జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న 4 శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో కలిపారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి శాసనసభా నియోజకవర్గములు కూడా ఈ నియోజకవర్గంలో భాగమయ్యాయి. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గ స్థానే ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లాకు చెందిన 3 శాసనసభా నియోజకవర్గములు (జహీరాబాదు, ఆందోల్, నారాయణ్‌ఖేడ్) ఉండగా నిజామాబాదు జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ లతో కలిపి మొత్తం 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.తెలంగాణాలోని 33 జిల్లాలలో జిల్లా కేంద్రము కాని పార్లమెంటు రెండు స్థానాలు చేవెళ్ళ, జహీరాబాదు. 2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో బి. బి. పాటిల్ గెలుపొందాడు.

దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు మార్చు

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

 • 2001 లెక్కల ప్రకారము జనాభా: 18,35,612 [1]
 • ఎస్సీ, ఎస్టీల శాతం: 17.61%, 7.72%.
 • ఓటర్ల సంఖ్య: 12,53,670.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2009[2][3] 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 434244 కె. మదన్ మోహన్ రావు పు కాంగ్రెస్ 428015
2014[4] 5 జహీరాబాదు జనరల్ బి. బి. పాటిల్ పు టీఆర్ఎస్ 508661 సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 364030
2019 [5] 5 జహీరాబాదు జనరల్ సురేష్ కుమార్ షెట్కర్ పు కాంగ్రెస్ 395767 సయ్యద్ యూసుఫ్ ఆలీ పు తె.రా.స 378360

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున శివకుమార్ లింగాయత్ పోటీ చేసారు.[6] పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సయ్యద్ యూసఫ్ అలీ పోటీలో ఉన్నాడు.[7] కాంగ్రెస్ పార్టీ టికెట్ సురేశ్ షెట్కార్‌కు లభించింది.[8] సురేశ్ సమీప తె.రా.స పార్టీ పత్యర్థి అయిన యూసుఫ్ ఆలీ పై విజయం సాధించాడు.

2024 ఎన్నికలు మార్చు

2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ స్థానం నుండి మొత్తం 19 మంది పోటీలో ఉన్నారు.[9]

మూలాలు మార్చు

 1. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92600&subcatid=4&categoryid=3
 2. "Constituency Wise Detailed Results" (PDF). Election Commission of India. p. 196. Archived from the original (PDF) on 11 August 2014. Retrieved 30 April 2014.
 3. Firstpost (2019). "Zahirabad Elections 2019: Telangana Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
 4. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
 5. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
 6. ఈనాడు దినపత్రిక, తేది 28-03-2009
 7. ఆంధ్రజ్యోతి దినపత్రిక, తేది 28-03-2009
 8. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
 9. EENADU (30 April 2024). "జహీరాబాద్‌ బరిలో 19 మంది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.