బందూక్

(బందూక్‌ నుండి దారిమార్పు చెందింది)

బందూక్‌ 2015లో విడుదలైన తెలుగు సినిమా. బిబిఎన్‌ స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై గుజ్జ యుగంధర్‌ రావు నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మణ్‌ మురారి (బాబి) దర్శకత్వం వహించాడు. చైతన్య రావు , కృష్ణచైతన్య జోషి , మిథున్ రెడ్డి, దేవా మలిశెట్టి, మధు సిల్వేరి, గాయత్రి , శహెరా భాను , బిందు చంద్రమౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 19 జూన్ 2015న విడుదలైంది.[1]

బందూక్‌
దర్శకత్వంలక్ష్మణ్‌ మురారి (బాబి)
నిర్మాతగుజ్జ యుగంధర్‌ రావు
తారాగణంచైతన్య రావు , కృష్ణచైతన్య జోషి , మిథున్ రెడ్డి, దేవా మలిశెట్టి, మధు సిల్వేరి, గాయత్రి , శహెరా భాను , బిందు చంద్రమౌళి
ఛాయాగ్రహణంరాహుల్‌ మాచినేని
సంగీతంకార్తీక్‌ కొడకండ్ల
నిర్మాణ
సంస్థ
బిబిఎన్‌ స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ
19 జూన్ 2015
సినిమా నిడివి
నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణంసవరించు

బందూక్ సినిమా షూటింగ్ 2013లో ప్రారంభమైంది. ఈ సినిమా లోగోను 30 అక్టోబర్ 2013న విడుదల చేశారు.[2][3]ఈ సినిమా లో 24 శాఖల్లోనూ తెలంగాణ నటులు, టెక్నిషియన్స్ పని చేసిన తొలి చిత్రం. ఈ సినిమాలోని "పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ బ్రెత్‌లెస్ పాటను మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి 11 డిసెంబర్ 2014న విడుదల చేశాడు. ఈ పాటను గోరటి వెంకన్న రాయగా, కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకత్వంలో సాకేత్ కొమండూరి పాడాడు.[4]బందూక్‌ సినిమా ఆడియో సీడిలను 23 మే 2015న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించాడు.[5]

కథసవరించు

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రెండు ప్రధాన అభిప్రాయాలు, సంఘర్షనల మధ్య నడిచే కథే బందూక్. చేనేత కుటుంబంలో పుట్టిన చైతన్య (చైతన్య రావు) ప్రభుత్వాల వైఫల్యం, అవినీతి వల్లే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడనే అభిప్రాయంలో ఉంటాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కేవలం బందూక్ (తుపాకి)తోనే సాధ్యమని ఆ పంథాలో వెళుతుంటాడు. ఇదే క్రమంలో అతనికి తానుండే గురుకులంలో జాగో పేరుతో వీధి, కాలేజీ నాటకాలు వేసే గ్రూప్ పరిచయమవుతుంది.

జాగో గ్రూపులోని మిత్రులంతా ఎవరికివారే తమ కలల్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో పాటు, సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని తపిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే తెలంగాణ రెండో దశం ఉద్యమం మొదలవ్వడం, గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారు ఆ ఉద్యమంలో భాగస్వాములై పోరాడడం చేస్తుంటారు. చైతన్య, బందూక్‌తోనే ఉద్యమ కల నెరవేరుతుందనే అభిప్రాయంలో ఉండగా, జాగో గ్రూప్ అహింసే ఉద్యమానికి ఊపిరి అనే అభిప్రాయంతో పోరాటం చేస్తారు.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: బిబిఎన్‌ స్టూడియో మోషన్‌ పిక్చర్స్‌
 • నిర్మాత: గుజ్జ యుగంధర్‌ రావు
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్‌ మురారి (బాబి)
 • సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల
 • సినిమాటోగ్రఫీ: రాహుల్‌ మాచినేని
 • మాటలు: క్రాంతిరెడ్డి సకినాల , అజయ్ పులిపాటి
 • రచనా సహకారం: కృష్ణచైతన్య జోషి , అజయ్ పులిపాటి
 • కార్యనిర్వాహక నిర్మాత: శ్రీధర్ మంచాల
 • సహ నిర్మాతలు: శ్రావణ్‌కుమార్, గణేష్‌బాబు
 • సమర్పణ: సంజయ్‌కుమార్

మూలాలుసవరించు

 1. The Times of India (19 June 2015). "Bhandook Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 2. Film Today (30 October 2013). "Bandhuk Movie Logo Launch Photos" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 3. Sakshi (31 October 2013). "ఓ 'బందూక్' ఆత్మ ఘోష". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 4. Sakshi (11 December 2014). "బందూక్ ఓ అద్భుతం!". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 5. Andrajyothy (23 December 2015). "పాటల పల్లకిలో 'బందూక్‌'". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
 6. Sakshi (24 February 2015). "బందూక్‌లో మనోళ్లు". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=బందూక్&oldid=3487480" నుండి వెలికితీశారు