బడుగుల లింగయ్య యాదవ్

బడుగుల లింగయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యాడు.[1]

బడుగుల లింగయ్య యాదవ్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
4 ఏప్రిల్ 2018 – ప్రస్తుతం
ముందు రాపోలు ఆనంద భాస్కర్, కాంగ్రెస్ పార్టీ

వ్యక్తిగత వివరాలు

జననం 13 జూన్ 1957
భీమవరం గ్రామం, కేతేపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి నాగమణి
నివాసం జేజే నగర్, సూర్యాపేట & హైదరాబాద్

జననం, విద్యాభాస్యం

మార్చు

బడుగుల లింగయ్య యాదవ్ 13 జూన్ 1957లో తెలంగాణ రాష్ట్రం , నల్గొండ జిల్లా , కేతేపల్లి మండలం , భీమవరం గ్రామం లో బి. అంతయ్య, ఎలమంచమ్మా దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1983లో బీఏ, 1983లో బీఈ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

బడుగుల లింగయ్య యాదవ్ 1982లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన బీమారం గ్రామంలో ఎంపిటిసిగా పోటీ చేసి గెలిచాడు. లింగయ్య యాదవ్ పదేండ్ల పాటు కేతేపల్లి పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా, 11 సంవత్సరాలు నల్గొండ జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు.ఆయన 2009లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. లింగయ్య యాదవ్ 16 మార్చి 2015న తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు.బడుగుల లింగయ్య యాదవ్ 2018లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4][5] బడుగుల లింగయ్య యాదవ్ 26 జనవరి 2022న సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6]

మూలాలు

మార్చు
  1. Mana Telangana (12 March 2019). "కెసిఆర్‌ను కలిసిన రాజ్యసభ సభ్యులు". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  2. New Indian Express, Home States Telangana (12 March 2018). "Telangana CM KCR picks nephew Joginapally Santosh Kumar, two Backward Community leaders for Rajya Sabha elections". The New Indian Express. Archived from the original on 7 April 2021. Retrieved 7 April 2021.
  3. Sakshi (12 March 2018). "టీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ ఒకటి". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  4. Namasthe Telangana (28 May 2021). "మెడికల్ కిట్స్‌ను అందజేసిన ఎంపీ బడుగుల". Archived from the original on 10 జూలై 2021. Retrieved 10 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. The Financial Express (23 March 2018). "Telangana Rajya Sabha Election 2018 Result: TRS candidates B Prakash, B Lingaiah Yadav and J Santosh Kumar elected". Archived from the original on 10 July 2021. Retrieved 10 July 2021.
  6. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.