హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానాను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాను నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయ్యి బస్తీ దవాఖానాలను దశలవారీగా ఏర్పాటు చేయనున్నారు.[1] బస్తీ దవాఖానాలో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్స్‌, ఒక నర్స్‌లతోపాటు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంటాయి. ప్రాథమికంగా చికిత్సలు అందిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు.

ప్రారంభం మార్చు

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దవాఖానాను 2018 ఏప్రిల్ 6న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.

 
బస్తీ దవాఖాన

57 రకాల వైద్య సేవలు మార్చు

బస్తీ దవాఖానాల్లో ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్బిణీలు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబ నియంత్రణ కౌన్సెలింగ్‌, రక్త హీనత, షుగర్‌, బీపీ, క్యాన్సర్‌ పరీక్షలు, ఇతర ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య పరిరక్షణ-అవగాహన-చైతన్యం వంటి 57 రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. అంతకు మించిన ఆరోగ్య, అత్యవసర సమస్యలకు రెఫరల్‌ హాస్పిటల్స్‌గా ఉండే సిహెచ్‌సిలు, ఇతర ప్రభుత్వ దవాఖానాలకు రెఫర్‌ చేస్తారు.[2]

బస్తీ దవాఖానాల్లో సేవలు మార్చు

  1. ఓపీ నిత్యం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు
  2. 200 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, 145 రకాల మందుల పంపిణీ
  3. సాధారణ జ్వరం, దగ్గు, షుగర్‌, బీపీతోపాటు ప్రతినిత్యం 80 నుంచి 100 మందికి ఉచితంగా పరీక్షలు. అవసరమైన మందుల అందజేత
  4. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్ల ద్వారా నిత్యం 30 మందికి ఉచితంగా షుగర్‌ పరీక్షలు.
  5. గర్భిణులకు 9 నెలలపాటు పరీక్షలు చేయడం, క్యాల్షియం, ఐరన్‌ మందులివ్వడం. #థైరాయిడ్‌ సమస్యలు గుర్తించి ప్రసవం సులభంగా జరిగేలా సలహాలు, సూచనలివ్వడం.
  6. ప్రతి బుధ, శనివారాల్లో చిన్నారులకు పోలియో, టీటీ, డీపీటీ టీకాలు వేస్తారు.
  7. పలు కేంద్రాల్లో టెలీమెడిసిన్‌ సేవలు[3]

హైదరాబాద్ లో ఉన్న బస్తీ దవాఖానల వివరాలు మార్చు

  • బీజేఆర్‌ నగర్‌ - మల్కాజ్‌గిరి
  • బీఎస్‌ మక్త - ఖైరతాబాద్
  • దత్తాత్రేయ నగర్‌ - కుత్బుల్లాపూర్[4]
  • జవహర్‌నగర్‌ - సంతోష్‌నగర్‌
  • గడిఖానా - గన్‌ఫౌండ్రీ
  • పోచమ్మబస్తీ - అడిక్‌మెట్‌
  • మాదన్నపేట్‌ - కుర్మగూడ
  • వికాస్‌నగర్‌ - కుర్మగూడ
  • దూద్‌బౌలి
  • అల్లామజీద్‌ - కిషన్‌బాగ్‌
  • రాంరెడ్డినగర్‌ - హబీబ్‌గూడ
  • భోలక్‌పూర్‌
  • రాంగోపాల్‌పేట్‌
  • మోచీ కాలనీ- రాంనాస్‌పుర
  • బండ్లగూడ - దూద్‌బౌలి
  • భీమామైదాన్‌ - కవాడిగూడ
  • ఇబ్రహీం బస్తీ - లంగర్‌హౌస్‌
  • ఎంసీహెచ్‌ కాలనీ - జియాగూడ
  • కుమ్మరబస్తీ - ఖైరతాబాద్‌
  • అశోక్‌నగర్‌ - సనత్‌నగర్‌
  • బాపూజీనగర్‌ - బన్సీలాల్‌పేట్‌
  • వీరన్నగుట్ట - మన్సూరాబాద్‌
  • బూపేష్‌గుప్తా నగర్‌ - హస్తినాపురం
  • జవహర్‌నగర్‌ - వెంగళరావునగర్‌
  • హుడా పార్క్‌ - ఎఎస్‌రావు నగర్‌
  • శారదానగర్‌ - ఉప్పల్‌
  • గాజుల రామారం విలేజ్‌ - గాజులరామారం
  • శ్రీ కృష్ణానగర్‌ - సూరారం
  • ఎంజీ నగర్‌ కమ్యూనిటీ హాల్‌ - మౌలాలి[5]
  • శాంతినికేతన్​ కమ్యూనిటీ హాల్​ - ఓల్డ్​ బోయినపల్లి
  • షేక్​పేట్​ రాజీవ్​గాంధీ నగర్​ - జూబ్లీహిల్స్
  • చంద్రకిరణ్​ బస్తీ - దూల్​పేట్
  • మహాభారత్​నగర్ కాలనీ - ఖైరతాబాద్
  • సింగడి బస్తీ కమ్యూనిటీ హాల్ - జూబ్లీహిల్స్
  • జకీర్​ హుస్సేన్​ కమ్యూనిటీ హాల్ - మల్లేపల్లి
  • కామ్‌గార్‌నగర్‌​ కమ్యూనిటీ హాల్ - గోల్నాక
  • గంగానగర్‌ - గోల్నాక [6]
  • యూసఫ్ గూడ కమ్యూనిటీహాల్
  • హమాలీ బస్తీ కమ్యూనిటీ హాల్ - బన్సిలాల్​పేట్
  • అన్నపూర్ణ కాలనీ కమ్యూనిటీ హాల్ - నాచారం
  • చిలుకానగర్​ కమ్యూనిటీ హాల్ - ఉప్పల్
  • రామంతపూర్​ జడ్​పీహెచ్​ స్కూల్ - హబ్సిగూడ
  • ఓల్డ్ బోయిన్​పల్లి వార్డు ఆఫీస్
  • ఫిరోజ్​గూడ వార్డు ఆఫీస్
  • ఎన్​ఎల్​బీ కమ్యూనిటీహాల్ - చింతల్​
  • అపురూప కాలనీ కమ్యూనిటీహాల్ - సుభాష్​నగర్​
  • కౌకూర్​మెయిన్​ రోడ్డు హనుమాన్​ టెంపుల్ దగ్గర - మచ్చబొల్లారం
  • గోకుల్ నగర్​ పార్కు - వెంకటాపురం, అల్వాల్
  • నేరెడ్​మెట్​ చెక్​పోస్ట్ కమ్యూనిటీ హాల్ యాప్రాల్ - మల్కాజ్‌గిరి
  • ఓల్డ్ మిర్జల్​గూడ శ్రీనివాసనగర్ కమ్యూనిటీ హాల్ - గౌతంనగర్​, మల్కాజ్‌గిరి
  • హైదర్​నగర్ ​వార్డు ఆఫీస్ - హైదర్​గూడ
  • ముస్లీం బస్తీ, నెహ్రునగర్ కమ్యూనిటీహాల్ - శేరిలింగంపల్లి
  • పాపిరెడ్డి కమ్యూనిటీ హాల్​ - చందానగర్
  • లలితాబాగ్​
  • రియసాత్​నగర్
  • కంచన్​బాగ్
  • నవాబ్​సాహెబ్​కుంట
  • రామ్​నాస్​పుర
  • టోలిచౌకీ
  • పురానాపూల్
  • రెయిన్​బజార్
  • దూద్‌బావి - మెట్టుగూడ, సికింద్రాబాద్[7]
  • జలాల్‌భాబా నగర్‌ - అత్తాపూర్‌
  • కసరట్టా - పురానాపూల్‌, చార్మినార్‌

సంగారెడ్డి జిల్లా మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (7 April 2018). "వైద్య సంస్కరణలు దేశానికే ఆదర్శం". Archived from the original on 30 జనవరి 2022. Retrieved 30 January 2022.
  2. ETV Bharat News (3 December 2021). "మరో 32 బస్తీ దవాఖానాలు ప్రారంభం.. ఎక్కడెక్కడంటే?". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  3. Namasthe Telangana (17 April 2021). "ఆపత్కాలం.. బస్తీ వైద్యం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  4. 10TV (12 November 2020). "దత్తాత్రేయ నగర్‌లో బ‌స్తీ ద‌వాఖానాను ప్రారంభించిన మంత్రి" (in telugu). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. HMTV (12 August 2020). "హైదరాబాద్ లో మరో 26 దవాఖానాలు.. కరోనా సేవలు మరింత విస్త్రుతం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  6. Namasthe Telangana (21 April 2021). "పైసా ఖర్చులేకుండా నాణ్యమైన వైద్యం". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  7. Namasthe Telangana (3 December 2021). "పేదలకు అధునాతన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  8. Namasthe Telangana (19 February 2022). "పేద‌ల కోస‌మే బస్తీ దవాఖానాలు : మంత్రి హ‌రీశ్‌రావు". Archived from the original on 19 February 2022. Retrieved 19 February 2022.