బాణం 2009 లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. ఇందులో నారా రోహిత్, వేదిక ప్రధాన పాత్రల్లో నటించారు. త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మించిన ఈ చిత్రం నారా రోహిత్ కు తొలి చిత్రం. దర్శకుడికి కూడా ఇది తొలి చిత్రమే.

బాణం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం దంతులూరి చైతన్య
నిర్మాణం ప్రియాంక దత్
కథ దంతులూరి చైతన్య
చిత్రానువాదం దంతులూరి చైతన్య
తారాగణం నారా రోహిత్, వేదిక, భానుచందర్, రాజీవ్ కనకాల, ఎస్.ఎం. బాషా
సంగీతం మణి శర్మ
ఛాయాగ్రహణం అనిల్ భండారి
కూర్పు మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాణ సంస్థ త్రీ ఏంజిల్స్ స్టుడియో
విడుదల తేదీ 16 సెప్టెంబర్ 2009
భాష తెలుగు
పెట్టుబడి 35 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉత్తమ ద్వితీయ చిత్రం నంది పురస్కారం.

1989 లో రణస్థలి పట్టణంలో జరిగే కథ ఇది. భగత్ పాణిగ్రాహి ( నారా రోహిత్ ) ఐపిఎస్ అధికారి కావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అతని తండ్రి చంద్రశేఖర్ పాణిగ్రాహి ( సయాజీ షిండే ) మాజీ నక్సలైటు. 20 సంవత్సరాల తరువాత జనజీవన స్రవ్ంతి లోకి తిరిగి వస్తాడు. అతని భావజాలం ప్రకారం ఒక నిర్దిష్ట కాలం తరువాత ప్రతి వ్యక్తి తమ పదవి నుండి విరమణ చేయాలి. నక్సలిజంలో పదవీ విరమణ చేసిన మొదటి వ్యక్తి అతడు. అతను ఇంటికి తిరిగి వచ్చాక, ఐపిఎస్ కావాలన్న తన కొడుకు ఆశయాన్ని ప్రశ్నిస్తాడు ఎందుకంటే అతని భార్యను పోలీసులే చంపేసారు. భగత్ తన తర్కంతో తండ్రిని ఒప్పించి, అంగీకారం పొందుతాడు. ఇంతలో, స్థానిక డాన్, శక్తి పట్నాయక్ ( రణధీర్ గట్ల ) నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. పోలీసులను, అతనిని వ్యతిరేకించే వారిని భయపెడుతున్నాడు.

ఒక రోజు, భగత్ ఒక రైల్వే స్టేషన్లో సుబ్బలక్ష్మి ( వేధిక ) అనే అమాయక వివాహిత బ్రాహ్మణ యువతిని కలుస్తాడు. కట్నం చెల్లించనందున ఆమె అత్తమామలు ఆమెను అక్కడ వదిలేసి, వదిలించేసుకున్నారు. కట్నం ఇచ్చుకోలేని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమెకు ఇంకా తెలియదు. ఇప్పుడు భగత్ సహాయంతో ఆమె స్వతంత్ర మహిళగా మారడానికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఒక రోజు ఆమె భర్త రహస్యంగా కలుద్దామనిఆమెకు ఒక సందేశాన్ని పంపుతాడు, అప్పుడు భగత్ అతనిని కలవడానికి ఆమెతో వెళ్తాడు. ఆ సమావేశంలో ఆమె తన భర్తతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంటుంది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికతో, ఆమె మాజీ భర్త ఆమెను అపహరించడానికి శక్తి ముఠాను మాట్లాడుకుంటాడు. ఇది భగత్, శక్తి మధ్య వరుసగా కొన్ని సంఘటనలకు దారితీస్తుంది. ఆ తరువాత భగత్ సుబ్బలక్ష్మిని పెళ్ళి చేసుకుంటానని ప్రతిపాదిస్తాడు. చివరికి ఆమె అంగీకరిస్తుంది.

ఇంతలో భగత్ యుపిఎస్సిలో అర్హత సాధిస్తాడు శిక్షణ కోసం వెళ్తూండగా మధ్యలో శక్తి ముఠా అతనికి అడ్డుకుని కొట్టడంతో గాయపడతాడు,. అప్పుడు కోపంతో అతడి తండ్రి శక్తిని చంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ప్రయత్నం తప్పిపోయి శక్తి అతన్ని పట్టుకుంటాడు. తరువాత అతన్ని దారుణంగా చంపేస్తాడు. వాస్తవాలు తెలుసుకున్న తరువాత భగత్ శక్తిని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. శక్తి దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ట్రైనీలను నిలబెట్టమని కోరేందుకు భగత్ తన బాల్యంలోనే ఐపిఎస్ ఆఫీసర్ కావడానికి ప్రేరేపించిన ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి (ఎస్.బాలచందర్) ను కలుస్తాడు. ముందు అతను అందుకు నిరాకరిస్తాడు కానీ తరువాత అంగీకరిస్తాడు. భగత్ ఆ ట్రైనీలతో కలిసి శక్తి ముఠా ఆట కట్టించడం తరువాత తాను పోస్టింగు పొందడం మిగతా కథ.  

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి సంగీతాన్ని మణి శర్మ సమకూర్చారు. పాటలను 2009 ఆగస్టు 24 న జరిగిన వేడుకలో విడుదల చేసారు. [1]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."కదిలే పాదం"వనమాలిశంకర్ మహదేవన్5:09
2."నాలో నేనేనా"రామజోగయ్య శాస్త్రిహేమచంద్ర, సైంధవి5:49
3."పదరా పదరా"రామజోగయ్య శాస్త్రిరంజిత్, ఖుషీ మురళి3:38
4."మోగింది జేగంట"రామజోగయ్య శాస్త్రిశ్రేయా ఘోషాల్4:46
5."బాణం"కృష్ణ చైతన్యరంజిత్, ఖుషీ మురళి, నవీన్, హనుమంతరావు3:34
మొత్తం నిడివి:23:06

మూలాలు

మార్చు
  1. "'Baanam' Audio Released". IndiaGlitz. Retrieved 24 August 2009.