 1,549
11. మనిమేశ్వరం 449 1,826 903 923
12. ములపర్రు 1,440 5,786 2,900 2,886
13. ముంజులూరు 593 2,262 1,121 1,141
14. నారాయణపురం 132 560 301 259
15. పెదతుమ్మిడి 1,807 6,909 3,491 3,418
16. పెందూరు 692 2,849 1,427 1,422
17. రామవరపు మోడి 434 1,752 848 904
18. సాతులూరు 406 1,641 829 812

గణాంకాలుసవరించు

జనాభా (2001) - మొత్తం 52,257 - పురుషులు 26,343 - స్త్రీలు 25,914

వనరులుసవరించు

  1. "బంటుమిల్లి". Retrieved 3 July 2016.
  2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-11; 8వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-30; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,ఏప్రిల్-5; 16వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,జూన్-11; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-11; 11వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,మార్చ్-20; 5వపేజీ. [8] ఈనాడు కృష్ణా; 2015,జూన్-6; 5వపేజీ. [9] ఈనాడు కృష్ణా; 2015,జూన్-7; 17వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2015,జూన్-9; 5వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-8; 10వపేజీ. [13] ఈనాడు కృష్ణా; 2015,అక్టోబరు-25; 5వపేజీ. [14] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-25; 3వపేజీ. [15] ఈనాడు కృష్ణా; 2016,మే-23; 4వపేజీ.