బాదం నూనె

బాదంపప్పు నుండి బాదం నూనెను తీస్తారు. బాదం నూనె శాకతైలం, ఆహరయోగ్యం కూడా. అయితే బాదంపప్పును నూనె తీయుట కన్న వంటకాల తయారిలో రుచినిచ్చు పదార్థంగా విరివిగా ఉపయోగిస్తారు.

బాదం చెట్టు
పూలు
పచ్చి కాయలు
పండిన కాయలు
బాదం పప్పు
బాదం నూనె

బాదంచెట్టు[1]

మార్చు

బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్ర నామం: పునస్‌ డల్సిస్‌ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదాన్ని వాడెదరు [2] . బాదం పుట్టుక మధ్య,, దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించింది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధాన కాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును. కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండా కారంగా వుండును. తీపి బాదం పూలు తెల్లగా వుండి, అడుగు భాగం, అంచులు కొద్దిగా పింకు రంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళా లుండును. 5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.

బాదంపప్పు

మార్చు

పుష్పించిన6-7 నెలల తరువాత కాయలు పక్వానికి వచ్చును. బాదంకాయ పైభాగాన పీచుకలిగిన గట్టిపెంకును (shell) వుండి లోపలిభాగంలో బాదం పప్పు/గింజను వుండును. బాదం పప్పు దీర్ఘాండాకరంగా వుండి ఒకచివర కోసుగా వుండును. బాదంపప్పు పైభాగంలో చారలున్న ముదురు గోధుమరంగు పలుచనిపొర వుండును. పొరలోపలి బాదంపప్పు తెల్లగా లేదా లేత క్రీము రంగులో వుండును. బాదంపప్పు1-2 సెం.మీ. పొడవుండి, 1.-2గ్రాం. ల బరువు వుండును. బాదం కాయలో పైపెంకు వంటిభాగం 30-35%, బాదంపప్పు శాతం 65-70% వుండును. బాదంపప్పు మంచి పోషకవిలువలు కలిగివున్నది. బాదంపప్పులో కొవ్వులు (fats), మాంసకృత్తులు (proteins), పిండిపదార్థాలు (carbohydrates), ఖనిజాలు (minerals), విటమిన్లు సమృద్థిగా వున్నాయి[3].

బాదంపప్పు లోని పొషకాల పట్టిక

పోషకాలు శాతం
నూనె (fat) 49-51
ప్రోటిన్లు 21-22
పిండిపదార్థంలు 19-20
చక్కెరలు 4.5-5
పీచుపదార్థము 10-11
పోషక విలువ 5780 కిలో.కెలరీలు
విటమినులు (100గ్రాం.లకు) మితి
థైమిన్ 0.24మి.గ్రాం.
రిబొఫ్లవిన్ 0.4మి.గ్రాంలు.
నియాసిన్ 4మి.గ్రాం.లు
పాంథోతెనిక్ 0.3మి.గ్రాంలు
విటమిన్B6 0.13మి.గ్రాంలు
విటమిన్E 26.22మి.గ్రాం.లు

ఇకఖనిజాలు, కాల్సియం250మి.గ్రాంలు, ఐరమ్6మి.గ్రాంలు, మెగ్నిసియం300మి.గ్రాంలు, భాస్వరమ్500మి.గ్రాంలు, పొటాషీయం 700మి.గ్రాంలవరకు వున్నాయి (100గ్రాంలపప్పులో) [4].

బాదం నూనె

మార్చు

బాదంనూనె అహారయోగ్యం అయ్యినప్పటికి బాదంనూనెను వంటనూనెగా వుపయాగించరు.కారణం బాదంపప్పు ఖరీదు చాలాఎక్కువగా వుండటం వల్ల. బాదంనూనెను చర్మసంరక్షణిగా, కేశసంవర్థనిగా, ఎక్కువగా వుపయోగిస్తారు. బాదం నూనెను ఆవశ్యకనూనె (essential oil) వర్గానికి చెందినది.ఆవశ్యకనూనెలు, 'ఆవశ్యక కొవ్వుఆమ్లాలు (essential fatty acids) వేరు.బాదంనూనె లేత పసుపురంగులో వుండును.ఒకవిధమైన ప్రత్యేకవాసన కలిగివుండును.బాదంనూనెను అరోమా థెరపి (aroma theraphy, మాసెజి థెరపి (massage theraphy) లో ఉపయోగిస్తారు.బాదంనూనెలో ఎకద్విబంధంవున్న ఒలిక్ ఆమ్లం అధికశాతంలో వుండి, అధికంగా వున్న ఒలిక్‌ఆమ్లం సింపిల్‌ ట్రైగ్లిసెరైడుగా ఉంది. పరిమళ, సుగంధనూనెలు వాటి వాసనను త్వరితంగా కొల్పొకుండ వుండుటకై బాదంనూనెను క్యారియరుగా (వాహకం) కలుపుతారు[5] .

బాదం నూనె భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక

లక్షణము మితి
సాంద్రత (250Cవద్ద) 0.910-0.915
వక్రీభవన సూచిక (400Cవద్ద) 1.462-1.466
ఐయోడిను విలువ 94-105
పెరాక్సైడ్‌విలువ (గరిష్ఠం) 1.0
అన్‌సపోనిఫియబుల్‌మేటరు 1.5%
కలరు (5.1/4" సెల్) Y=15.R=1.5 units

బాదంనూనెలోవున్న కొవ్వుఆమ్లాలు

కొవ్వు ఆమ్లము శాతం
పామిటిక్ ఆమ్లం 6-8
ఒలిక్ ఆమ్లం 64-82
లినొలిక్ ఆమ్లం 8-28

నూనెను తీయుట

మార్చు

బాదం పప్పునుండి స్క్రూప్రెస్‌ నుపయోగించి నూనెను తీయుదురు. చేతితో పనిచేయ్యు, లేదా విద్యుతు మోటరుతో పనిచేయు స్క్రూప్రెస్‌ల ద్వారా నూనె తీయుదురు. నూనెలోని సహజ లక్షణాలతో నూనెను పొందుటకై కోల్డ్‌ప్రెస్‌ ద్వారా నూనెను తీస్తారు. ఇంటిలోనే గృహావసరాలకై చేతితో పనిచేయు స్క్రూప్రెస్‌ల నుపయోగిస్తారు. వీటి ఉత్పత్తిసామర్ద్యం 1-5 కిలోలు గంటకు వుండును . వ్యాపారపరంగా ఉత్పత్తికై రోజుకు1-6టన్నుల ఉత్పత్తి సామర్ద్యం వున్న స్క్రూప్రెస్‌ల నుపయోగిస్తారు.స్క్రూప్రెస్‌ నుండి వచ్చిన నూనెలోవున్న మలినాలను వడబోత చేసి వేరు చేయుదురు.ఎక్కువ వెలుతురు తగలకుండ వుంచిన 6నెలలవరకు పాడవకుండ నిల్వ వుండును. అంతకు మించిన అక్సికరణవలన రంగు, వాసన మారును.

నూనె ఉపయోగాలు

మార్చు

బాదం నూనెను చర్మ సంరక్షణిగా, కేశ రక్షణిగా, మారియు ఆహారంగా వినియోగిస్తారు.

చర్మ సంరక్షణిగా

బాదం నూనెను మర్దన చేయడం వలన

  • మేనిచర్మానికి మెరుపునిస్తుంది.
  • పొడిబారిన మేనికి తేమను చేర్చి మెత్తపరచును.
  • కండరాల నొప్పులను తగ్గించును.
  • కళ్ళచుట్టు వుండు నల్లచారలను తొలగించును.
  • మేని దురదలను తొలగించును.
  • చర్మాన్నినునుపుగా మృదువుగా చేయును.
  • పెదాల పగుళ్లను తగ్గించును,, చర్మం ముడతలను తొలగించును.
  • చిన్నపిల్లల సబ్బులలో, మర్దన నూనెలో బాదం నూనెను ఉపయోగిస్తారు.

బాదం నూనె పిల్లలకి చాలా మంచిది. బాదం నూనెతో శిశువు యొక్క చర్మం మర్దన చేయడం వలన

  • దురదను, మంటను తగ్గిస్తుంది.
  • చర్మాన్నిమృదువుగా చేస్తుంది.
  • తామర వంటి చర్మ సమస్యల నుండి కాపాడుతుంది.
  • అజీర్ణం అయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది.

కేశ సంరక్షణిగా[6]

  • తల వెండ్రుకలు పొడవుగా పెరుగునట్లు చెయ్యును.
  • తల వెంట్రుకల కుదుళ్లను గట్టిపరచును.
  • వెంట్రుకలకు మెరుపునిచ్చును.
  • వెండ్రుకలు రాలడం నివారించును.
  • శిశువు యొక్క తల మీద బాదం నూనెతో మర్దన చేయడం వలన చుండ్రు, చర్మశోధని నివారించడానికి సహాయపడుతుంది.

ఆహారంగా

  • దేహంలో కొలెస్ట్రాల్ శాతాన్ని నియంత్రించును.
  • మెదడు, నాడి వ్యవస్థను ఉత్తెజపరచును.

సాధారణంగా నేరుగా నూనె రూపంలో కాకుండ, బాదంపప్పును ఆహారంగా తీసుకోవటం ద్వారా నూనె ఆహారంగా స్వీకరించడం జరుగుతున్నది.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm
  2. http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-26. Retrieved 2013-06-11.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-17. Retrieved 2013-06-11.
  5. http://www.drugfuture.com/Pharmacopoeia/USP32/pub/data/v32270/usp32nf27s0_m1510.html
  6. http://www.indiaparenting.com/health/324_3379/benefits-of-almond-oil.html
"https://te.wikipedia.org/w/index.php?title=బాదం_నూనె&oldid=4194561" నుండి వెలికితీశారు