భానుచందర్
భానుచందర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, దర్శకుడు.[1][3] పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను మరియు సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.
భానుచందర్ | |
---|---|
జననం | మద్దూరి భానుచందర్ 1952 జూలై 2 [1] చెన్నై[1] |
వృత్తి | నటుడు |
పిల్లలు | జయంత్[2] |
తల్లిదండ్రులు |
|
విషయ సూచిక
బాల్యంసవరించు
ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకైన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలానే తానూ సంగీత దర్శకుడు కావాలనుకున్నాడు. గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించగలిగేవాడు. భానుచందర్ నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ పొందాడు. అతను శిక్షణ పొందిన సంస్థలో ముందు బ్యాచిలో రజనీకాంత్, తరువాత బ్యాచీలో చిరంజీవి శిక్షణ పొందారు. కొద్ది రోజులు డ్రగ్స్ కి బానిసైనప్పుడు అన్నయ్య అతన్ని మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించాడు.[4] అలా భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు.[1]
కెరీర్సవరించు
భానుచందర్ ముందుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన మూడుపాని అనే తమిళ సినిమాలో నటించాడు. తరువాత తమిళంలోనే నీంగళ్ కేటవాయ్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో తరువాత బాలు మహేంద్ర పరిచయంతో చాలా సినిమాల్లో నటించాడు. బాలు మహేంద్ర దర్శకత్వంలో అర్చన జంటగా నటించిన వీడు అనే తమిళ సినిమా జాతీయ పురస్కారం అందుకుంది.
నటించిన చిత్రాలుసవరించు
- మనసారా - 2010
- దుబాయ్ శీను - 2008
- ఎవడైతే నాకేంటి?
- స్టైల్
- దేవి
- సింహాద్రి (2003)
- నిరీక్షణ (1981)
- మెరుపు దాడి (1984)
- ఉదయం (1987)
- స్వాతి
- మంచి మనుషులు
- సూత్రధారులు
- గూఢచారి నెం.1
- అశ్వని
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 "భానుచందర్ ప్రొఫైలు". nettv4u.com. Retrieved 5 October 2016.
- ↑ "Bhanuchander to direct his son Jayanth". timesofindia.indiatimes.com. TNN. Retrieved 5 October 2016.
- ↑ "భానుచందర్ ప్రొఫైలు". veethi.com. Retrieved 5 October 2016.
- ↑ సమీర, నేలపూడి. "మరుజన్మలో ఆ చాన్స్ వదులుకోను!". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 5 October 2016.
బయటి లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో భాను చందర్ పేజీ