బసవ జయంతి
లింగాయత్ సంప్రదాయ వ్యవస్థాపకుడైన బసవన్న పుట్టినరోజు
బసవ జయంతి / బసవేశ్వర జయంతి అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని లింగాయత్ లు సాంప్రదాయకంగా జరుపుకునే ఉత్సవం. ఇది 12వ శతాబ్దపు కవి, తత్వవేత్త, లింగాయత్ సంప్రదాయం వ్యవస్థాపక సాధువు అయిన బసవన్న పుట్టినరోజును సూచిస్తుంది. ఈ ఉత్సవాలు దక్షిణ భారతదేశం అంతటా, ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు.[1]
కుల వ్యవస్థ లేని, అందరికీ సమాన అవకాశాలు ఉండే సమాజాన్ని బసవన్న విశ్వసించేవాడు. ఆయన అనుభవ మంటప అనే అకాడమీని స్థాపించాడు, ఇందులో లింగాయత ఆధ్యాత్మికులు, సాధువులు, తత్వవేత్తలు ఉంటారు.[2]
చిత్రమాలిక
మార్చు-
బసవేశ్వర జయంతి సందర్భంగా 2016 మే 9న హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడు 883వ జయంతి ఉత్సవం వేదిక
-
2016లో బసవేశ్వర జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ప్రజలు
-
2016 బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో బసవపురాణం పుస్తకావిష్కరణ చేస్తున్న అతిథులు
-
2016 బసవేశ్వర జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన మహాత్మ శ్రీ బసవేశ్వర 883వ జయంతి ఉత్సవంలో మాట్లాడుతున్న మామిడి హరికృష్ణ
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Basava Jayanti celebrated". The Hindu, Bangalore. May 14, 2013. Retrieved May 24, 2013.
- ↑ Shiksha, Shruti (April 26, 2020). "Basava Jayanti 2020: Know the significance of the day and how is it celebrated". Zee Media Bureau. Archived from the original on 1 May 2020.