బండారి లక్ష్మారెడ్డి

బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

బండారి లక్ష్మారెడ్డి
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు భేతి సుభాష్‌ రెడ్డి
నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1965
సైనిక్‌పురి, కాప్రా, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మమతా
బంధువులు బండారి రాజిరెడ్డి (అన్న)
నివాసం సైనిక్‌పురి

జననం, విద్యాభాస్యం మార్చు

లక్ష్మారెడ్డి బండారి 1967 నవంబరు 27న కాప్రా, బక్షిగూడలో బండారి జంగా రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 9వ తరగతి వరకు చదివాడు.

రాజకీయ జీవితం మార్చు

లక్ష్మారెడ్డి బండారి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కిసాన్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUH)లో కార్యనిర్వాహక మండలి సభ్యునిగా వివిధ హోదాల్లో పనిచేసి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]

లక్ష్మారెడ్డి బండారి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించగా, పొత్తుల్లో భాగంగా ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో ఆయన 2018 సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి[3] అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్‌గా పనిచేసి టిఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయన ఆ తరువాత జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కామారెడ్డి & బాన్సువాడ మునిసిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా పనిచేశాడు.

బండారి లక్ష్మారెడ్డి 2023లో ఉప్పల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డిపై 49030 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5][6] ఆయన 09న శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7][8]

మూలాలు మార్చు

  1. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. "Lakshma gets all-round boost in his constituency". 28 April 2014. Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  3. Sakshi (11 September 2018). "గులాబీ గూటికి 'బండారి'!". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  6. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.
  7. Sakshi (10 December 2023). "సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  8. Prabha News (9 December 2023). "ఎమ్మెల్యేలుగా 99 మంది ప్ర‌మాణ స్వీకారం…18 మంది గైర్హాజ‌రు." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.