బర్సైటిస్

తరచుగా పునరావృతమయ్యే కదలికలు ఉన్న కీళ్ల దగ్గర బర్సిటిస్ సంభవిస్తుంది

బర్సైటిస్ అనేది బర్సె అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ద్రవం నిండిన తిత్తుల వాపు లేదా వాపు. [2] దీనినే కాపు తిత్తుల వాపు అని కూడా అంటారు. ఈ తిత్తులు ఒక పలుచని పొరతో కప్పబడి ఉంటాయి, ఇవి సరళత కలిగిన సమతుల్య ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి .[3] ఈ తిత్తులు కీళ్ల దగ్గర ఎముకలు, స్నాయువులు (టెండన్స్), కండరాలను మెత్తగా దిండు లాగా ఉండి ఆధారముగా ఉంటాయి. బర్సే ఎర్రబడినప్పుడు బర్సిటిస్ సంభవిస్తుంది. సాధారణంగా భుజం, మోచేయి, తుంటిలో కాపు తిత్తుల వాపు సంభవిస్తుంది. కానీ మోకాలి మడమ, బొటనవేలు క్రింద కూడా బర్సైటిస్ ఉండవచ్చు. తరచుగా పునరావృతమయ్యే కదలికలు ఉన్న కీళ్ల దగ్గర బర్సిటిస్ సంభవిస్తుంది.[4]

బర్సైటిస్
ఇతర పేర్లుకాపు తిత్తుల వాపు
ఒలెక్రానాన్ బర్సిటిస్ కి ఉదాహరణ
ప్రత్యేకతఆర్థోపెడిక్స్
లక్షణాలుSwelling, difficulty moving, tenderness, pain[1]
సంక్లిష్టతలుసెప్టిక్ బర్సైటిస్
రకాలుసెప్టిక్, సెప్టిక్ కానిది
కారణాలుమితిమీరిన వినియోగం, సంక్రమణాలు, గాయం శోథ రుగ్మతలు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు, పరీక్షలు
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతికీళ్ళనొప్పులు, పగుళ్లు, స్నాయువు నరాల సమస్యలు
చికిత్సవిశ్రాంతి, మంచు గడ్డ ఉంచడం , నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs)
తరుచుదనముసాధారణం

బర్సైటిస్ వలన ప్రభావిత భాగం కదపడం లో కష్టం , సున్నితత్వం, నొప్పి ఉండవచ్చు.[1] ప్రారంభంలో బర్సైటిస్ తో నొప్పి ఉండకపోవచ్చు, కానీ క్రమంగా నొప్పి ఏర్పడుతుంది.[2] సెప్టిక్ బర్సైటిస్ లాంటి సంక్లిష్టతలు ఏర్పడవచ్చు .[5]

కారణాలు

మార్చు

బర్సైటిస్ కు కారణాలు శరీర భాగాన్ని మితిమీరిన వినియోగం, సంక్రమణాలు, గాయం, శోథ రుగ్మతలు వంటివి. మానవ శరీరంలో 150 కంటే ఎక్కువ బర్సే ఉంటాయి.[3] సాధారణంగా ప్రీపెటెల్లార్, ఒలెక్రానన్, ట్రోచాన్టెరిక్, రెట్రోకాల్కెనాల్ రకాలు ప్రభావితమవుతాయి. కండరాలు, స్నాయువులు, ఇతర కణజాలాలు ఎముక ప్రముఖంగా ఉండే శరీర భాగాలలో బర్సే ఉంటాయి. సాధారణంగా అవి కణజాలాల మధ్య కదలికను మెరుగుపరచడానికి పనిచేస్తాయి.[2] రోగనిర్ధారణ సాధారణంగా లక్షణాలు, పరీక్ష ఆధారంగా ఉంటుంది, అదనపు పరీక్షల మద్దతు కూడా తీసుకోవచ్చు.[5][2] అయితే ఇలాంటి లక్షణాలు ఇతర కారణాల వలన అంటే కీళ్ళనొప్పులు, పగుళ్లు, స్నాయువు నరాల సమస్యలు మొదలగువాటి వలన కూడా సంభవిస్తాయి.[5] వయసు పెరుగుతున్న కొలది ఈ వ్యాధి సంభావ్యతకు అనుకూలం. ఇంకా కీళ్ళ వాతము, గౌట్ వ్యాధి, మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఈ ప్రభావం ఎక్కువ.[4]

నివారణ చికిత్స

మార్చు

చికిత్స సాధారణంగా విశ్రాంతి తీసుకోవడము , పనుల మధ్య విశ్రాంతి ఏర్పరచుకోవడం, మంచు గడ్డ ఉంచడం , నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs) సిఫారసు చేస్తారు.[5][2] స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా శస్త్రచికిత్సను అరుదుగా ఉపయోగిస్తారు [5] అయితే దీర్ఘకాలిక బర్సైటిస్ లో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ఇస్తారనడానికి ఆధారాలు 2020 నాటికి కూడా లేవు.[2] మోకాలి రక్షణ పాడ్ లు వాడడం, బరువులు జాగ్రత్తగా ఎత్తడం, ఎక్కువ బరువులు లాగకుండా చూసుకోవడము, బరువు పెరగకుండా జాగ్రత్త పడడము, వ్యాయామము వలన ఈ వ్యాధిని కొంత నియంత్రణలో ఉంచుకోవచ్చు.[4] బర్సైటిస్ కు సాధారణంగా పురుషులు స్త్రీలు సమానంగా ప్రభావితమవుతారు [2]

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 (June 2018). "Common Soft Tissue Musculoskeletal Pain Disorders.".
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Williams, Christopher H.; Sternard, Britni T. (15 August 2020). "Bursitis". Bursitis. StatPearls Publishing. Archived from the original on 1 December 2020. Retrieved 23 September 2020.
  3. 3.0 3.1 Vigorita, Vincent J.; Ghelman, Bernard; Mintz, Douglas (2008). Orthopaedic Pathology (Second ed.). Philadelphia: Lippincott Williams and Wilkins. pp. 719. ISBN 978-0-7817-9670-5.
  4. 4.0 4.1 4.2 "Bursitis". Mayo Clinic. Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 (June 2011). "Four common types of bursitis: diagnosis and management.".