బలిరెడ్డి సత్యారావు
బలిరెడ్డి సత్యారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చోడవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశాడు.
బలిరెడ్డి సత్యారావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1989 - 1994 1999 - 2004 | |||
ముందు | గంటా శ్రీనివాసరావు | ||
---|---|---|---|
తరువాత | కరణం ధర్మశ్రీ | ||
నియోజకవర్గం | చోడవరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1936 పీఎస్‌పేట, చోడవరం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 27 సెప్టెంబర్ 2019 విశాఖపట్నం జిల్లా | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | విశాఖపట్నం జిల్లా |
రాజకీయ జీవితం
మార్చు- 1962లో చోడవరం పంచాయతీ వార్డు మెంబరుగా ఎన్నికయ్యాడు.
- 1981–86 వరకు రావికమతం సమితి అధ్యక్షుడిగా పని చేశాడు.
- 1986–89వరకు విశాఖ జిల్లా డీసీసీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
- 1989లో చోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మధ్యతరహా నీటిపారుదల శాఖామంత్రిగా పని చేశాడు.
- 1999లో ఎమ్మెల్యేగా రెండోసారి గెలవడంతోపాటు విశాఖ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.
- 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందగా, డీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ జిల్లాలో కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేల విజయానికి కృషి చేశాడు.
- 2005లో జిల్లాకేంద్రసహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.
- 2007– రెండోసారి డీసీసీఅధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.
- 2011లో విశిష్ట సహకార వేత్త పురష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.
- 2012 నుంచి వైఎస్సార్ సీపీలో చేరాడు.
మరణం
మార్చుబలిరెడ్డి సత్యారావు 27 సెప్టెంబర్ 2019న విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయనను ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.[1][2]
మూలాలు
మార్చు- ↑ V6 Velugu (27 September 2019). "రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి మృతి" (in ఇంగ్లీష్). Archived from the original on 25 January 2022. Retrieved 25 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (28 September 2019). "దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం". Archived from the original on 31 October 2020. Retrieved 25 January 2022.