బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి

బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి (1894–1978) ఒక భారతీయ గోటువాద్య కళాకారుడు.[1]

బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి
వ్యక్తిగత సమాచారం
జననం1894
అందనల్లూర్, తంజావూరు జిల్లా, తమిళనాడు
మరణం1978
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివాద్య కళాకారుడు
వాయిద్యాలుచిత్రవీణ

ఆరంభ జీవితం

మార్చు

ఇతడు 1894లో తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని అందనల్లూర్ గ్రామంలో సంగీతకారుల కుటుంబంలో జన్మించాడు[2]. ఇతని తండ్రి సేతురామశాస్త్రి ఒక హరికథా కళాకారుడు. కృష్ణమూర్తిశాస్త్రి మొదట కర్ణాటక సంగీతాన్ని తన తండ్రి వద్ద నేర్చుకున్నాడు. తరువాత ఇతడు కోనేటిరాజపురం వైద్యనాథ అయ్యర్, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్‌ల వద్ద సంగీతశిక్షణ కొనసాగించాడు. ముత్తయ్య భాగవతార్ కొన్నిసార్లు తంబురను గోటువాద్యంలా ఉపయోగించేవాడు. అది ఇతనికి ప్రేరణను కలిగించి గోటువాద్యం పట్ల ఆకర్షితుడైనాడు.

వృత్తి

మార్చు

శాఖ రామారావు[2], గోటువాద్యం నారాయణ అయ్యంగార్‌ల వద్ద ఇతడు గోటువాద్యం నేర్చుకోవడం ఇతని జీవితంలో పెద్ద మలుపు. ఇతడు గోటువాయిద్యానికి ప్రజాదరణను తీసుకువచ్చాడు. ఇతడు వరుసగా 38 సంవత్సరాలు గోటువాద్య కచేరీలు నిర్వహించాడు. ప్రాచీనమైన ఈ వాయిద్యంపై ప్రయోగాలు జరిపి తనదంటూ ఒక అసమానమైన శైలిని అభివృద్ధి చేసి సంగీత విద్వాంసులను, రసికులను ఆకట్టుకున్నాడు. ఇతడు మద్రాసులోని కేంద్ర కర్ణాటక సంగీత కళాశాలలో, అడయార్‌లోని కళాక్షేత్రలో అధ్యాపకునిగా పనిచేశాడు. కళాక్షేత్రకు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు.

ఇతడు చిత్రవీణ నరసింహన్, గాయత్రి కస్సెంబం, ఎన్.రవికిరణ్ మొదలైన గోటువాద్య కళాకారులకు ప్రేరణ కలిగించాడు. ఇతని శిష్యులలో డి.పశుపతి, ఎస్.ఆర్.జానకీరామన్, మణి కృష్ణస్వామి మొదలైన వారున్నారు.

ఇతనికి కేంద్ర సంగీత నాటక అకాడమీ 1958లో కర్ణాటక సంగీత వాద్యపరికరాల విభాగంలో అవార్డును ప్రకటించింది.

ఇతడు తన 84వ యేట 1978లో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Budalur KrishnamurtI Sastri". www.carnatica.net. Retrieved 2019-10-24.
  2. 2.0 2.1 web master. "Badalur Krishnamurthi Sastri". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 9 March 2021.[permanent dead link]