బలి ప్రతిపాద ను బలిపాడ్యమి, పాడ్వ, విరప్రతిపాద లేదా ద్యుతప్రతిపాద అని కూడా పిలుస్తారు. ఇది హిందువుల పండుగ దీపావళికి నాలుగు రోజుల తరువాత వచ్చే పండుగ. [1][2] ఈపండుగను దైత్య రాజు బలి చక్రవర్తి భూమిపైకి వచ్చే రొజున జరుపుతారు. గ్రిగారియన్ కేలండరు ప్రకారం ఈ పండుగ ప్రతీ సంవత్సరం అక్టోబరు- నవంబరు నెలలలో వస్తుంది. హిందువుల చాంద్రమానం ప్రకారం ఇది కార్తీక మాసంలోని మొదటి రోజున వస్తుంది.[3] [4][5] భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో ఇది విక్రమ సంవత్సరపు నూతన సంవత్సర దినోత్సవం రోజున జరుపుకుంటారు. దీనిని బేస్తు వరస్ లేదా వర్ష ప్రతిపాద అని పిలుస్తారు.[6] [7]

బలిప్రతిపాద
బలిప్రతిపాద
వామనుడు (నీలం ముఖం గల మరగుజ్జు) బలి చక్రవర్తి (కుడివైపు ఉన్నవాడు) ఆస్థానంలో భిక్ష కోరుతున్న దృశ్యం
యితర పేర్లుబలి పాడ్వ (మహారాష్ట్ర), బలి పాడ్యమి (కర్ణాటక), బల్రాజ్ (హిమాచల్ ప్రదేశ్), రాజా బలి (జమ్ము), గుజరాతీ కొత్త సంవత్సరం (బెస్తు వరాస్), మర్వారీ కొత్త సంవత్సరం
జరుపుకొనేవారుహిందువులు
రకంహిందూ
వేడుకలువిష్ణు భక్తుడు బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక రోజు భూమికి తిరిగి వచ్చిన వేడుకగా దీపాల పండుగ
సంబంధిత పండుగదీపావళి
ఆవృత్తివార్షిక

బలిప్రతిపాద అనేది పురాతన పండుగ. పురాతన భారతదేశంలో జరిగే నాటకాలు, కవితలలో బలి చక్రవర్తి కథ గూర్చి ప్రస్తావన ఉంది. క్రీ.పూ 2వ శతాబ్దంలో పాణిని రాసిన అష్టాధ్యాయి 3.1.26 లోపతంజలి మహాభాష్యంలో దీని గురించి వివరణ ఉంది.[8] ఈ పండుగకు వేదకాలంలో సుర అసురులు చేసిన సాగర మథనం లో వచ్చిన లక్ష్మీదేవికి, అసురుల మహారాజు మహాబలికి సంబంధం ఉంది.[9] బలి చక్రవర్తి కథను గూర్తి మహాభారతం[8], రామాయణం[10] వంటి గ్రంధాలలోనే కాక బ్రహ్మపురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం వంటి వానిలో కూడా ప్రస్తావన ఉంది.[8]

బలిప్రతిపాద మహాబలి సంవత్సరానికి ఒకసారి భూమికి తిరిగి రావడం, వామనుడు సాధించిన విజయం సాధించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు. విష్ణువు దశావతారాలలో ఐదవ అవతారమైన వామనుడు అసురులపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది. బలి విష్ణు భక్తుడు, శాంతియుతంగా పరిపాలన చేస్తున్న దయగల పరిపాలకుడు[11]. అతను చేస్తున్న యాగానికి విష్ణువు వామనావతారంలో వెళ్ళి మూడు అడుగుల నేలను కోరుకుంటాడు[12][13][14]. ఆ క్రమంలో బలి చక్రవర్తి విష్ణువును సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చే వరం కావాలని కోరుకుంటాడు. అందుకు శ్రీమహావిష్ణువు అంగీకరిస్తాడు. [11][15][16]

మూలాలు

మార్చు
 1. Manu Belur Bhagavan; Eleanor Zelliot; Anne Feldhaus (2008). 'Speaking Truth to Power': Religion, Caste, and the Subaltern Question in India. Oxford University Press. pp. 94–103. ISBN 978-0-19-569305-8.
 2. PV Kane (1958). History of Dharmasastra, Volume 5 Part 1. Bhandarkar Oriental Research Institute. pp. 201–206.
 3. Ramakrishna, H. A.; H. L. Nage Gowda (1998). Essentials of Karnataka folklore: a compendium. Karnataka Janapada Parishat. p. 258. Retrieved 2009-10-07. {{cite book}}: |work= ignored (help)
 4. Devi, Konduri Sarojini (1990). Religion in Vijayanagara Empire. Sterling Publishers. p. 277. ISBN 9788120711679. Retrieved 2009-10-09. {{cite book}}: |work= ignored (help)
 5. Hebbar, B. N. (2005). The Śrī-Kṛṣṇa Temple at Uḍupi: the historical and spiritual center of the ... Bharatiya Granth Niketan. p. 237. ISBN 978-81-89211-04-2. Retrieved 2009-10-09. {{cite book}}: |work= ignored (help)
 6. Bestu Varas: For Gujratis celebrations continue the day after Diwali too, The Times of India (October 25 2011)
 7. K. Gnanambal (1969). Festivals of India. Anthropological Survey of India. pp. 5–17.
 8. 8.0 8.1 8.2 PV Kane (1958). History of Dharmasastra, Volume 5 Part 1. Bhandarkar Oriental Research Institute. pp. 201–206.
 9. Tracy Pintchman (2005). Guests at God's Wedding: Celebrating Kartik among the Women of Benares. State University of New York Press. pp. 63–64. ISBN 978-0-7914-6595-0.
 10. Narayan, R.K (1977). The Ramayana: a shortened modern prose version of the Indian epic. Penguin Classics. pp. 14–16. ISBN 978-0-14-018700-7. {{cite book}}: |work= ignored (help)
 11. 11.0 11.1 PV Kane (1958). History of Dharmasastra, Volume 5 Part 1. Bhandarkar Oriental Research Institute. pp. 201–206.
 12. Manu Belur Bhagavan; Eleanor Zelliot; Anne Feldhaus (2008). 'Speaking Truth to Power': Religion, Caste, and the Subaltern Question in India. Oxford University Press. pp. 94–103. ISBN 978-0-19-569305-8.
 13. Ramakrishna, H. A.; H. L. Nage Gowda (1998). Essentials of Karnataka folklore: a compendium. Karnataka Janapada Parishat. p. 258. Retrieved 2009-10-07. {{cite book}}: |work= ignored (help)
 14. Narayan, R.K (1977). The Ramayana: a shortened modern prose version of the Indian epic. Penguin Classics. pp. 14–16. ISBN 978-0-14-018700-7. {{cite book}}: |work= ignored (help)
 15. Yves Bonnefoy (1993). Asian Mythologies. University of Chicago Press. pp. 84–85. ISBN 978-0-226-06456-7.
 16. Joanna Gottfried Williams (1981). Kalādarśana: American Studies in the Art of India. BRILL. p. 70. ISBN 90-04-06498-2.