బన్సూరి స్వరాజ్
బన్సూరి స్వరాజ్ (జననం 1984 జనవరి 3) ఒక భారతీయ న్యాయవాది. ఆమె భారతీయ రాజకీయ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె.[1][2]
బన్సూరి స్వరాజ్ | |
---|---|
జననం | న్యూఢిల్లీ, భారతదేశం | 1984 జనవరి 3
వృత్తి | న్యాయవాది, రాజకీయవేత్త |
తల్లిదండ్రులు | సుష్మాస్వరాజ్ (తల్లి), స్వరాజ్ కౌశల్ (తండ్రి) |
నేపథ్యం
మార్చుబన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీలో 1984 జనవరి 3న సుష్మాస్వరాజ్, స్వరాజ్ కౌశల్ దంపతులకు జన్మించింది. ఆమె తల్లి భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా పార్లమెంటు సభ్యురాలు, కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసింది. ఇక తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది. స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నరుగానూ పనిచేశాడు.
కెరీర్
మార్చుబన్సూరి స్వరాజ్ వార్ విక్ యూనివర్శిటీలో్ ఇంగ్లీషు సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది. అనంతరం ఆమె లండన్ బీపీపీ లా స్కూలులో న్యాయవిద్యను అభ్యసించింది. బారిస్టర్ లా పూర్తి చేసిన ఆమె ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది. ఆమె హర్యానా రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేస్తున్నది.
స్వర్గీయ సుష్మా స్వరాజ్ వారసురాలిగా మార్చి 2023లో ఆమె ఢిల్లీ భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా నియమితులయింది.[3] 2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది.[4]
మూలాలు
మార్చు- ↑ The Hindu (21 May 2024). "Politics wasn't first choice as career; always wanted to serve nation: Bansuri Swaraj" (in Indian English). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ Hindustan Times (2 March 2024). "Meet Bansuri Swaraj, Sushma Swaraj's daughter, who's making her Lok Sabha debut" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
- ↑ "Sushma Swaraj:రాజకీయాల్లోకి సుష్మాస్వరాజ్ కుమార్తె...ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా బన్సూరి స్వరాజ్ | Sushma Swaraj daughter takes political plunge Bansuri Swaraj sks". web.archive.org. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2024-03-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "లోక్‌సభ బరిలో డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్ | Elections 2024: Sushma Swaraj Daughter Bansuri Poll Debut Details - Sakshi". web.archive.org. 2024-03-03. Archived from the original on 2024-03-03. Retrieved 2024-03-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)