బనావలీ (దేవనాగరి: बनावली) భారతదేశంలోని హర్యానాలోని ఫతేహాబాదు జిల్లాలో సింధు లోయ నాగరికత కాలానికి చెందిన పురావస్తు ప్రదేశం. ఇది కాలిబంగనుకు ఈశాన్యంగా 120 కిలోమీటర్ల దూరంలో, ఫతేహాబాదు నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకు ముందు వనవాలి అని పిలువబడే బనావాలి ఎండిపోయిన సరస్వతి నది ఎడమ ఒడ్డున ఉంది.[1] ఎండిపోయిన సరస్వతి నది దిగువ మధ్య లోయలో స్థాపించబడిన పట్టణం కలిబంగనుతో పోల్చినప్పుడు బనావలీ సరస్వతి నది ఎగువ మధ్య లోయ మీద నిర్మించబడింది.[2]

బనావలీ
బనావలీ is located in Haryana
బనావలీ
Shown within Haryana
బనావలీ is located in India
బనావలీ
బనావలీ (India)
స్థానంBaguwali, Haryana, India
నిర్దేశాంకాలు29°35′54″N 75°23′31″E / 29.59833°N 75.39194°E / 29.59833; 75.39194
రకంSettlement
చరిత్ర
పీరియడ్‌లుHarappan 3A to Harappan 5
సంస్కృతులుIndus Valley Civilization
స్థల గమనికలు
పురాతత్వవేత్తలుR. S. Bisht

త్రవ్వకాలు

మార్చు

ఈ ప్రదేశంలో ఆర్.ఎస్. బిష్టు (ఎ.ఎస్.ఐ) నిర్వహించిన త్రవ్వకాలలో ఈ క్రింది సంస్కృతుల క్రమం వెల్లడైంది:[3]

  • మొదటి కాలం : హరప్పా సంస్కృతికి ముందు (కలిబంగన్) (క్రీ.పూ .2500-2300)[1]
  • మొదటి ఎ కాలం: రక్షణకు ముందు దశ
  • మొదటి బి కాలం: రక్షణ దశ
  • ఐ.సి.కాలం : పరివర్తన దశ (ప్రోటో-హరప్పా)
  • రెండవ కాలం : పరిపక్వ హరప్పా(క్రీ.పూ.2300-1700) [1]
  • మూడవ కాలం: హరప్పా అనంతర (బనావలీ-బారా) (క్రీ.పూ .1700-1500 / 1450) [1]

మొదటి కాలం (c.క్రీ.పూ. 2500-2300)

మార్చు

ఈ కాలం ప్రణాళికా బద్ధంగా అచ్చుద్వారా తయారు చేసిన ఇటుకలతో నిర్మించిన నివాసగృహాలు, వాజు, కూజాలతో కూడిన మృణ్మయ పాత్రలు రూపకల్పన ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించబడింది. కుండల నమూనాలు మొదటి కాళిబాంగు మాదిరిగానే ఉంటుంది.[1]

ద్వితీయ కాలం (c.క్రీ.పూ. 2300-1700)

మార్చు

ఈ స్థలంలో 105 మీ కంటే అధికమైన పొడవు, 4.5 మీ ఎత్తు, 6 మీ వెడల్పు ఉన్న రక్షణ ప్రాకారం కనుగొనబడింది.[1] బాగా ప్రణాళికాబద్ధమైన హరప్పా శైలి చదరంగక్రీడ బల్ల ఆకారంలో నిర్మించబడిన శక్తివంతమైన పట్టణం, ఈ కాలంలో 200 మీ x 500 మీ వైశాల్యం కలిగిన పట్టణం [4] ఈ కాలంలో స్థాపించబడింది.[1] ఈ శక్తివంతమైన ప్రాంతం రెండు ప్రక్కనే కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది. ఒకటి పాలకవర్గానికి మరొకటి సాధారణ ప్రజలకు.[1] సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన ప్రాంతంలో ఉత్తర-దక్షిణ రహదారులతో కూడిన నివాసగృహ వాటిక లంబ కోణాలలో కత్తిరించబడతాయి. ఇవి తూర్పు-పడమర దారుల ద్వారా మరింత అనుసంధానించబడి ఉంటాయి.[1] వీధుల పట్టణ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. దారులకు ఇరువైపులా నిర్మించిన ఇళ్లలో ఎర్త్ ఫ్లోర్, మట్టి ప్లాస్టర్ గోడలు, గదులు, వంటగది, టాయిలెట్ ఉన్నాయి. ఇళ్ళు స్టో కలిగి ఉన్నాయి.[5]

మూడవ కాలం (c.క్రీ.పూ. 1700-1500/1450)

మార్చు

ఈ కాలం " బారా సంస్కృతి " కి ప్రాధాన్యత వహిస్తుంది. ఇది చివరి హరప్పా, హరప్పా తరువాత సంస్కృతిగా రూపాంతరం చెందింది. [1]

వాస్తుకళ

మార్చు

" పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా" ఈ ప్రదేశంలో తవ్వకం చేసి హరప్పా కాలానికి చెందిన బాగా నిర్మించిన కోట పట్టణం, హరప్పా కాలానికి చెందిన విస్తృతమైన ప్రోటో-అర్బను సెటిల్మెంటును వెల్లడించింది.[6] 4.5 మీటర్ల ఎత్తు, 6 మీటర్ల మందంతో నిర్మించబడిన ఒక రక్షణ గోడ కనుగొనబడింది. ఇది 105 మీటర్ల దూరం వరకు విస్తరించినట్లు కనుగొనబడింది.[1] మట్టిగోడలతో అంతస్తులతో నిర్మించబడిన నివాసగృహాలు, గదులు, మరుగుదొడ్లతో చక్కగా ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. వీధులు, సందులకు ఇరువైపులా ఇళ్ళు నిర్మించబడ్డాయి.[1]

కోట సమీపంలో ఆగ్నేయ ప్రాంతాల 'దిగువ పట్టణం' నుండి అక్రోపోలిసు వరకు దశలవారీగా పెరుగుతోంది. ఎ.ఎస్.ఐ. దీనిని ముఖ్యమైన నిర్మాణంగా భావిస్తుంది.[7] 'దిగువ పట్టణం' మెట్ల నిర్మాణం సమీపంలో ఒక బురుజు నిర్మించబడింది.[7]

నివాస గృహాలు

మార్చు

వంటగది, మరుగుదొడ్డి ఉన్న బహుళ గదుల ఇంట్లో. అనేక ముద్రలు, బరువులు కనుగొనబడ్డాయి. ఇది ఇంటి యజమాని ఒక వ్యాపారి అయి ఉండవచ్చని సూచిస్తుంది.[4] ఒక పెద్ద ఇల్లు పెద్ద సంఖ్యలో బంగారు పూసలు, లాపిసు లాజులి, కార్నెలియను, చిన్న బరువులు, బంగారు గీతలతో కూడిన 'టచి స్టోను '(గీటురాయి) వంటి రాయిని వెల్లడించింది. ఈ ఇల్లు ఆభరణాల లేదా ఆభరణాల తయారీదారుడికి చెందినదని సూచిస్తుంది.[4]బనావాలిలోని అనేక గృహాలు యఙకుండాలు సాక్ష్యాలను కలిగి ఉన్నాయి. ఇవి కర్మ ప్రయోజనాలను సూచించే పురోహితుల నిర్మాణాలతో కూడా సంబంధం కలిగి ఉన్నాయి.[4]

చేపట్టబడిన కళాఖండాలు

మార్చు

ఎస్-ఆకారపు జాడి, వంట పాత్రలు, ఓవెన్లు, తాండూర్లు, రంగులద్దిన మట్టి కుండలు మొదలైనవి కనుగినబడ్డాయి. పులి, ఖడ్గమృగం, అడవి మేక, ఐబెక్సు, యునికార్ను, మిశ్రమ జంతువు చిత్రాలను మోస్తున్న హరప్పను సీల్సు, బంగారం, రాగి, కంచు ముక్కలు, బంగారు పూసలు, రాగి, లాపిసు లాజులి, పెంకుల గాజులు మొదలైనవి.[1][2] దొరికిన కుండలు హరప్పా కుండలతో చక్కగా పోల్చవచ్చు. కుండల సమ్మేళనం కలిబంగని సమ్మేళనానికి చాలా పోలిక ఉంటుంది.[1]

ప్రాముఖ్యత

మార్చు

1987-88లో రెండు ముఖ్యమైన అన్వేషణలలో[7]

  1. ఒకటి అప్లిక్యూలో రెండు బుక్రేనియను మూలాంశాలతో అలంకరించబడిన బూడిద రంగు పాత్రలు, ఇది కోటు-డిజి, కలిబంగను మొదలైన వాటి కంటే అధికంగా పూర్వ-హరప్పా కుండల మీద వర్ణాలతో ఇంచుమించుగా బోవిను తలను పోలి ఉంటుంది.
  2. మరొకటి కాల్చని బంకమట్టి బొమ్మ, దీని వెనుక భాగంలో, మెడ ఒక వైపున లోతైన కట్ క్రిస్-క్రాస్ కోతలను కలిగి ఉంటుంది. తద్వారా ఇది గుర్రం రూపాన్ని ఇస్తుంది. ఎందుకంటే పూర్వం జీను, తరువాతిది మేను సూచిస్తుంది.[7]
  3. ఇతర అన్వేషణలలో దంతపు దువ్వెన, చెక్కిన గాడిదతో కూడిన టెర్రకోట కేకు, మానవ బొమ్మలు - మగ, ఆడ ఇద్దరూ, తాబేలు షెలు మొదలైనవి లభించాయి.[7] బంగారం, వెండి మొదలైన అనేక వస్తువులు కూడా దొరికాయి.

బనావలీ, కలిబంగను పట్టణ జీవితం హటాత్తుగా అదృశ్యం ఉంది.[4]

ఇతర పరిశోధనలు

మార్చు

బనావలీలో అంతకుముందు ఇటుకలు కలిబంగను నిష్పత్తి 3: 2: 1 గా ఉన్నాయి. కాని తరువాత ఇటుకలకు 4: 2: 1 నిష్పత్తి ఉంది. 87.855 గ్రాముల బరువు, 100 రెట్లు 0.857 గ్రాములు (హరప్పాలో మరింత సాధారణ బరువు) ఉన్నట్లు ఒక బరువు కనుగొనబడింది. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న గోడ సరస్వతి నది వరదలను ఎదుర్కొనే అవకాశం ఉంది. జలప్రవాహ ఉధృతి కారణంగా గోడ కూలిపోయింది. [5] బనావలీ వద్ద, హరిప్పా, కాలిబంగను వద్ద సముద్రపు షెల్సు ఉన్నాయి. ఇవి సముద్ర తీరానికి దూరంగా ఉన్నాయి. అందువలన సింధు కాలం ప్రారంభంలో ప్రాంతాల మధ్య అంతర్గత వాణిజ్యాన్ని సూచిస్తాయి.[5] సీల్సు దిగువ పట్టణంలో మాత్రమే కనుగొనబడ్డాయి. సిటాడెలులో కాదు; అనేక చిన్న రాతి బరువులు, టెర్రకోట నాగలి నమూనా కూడా కనుగొనబడ్డాయి.[4]ఈ ప్రదేశంలో, హరప్పాలోని మొహెంజదారో వద్ద పెద్ద సంఖ్యలో ఆడ బొమ్మలు కనిపిస్తాయి.[4] బంగారు గీతలు కలిగిన గీటురాయి కనుగొనబడింది. ఇది బంగారం స్వచ్ఛతను పరీక్షించడానికి ఉపయోగించబడింది. (ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఉపయోగించబడుతున్న సాంకేతికత).[8]

కనుగొన్నవి పునర్నిర్మించబడ్డాయి. అయినప్పటికీ హరప్పా శకం బావి బాగా సంరక్షించబడింది. గ్రామం, ప్రాచీనతకు సాక్ష్యంగా నిలుస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 Archaeological Survey of India. "Excavations - Banawali". website. Retrieved 22 ఏప్రిల్ 2016.
  2. 2.0 2.1 fatehabad.nic.in
  3. Joshi, M.C. (1993). "Indian Archaeology - A Review, 1987-88" (PDF). Archaeological Survey of India. pp. 23–7. Archived from the original (PDF) on 5 మార్చి 2016. Retrieved 5 నవంబరు 2009.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. pp. 152–153, 171, 179. ISBN 9788131711200.
  5. 5.0 5.1 5.2 McIntosh, Jane R. (2008). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. p. 229. ISBN 9781576079072.
  6. S.R.Rao, (1991) Dawn and Devolution of Indus Civilisation, Aditya Prakashan, New Delhi
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Indian Archaeology - A Review, 1987-88, page 21-27
  8. Lal, B.B. (2002). The Sarasvatī flows on : the continuity of Indian culture. New Delhi: Aryan Books International. p. 147. ISBN 9788173052026.

వెలుపలి లింకులు

మార్చు

మూస:Indus Valley Civilization మూస:Haryana

"https://te.wikipedia.org/w/index.php?title=బనావలీ&oldid=4078567" నుండి వెలికితీశారు