హస్తినాపురం (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని ప్రాంతం.

హస్తినాపురం, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు సమీపంలోని ప్రాంతం.[1] తూర్పు హస్తినాపురం, పశ్చిమ హస్తినాపురం, దక్షిణ హస్తినాపురం, మధ్య హస్తినాపురం అని నాలుగు భాగాలుగా విభజించబడిన ఈ ప్రాంతం నాగార్జునసాగర్ హైవే రోడ్డు వైపు ఉంది.

హస్తినాపురం
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
నగరంహైదరాబాదు
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500070
టెలిఫోన్ కోడ్+91
Vehicle registrationటిఎస్

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో బిఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, ఎల్.బి. నగర్, ఎన్జీవో కాలనీ, క్రిస్టియన్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, లక్ష్మీనరసింహపురం కాలనీ, గణేష్ నగర్, కేశవపురం కాలనీ మొదలైనవి ఉన్నాయి.[2]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో హస్తినాపుర మీదుగా సికింద్రాబాద్, నాగార్జునసాగర్ రోడ్, ఐఎస్ఐ సదన్ కాంప్లెక్స్, ఉప్పల్ ఎక్స్ రోడ్, దిల్‍సుఖ్‍నగర్, జనప్రియ కాలనీ, బిఎన్. రెడ్డి నగర్, నాంపల్లి, కొండాపూర్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో యాకుత్‌పురా, ఉప్పుగూడ ప్రాంతాలలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది. ఇక్కడికి సమీపంలో ఎల్‌బి నగర్ మెట్రో స్టేషన్ ఉంది.

ప్రార్థనా మందిరాలు

మార్చు
  • కనకదుర్గా దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • నల్ల పోచమ దేవాలయం
  • మసీదు మహమ్మదీయ
  • మస్జిద్-ఎ-మొహమ్మదియా
  • మస్జిద్-ఇ-ఇలాహి

విద్యాసంస్థలు

మార్చు
  • శ్రీసాయి జూనియర్ కళాశాల
  • శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల
  • ప్రగతి మహిళా డిగ్రీ కళాశాల
  • రవీంద్ర భారతి స్కూల్
  • లిటిల్ స్కాలర్ హైస్కూల్

మూలాలు

మార్చు
  1. "Hyderabad comes to a standstill". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-24.
  2. "Hastinapuram Locality". www.onefivenine.com. Archived from the original on 2017-06-16. Retrieved 2022-09-24.
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-24.

ఇవి కూడా చూడండి

మార్చు