బండారుపల్లి (ఏర్పేడు మండలం)
బండారుపల్లి, తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బండారుపల్లి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°40′40″N 79°38′14″E / 13.677878°N 79.637235°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | ఏర్పేడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 4,000 |
- గృహాల సంఖ్య | 1,800 |
పిన్ కోడ్ | 517 620 |
ఎస్.టి.డి కోడ్: 08578 |
దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు
మార్చుబండారుపల్లి గ్రామంలో శ్రీకృష్ణాశ్రమం ఉంది. ఇది శ్రీ రామానందగిరి స్వామిచే నడుపబడుతోంది. ఈ ఆశ్రమంలో శ్రీకృష్ణ, రాధా దేవతలు ఉంటారు. కేవలం శ్రీకృష్ణ దేవాలయం మాత్రమే కాదు, శ్రీరామ మందిరం, నాగాలమ్మ దేవాలయం, అంకమ్మ దేవాలయం, గురుప్పస్వామి దేవాలయం, వినాయక దేవాలయం, గంగమ్మ గుడి వంటి అనేక దేవాలయాలు ఉన్నాయి.
ప్రధాన పంటలు
మార్చుబండారుపల్లి గ్రామంలో వేరుశనగ పంట, వరి పంటలు ప్రధాన పంటలు.
రవాణా సదుపాయం
మార్చుఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యముంది. ఆర్టీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నేరి రైల్వే స్టేషనులు సమీపంలో ఉన్నాయి.