బక్సర్ యుద్ధం

బక్సర్ యుద్ధం 1764 అక్టోబరు 22న హెక్టర్ మన్రో నాయకత్వంలోని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దళాలు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, ఔధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం సంయుక్త దళాలకు నడుమ జరిగింది.[3] బెంగాల్ భూభాగంలో పాట్నాకు 130 కిలోమీటర్ల పశ్చిమంగా గంగా నదీ తీరాన ఉన్న కోటగోడల్లో నెలకొన్ని చిన్న పట్టణం బక్సర్ వద్ద జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించింది.

colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" బక్సర్ యుద్ధం
colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" బెంగాల్ యుద్ధాలు
లో భాగం
colspan="2" style="text-align:center;border-bottom:1px solid #aaa;line-height:1.5em;" Battle of Buxar -Crown and company- Arthur Edward Mainwaring pg.144.jpg
తేదీ 22 అక్టోబర్ 1764
స్థానం బక్సర్ సమీపంలో
ఫలితం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ విజయం
colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" ప్రతిస్పర్ధులు
width="50%" style="border-right: 1px dotted #aaa;

" | మొఘల్ సామ్రాజ్యం

Flag of the British East India Company (1707).svg British East India Companyబ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ
colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" సైన్యాధికారులు
width="50%" style="border-right: 1px dotted #aaa;

" | రెండవ షా ఆలంShah Alam II[1]

Flag of the British East India Company (1707).svg హెక్టర్ మన్రో ఆఫ్ నొవార్
colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" సైనిక బలం
width="50%" style="border-right: 1px dotted #aaa;

" | 40,000
140 ఫిరంగులు

7,072

30 ఫిరంగులు

colspan="2" style="background-color:#B0C4DE;text-align:center;vertical-align:middle;font-size:110%;" మరణాలు, నష్టాలు
width="50%" style="border-right: 1px dotted #aaa;

" | వివాదాస్పదం
బ్రిటీష్ వారి ప్రకారం:
2,000 మంది మరణించారు

733-847 మరణించడం లేక గాయపడడం లేదా అదృశ్యం కావడం జరిగింది[2]

యుద్ధంసవరించు

బ్రిటీష్ సైన్యంలో 7,071 మంది సైనికుల సంఖ్యాబలంలో[4] 5297 మంది భారతీయ సిపాయిలు, 918 మంది భారతీయ ఆశ్విక దళం ఉంది. బెంగాల్, ఔధ్ నవాబులు, మొఘల్ చక్రవర్తి కూటమి సైన్యం 40 వేల పైచిలుకు ఉంది.

మిత్రపక్షాలైన బెంగాల్, ఔధ్, మొఘల్ సైన్యాల మధ్య మౌలికమైన సమన్వయం కూడా లేకపోవడం ఈ నిర్ణయాత్మకమైన ఓటమికి దారితీసింది.

మీర్జా నజఫ్ ఖాన్ మొఘల్ చక్రవర్తి సైన్యాన్ని కుడి భాగం నేతృత్వం వహించి మేజర్ హెక్టర్ మన్రో మీదికి తన సైన్యాన్ని తొట్టతొలిగా నడిపించాడు; 20 నిమిషాల్లో బ్రిటీష్ దళం వరుసులగా ఏర్పడి మొఘల్ సైన్యం పురోగమనాన్ని అడ్డుకుంది. బ్రిటీష్ వారి ప్రకారం, దురానీ, రోహిల్లా అశ్వ దళం కూడా యుద్ధంలో పాల్గొంది, వివిధ ఘర్షణల్లో పాల్గొంది. కానీ మధ్యాహ్నానికల్లా యుద్ధం ముగిసింది. షుజా ఉద్దౌలా అప్పటికి మూడు భారీ పెట్టెల నిండా ఉన్న తుపాకీ మందు ఖాళీ చేసేశాడు.

మన్రో తన సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించి, ప్రధానంగా మొఘల్ సామ్రాజ్య గ్రాండ్ వజీర్, ఔధ్ నవాబు షిజా ఉద్దౌలాను వెంబడించాడు. దాంతో షియా ఉద్దౌలా తప్పించుకునేందుకు మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలంను, తన స్వంత దళాన్ని యుద్ధరంగంలో విడిచిపెట్టి నది దాటి తాను వచ్చిన పడవల వంతెనను తగలబెట్టేశాడు. తన ముప్పై లక్షల రూపాయల విలువైన రత్నాలతో పారిపోయిన మీర్ ఖాసిం తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్జా నజాఫ్ ఖాన్ చక్రవర్తి రెండవ షా ఆలం చుట్టూ సైనిక వ్యూహాన్ని తిరిగి ఏర్పరిచాడు. రెండవ షా ఆలం యుద్ధరంగం నుంచి తిరోగమించి, విజేతలైన బ్రిటీష్ వారితో రాయబారం సాగించాడు.

చరిత్రకారుడు జాన్ విలియం ఫోర్టెస్క్యూ బ్రిటీష్ సైన్యం నష్టాలు 847గా అంచనావేశాడు, యూరోపియన్ రెజిమెంటు నుంచి 39 మంది మరణించగా, 64 మంది గాయపడ్డారనీ, ఈస్టిండియా కంపెనీ సిపాయిల్లో 250 మంది మరణించగా, 435 మంది గాయపడ్డారనీ, 85 మంది అదృశ్యమయ్యారని అంచనా. బెంగాల్, బీహార్, మొఘల్ కూటమిలో 2 వేలమంది మరణించగా, మరో రెండువేల మంది గాయపడ్డారని కూడా అంచనావేశాడు. మరో మూలం ప్రకారం 69 యూరోపియన్, 664 సిపాయి నష్టాలు బ్రిటీష్ వైపున, 6 వేలమంది సైనిక నష్టం మొఘల్ వైపున జరిగింది. విజేతలు 133 ఫిరంగి దళ సామాగ్రి, పది లక్షల రూపాయల రొక్ఖం స్వాధీనం చేసుకున్నారు. యుద్ధం వెనువెంటనే మన్రో - మొఘల్ సామ్రాజ్యం, దాని నవాబులు, మైసూరు సుల్తానుల పట్ల చెక్కుచెదరని ద్వేషానికి పేరుపడ్డవారు, "యోధ జాతి" అయిన మరాఠాలకు సహకరించాలని నిర్ణయించుకున్నాడు.

అనంతర పరిణామాలుసవరించు

బక్సర్ వద్ద బ్రిటీష్ విజయంతో, "ఎగువ భారతదేశంలో మొఘల్ అధికారానికి వారసుల్లాంటి ముగ్గురు ముఖ్యులు లేకుండా పోయారు. మీర్ ఖాసిం నిరుపేదగా అజ్ఞాతంలోకి మాయమయ్యాడు, షా ఆలం బ్రిటీష్ వారితో సంధి చేసుకున్నాడు, విజేతలు చంపడానికి వెంటపడుతూండగా షియా ఉద్దౌలా పశ్చిమానికి పారిపోయాడు. మొత్తం గంగా మైదానం కంపెనీ వారి దయ మీద ఆధారపడి మిగిలింది; షుజా ఉద్దౌలా క్రమేణా లొంగిపోయాడు; దాంతో కంపెనీ దళాలు అవధ్, బీహార్ ప్రాంతాలంతటా కూడా అధికారం ఇవ్వగల దళారీలయ్యాయి".[5]

బొమ్మలుసవరించు

ఇది కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. Sen, Sailendra Nath (2009). History Of The Freedom Movement In India (1857-1947). New Age International. ISBN 9788122425765.
  2. Fortescue, John William. (2004). A History of the British Army: Volume III. p. 102. The Naval and Military Press. Uckfield, Sussex. ISBN 978-1843427155.
  3. Parshotam Mehra (1985). A Dictionary of Modern History (1707–1947). Oxford University Press. ISBN 0-19-561552-2.
  4. Sir Edward Cust, Annals of the Wars of the Eighteenth Century, Vol. 3, p. 113, గూగుల్ బుక్స్ వద్ద, Mitchell's Military Library (1858). ISBN 1235663922
  5. Keay, John. (1993). The Honourable Company: A History of the English East India Company. Paperback edition. p. 374. HarperCollins Publishers. London. ISBN 978-0-00-638072-6.

బయటి లింకులుసవరించు