బన్షీ నారాయణ దేవాలయం (ఉత్తరాఖండ్)

బన్షీ నారాయణ్ ఆలయం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా ఉర్గామ్ వ్యాలీలో నెలకొనిఉన్న వైష్ణవాలయం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఐదవ అవతారం అయిన వామనావతారం నుండి విముక్తి పొందిన తర్వాత విష్ణువు మొదటిసారి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతారు.

బన్షీ నారాయణ దేవాలయం
పేరు
ఇతర పేర్లు:బన్సీ నారాయణ్ ఆలయం,
వంశీనారాయణ ఆలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఉత్తరాఖండ్
జిల్లా:చమోలి జిల్లా
ప్రదేశం:ఉర్గామ్ వ్యాలీ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:విష్ణువు
ప్రధాన పండుగలు:రాఖీ పౌర్ణమి (ఈ రోజు మినహా దేవాలయం సంవత్సరం పొడవునా మూసి ఉంటుంది)

ఎంతో విశిష్టమైన ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయం ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. కేవలం రాఖీ పౌర్ణమి రోజున మాత్రమే ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.[1] శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ పౌర్ణమి పర్వదినం జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున శ్రావణ పౌర్ణమి, జంద్యాల పూర్ణిమగా కూడా హిందూవులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయ విశిష్టత

మార్చు

బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు వామనునిగా అవతరించాడు. ఇంతలో ఆయన విష్ణువునే తన ద్వారపాలకుడిగా నియమించుకున్నాడు. దీంతో తన భర్త విష్ణువుని తిరిగి తీసుకురావాడానికి లక్ష్మీదేవి, నారదమునిని పరిష్కారం కోరగా బలి చక్రవర్తికి రాఖీ (రక్షా బంధన్) కట్టమని సూచించాడు. అప్పటి నుంచే రాఖీ పండగను జరుపుకోవడం ప్రారంభమైందని విశ్వాసం.

ఈ ఆలయం ఏడాది పొడవునా పూర్తిగా మూసి ఉంచి రాఖీ పండుగ రోజున మాత్రమే తెరుస్తారు. ఆ రోజున స్థానిక ప్రజలు ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఈ ఆలయంలోనే రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ స్వామివారికి నివేదించే ప్రసాదం తయారుచేయడానికి పరిసర గ్రామాల భక్తుల నుండి వెన్నను సేకరిస్తారు. ఈ ఆలయంలో విష్ణువుతో పాటు శివుడు, గణేశుని విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి.[2]

ఎలా చేరుకోవాలి

మార్చు

శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఆలయం స్థానికంగా వంశీనారాయణ ఆలయంగా ప్రసిద్దిచెందింది. ఈ ఆలయం ఉర్గామ్ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రైన్ లో వచ్చే ప్రయాణికులు, దగ్గరలోని హరిద్వార్ రిషికేశ్ రైల్వే స్టేషన్‌లో దిగాలి. రిషికేశ్ నుండి దాదాపు 225 కి.మీ. దూరంలో ఉండే జోషిమఠం చేరాలి. ఇక్కడ నుంచి 10 కి.మీ దూరంలో ఉర్గామ్ గ్రామం ఉంది. ఇక్కడ నుంచి కాలినడకన బన్షీ నారాయణ దేవాలయం చేరుకోవాలి.

పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఈ దేవాలయం ట్రెక్కింగ్ చేస్తూ కూడా చాలా మంది చేరుకుంటారు.

మూలాలు

మార్చు
  1. "Bansi Narayan Temple: ఈ ఆలయం వెరీ వేరీ స్పెషల్.. ఒక్క రాఖీ రోజు మాత్రమే తెరుచుకుంటుంది.. ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సిందే.. - Telugu News | Uttarakhand urgam valley temple bansi narayan only open on raksha bandhan day | TV9 Telugu". web.archive.org. 2023-08-27. Archived from the original on 2023-08-27. Retrieved 2023-08-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "రాఖీ నాడు మాత్రమే తెరుచుకునే ఆలయం.. విష్ణు అవతారం ఇక్కడేనట! | Banshi Narayan Mandir In Uttarakhand Opens Only On Raksha Bandhan - Sakshi". web.archive.org. 2023-08-27. Archived from the original on 2023-08-27. Retrieved 2023-08-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)