బర్వానీ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బర్వానీ జిల్లా (హిందీ:बड़वानी जिला) ఒకటి. బరేలి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా వైశాల్యం 3,665 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 10,81,039.

బర్వానీ జిల్లా
बड़वानी जिला
మధ్య ప్రదేశ్ పటంలో బర్వానీ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో బర్వానీ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఇండోర్
ముఖ్య పట్టణంబర్వానీ
Area
 • మొత్తం3,665 km2 (1,415 sq mi)
Population
 (2011)
 • మొత్తం13,85,659
 • Density380/km2 (980/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత50.23%
 • లింగ నిష్పత్తి981
Websiteఅధికారిక జాలస్థలి
బర్వానీలో కొండలపై సూర్యాస్తమయం

సరిహద్దులు మార్చు

బరేలి జిల్లా ఉత్తర సరిహద్దులో నర్మదానది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో సప్తపురా పర్వతశ్రేణి ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో మాహారాష్ట్ర రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రం, ఉత్తర సరిహద్దులో ధార్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఖర్‌గోన్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర మార్చు

1948 సమైక్య భారతంలో బర్వానీ రాజాస్థానం విలీనం తరువాత ఈ ప్రాంతం సరికొత్తగా రూపొందించబడిన మధ్యభారత్ రాష్ట్రంలోని ఖర్‌గోన్ (పశ్చిమ నిమర్) జిల్లాలో భాగం అయింది. 1998 మే మాసంలో ఖర్‌గోన్ జిల్లాలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బర్వానీ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు మార్చు

  • జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : బర్వని, సెంధ్వ
  • జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి : తాలూకాల్లో, బర్వని, సెంధ్వ, పన్సెమల్, నివలి, థికరి, పతి, అంజద్, రాజ్పూర్
  • జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : బర్వని, పతి, సెంధవ, పన్సెమల్, నివలి, థికరి, రాజ్పూర్.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పన్సెమల్ ( పన్సెమల్, నివాలి), బర్వానీ (బర్వాని, పతి) సెంధ్వ,, రాజ్పూర్ (రాజ్పూర్ + అంజద్ + థికరి).
  • ఖర్గొనే పార్లమెంటు నియోజకవర్గం :-బర్వని, సెంధవ, పన్సెమల్, రాజ్పూర్
  • జిల్లాలో 2 పురపాలితాలు ఉన్నాయి :- బర్వాని, సెంధ్వా.

జిల్లాలో 417 గ్రామ మపచాయితీలు, 646 గ్రామాలు, 576 రెవెన్యూలు, 70 ఆటవీ ప్రాంతాలు ఉన్నాయి. 560 జనావాస గ్రామాలు, 16 నిర్జన గ్రామాలు ఉన్నాయి.

ఆర్ధికం మార్చు

సెంధ్వా కాటన్ జిన్నింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. జిల్లాలో అదనంగా ఉన్న పత్తి పరిశ్రమలు వేలాది ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో సంజయ్ కాటన్ ఫైబర్ అతిపెద్ద కాటన్ ఫ్యాక్టరీగా గుర్తినబడుతుంది.

ఆలయాలు మార్చు

  • అంజాద్ :- వీరేశ్వర్ మహాదేవ్, గాయత్రి ఆలయం, మాతా నగరి మాత ఆలయం నగరంలో ప్రముఖ ఆలయాలుగా గుర్తినచబడుతున్నాయి.
  • బవంగజ :- ఇది ఒక ప్రముఖ జైన ఆలయంగా గుర్తినబడుతుంది. బర్వానీ పట్టణానికి ఇది 6 కి.మీ దూరంలో ఉంది.
  • ప్రపంచంలో అతిపెద్ద జైన శిల్పంగా గుర్తించబడుతున్న జైన తీర్ధంకర " అజిత్జీ " శిల్పం.
  • జిల్లాలో 15వ శతాబ్ధానికి చెందిన హిందూ ఆలయాలు ఉన్నాయి. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు ఇక్కడ నిర్యాణం చెందారని విశ్వసిస్తున్నారు.
  • సప్తపురా పర్వతావళిలో పురాతన భవర్ గర్ పురాతన కోట ఉంది.
  • సెంధ్వాకు దక్షిణంగా 20కి.మీ దూరంలో సెంధ్వా సమీపంలో ఉన్న బీజసన్ ఆలయంలో బీజశని (దుర్గా) ప్రధాన దైవంగా ఉంది.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 13,85,659, [2]
ఇది దాదాపు. స్విడ్జర్లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 345 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 256 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.55%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 881:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 50.23%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

జిల్లాలోని ప్రజలలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. బరేలి పాల్యా, భిల్లు భాష 10,000 మంది ప్రజలలో వాడికలో ఉంది. ;[5] బరేలీ ప్యూరీ భాషకు 1,75,000 మంది వాడకందార్లు ఉన్నారు. దీనిని దేవనాగరి లిపిలో వ్రాస్తుంటారు.[6], బరేలి రాథ్వి భాష 64,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. [7] భిలాలి భాష 1 150 000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[8]

వెలుపలి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  5. M. Paul Lewis, ed. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "Bareli, Pauri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  7. M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  8. M. Paul Lewis, ed. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.