చెట్లనుండి వచ్చే నూనెగింజలు

మానవులు భుజించే ఆహారంలో పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమినులు, ఖనిజాలు తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను, దేహంలోని కండర, ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా ఉంది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న నూనెలను ఆహారంతోపాటు తీసుకోవటం ఎంతోఅవసరం.

నూనెలను ఆహారంలో రెండురకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఒకటి శాకనూనెలు (మొక్కల, చెట్ల గింజలనుండి తీసిన నూనె), రెండు మాంసాహారాన్ని తీసుకోవటం వలన. ఉదా: కోడి, మేక, గొర్రె, ఆవు, గేదె వంటి జంతువుల మాంసాన్ని తీసుకున్నప్పుడు, చేప, రొయ్య, సొర, క్రిల్సు వంటి జలచరాలను ఆహారంగా తీసుకున్నప్పుడు. జంతుకొవ్వులలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. జలచరాలల (చేపలు, క్రిల్స్, ష్రింప్స్, రొయ్య వంటి) లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు అధికంగా వుండును. నూనెగింజలలో, జలచర (marine), భూచర జంతువులలోని (Land animals) (ముఖ్యంగా క్షీరదాల) కొవ్వులలో కొవ్వుఆమ్లాలు ట్రై గ్లిసెరైడుల రూపంలో వుండును. ఒక అణువు గ్లిసెరోల్‍తో మూడు కొవ్వు ఆమ్లాలు అనుసంధానం చెందుట ద్వారా ఒకఅణువు ట్రై గ్లిసెరైడు (నూనె/కొవ్వు), మూడు నీటిఅణువు లేర్పడును.

శాకఖాద్య నూనెలను (Edible vegetable oils) వ్యవసాయపంటల నూనెగింజల ద్వారాను (వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు, పత్తిగింజలు, కుసుమ (kardhi), ఒడిసెలు వంటివి) ద్వారాను, వ్యవసాయపంటగా సాగుచేసె చెట్లకాయలు, పళ్ల గుజ్జు విత్తనాల (కొబ్బరి, పాం, కొకో, ఆలివ్ వంటివి) ద్వారాను ఉత్పత్తి చేయుదురు. వ్యవసాయ పంటలైన మొక్కల నూనెగింజలలో సంతృప్త కొవ్వుఆమ్లాల కన్నా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో వుండును. చెట్ల గింజలనూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. కొబ్బరిలో లారిక్ కొవ్వుఆమ్లం, పామాయిల్లో పామిటిక్ కొవ్వుఆమ్లం, కొకో బట్టరులో స్టియరిక్ సంతృప్త కొవ్వుఆమ్లం అధికశాతంలో వుండును.

నూనెల వినియోగంసవరించు

గత అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగి పోయి, రెట్టింపు అయ్యింది. జనాభా పెరిగే కొలది అవసరపడు అహారోత్పత్తులు ఆ మేరకు లభించాలి. జనాభా అయితే పెరిగింది కాని ఆ మేరకు వ్యవసాయ భూముల విస్తీర్ణం పెరగ లేదు, సరికదా కొంతమేరకు తగ్గింది (పంట పోలాలలో పరిశ్రమలు స్ధాపించటం, చేపల, రొయ్యలచెరువులు త్రవించడం, బహుళ అంతస్తుల నివాస భవనాల నిర్మాణం చోటుచేసుకున్నది. పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రాం లోని ఉద్యమం ఇందుకు ఉదాహరణ: కొంత మేరకు అడవులను నరకి వేసి పామాయిల్ తోటలను (ఇండోనేసియా, థాయ్ లాండ్, సింగపూర్, వంటి దేశాలలో) పెంచటం ప్రారంభించారు. ఇందు వలన వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని వాదనలు రావడంతో వారుకూడా అడవులను నరికి పామాయిల్ తోటలను పెంచె కార్యక్రమాన్ని తగ్గించారు. జంతువులనుండి సేకరించిన కొవ్వును అతితక్కువ ప్రమాణంలో మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. జంతుకొవ్వులలో (animal fat) సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వున్నందున వాటిని వేరే విధంగా వినియోగించడం జరుగుతుంది.

నూనెలను కేవలం ఆహారంతో పాటు వినియోగించడం మాత్రమే కాకుండగా వివిధ రకాలైన ఉత్పతుల తయారికి కూడా విరివిగా ఉపయోగిస్తారు. సబ్బులు, కందెనలు (lubricants), రంగులు (paints), ఔషధ లేపనాలు (medicinal ointments), సౌందర్య లేపనాలు (cosmetics), రబ్బరు టైర్లు, మందులు, ఆయుర్వేద చికిత్సలో దేహ మర్ధననూనెలు, కేశ నూనెలు (Hair oil) కొవ్వు ఆమ్లాలు, బయో డిసెల్ తయారిలో విరివిగా నూనెలను వాడెదరు. ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. వాహస ఇంధంగా వాడుచున్న పెట్రోలు, డిసెల్, కిరొసిన్ వంటి ఇంధనాలన్నికూడా శిలాజ (fossil) ఇంధనాలు. శిలాజ ఇంధనాలను వాడేకొలది వాటి నిల్వలు తరుగుతూ పోతాయి తప్ప తిరిగి ఉత్పన్నం కావు. ఇప్పుడు వాడుచున్న ఈ శిలాజ ఇంధనాలన్ని కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు, భూగర్భంలో సేంద్రియ పదార్ధాలు (organic material) అధిక వత్తిడి, ఉష్ణోగ్రతల వద్ద రసాయనిక మార్పులకు లోనవడం వలన ఏర్పడినవి. అందుచే శిలాజ ఇంధానాలు వాడేకొద్ది నిల్వలు తగ్గి పోవడం తప్ప పెరగవు. రాబోవు కాలంలో వాహనాల ఇంధనంగా నూనెలను బయోడీసెల్ గా మార్చి ఉపయోగించడం తప్పనిసరి. కనుక నూనెల వినియోగం ఇంకా పెరుగుతుంది.

ఇప్పటికే వ్యవసాయ భూములకై, జనావాసాలకై, పరిశ్రమల స్థాపనకై, చాలా అడవులను నరకి వెయ్యడంవలన పర్యావరణ సమతుల్యానికి జరుగ వలసిన నష్టం జరిగిపోయి, ఇకముందు అడవులను నరికితే మానవ మనుగడ అస్థిత్వానికి, ఉనికికి ముప్పు ఏర్పడుతుంది.ఇలాంటి పరిస్ధితులలో అందుబాటులో వున్న భూములలలోనే నూనెగింజల ఉత్పత్తి కొనసాగించ వలసిన అగత్యం, అవసరం ఏర్పడినది. జనవాస ప్రాంతాలలోని బయలు మైదాన నేలల్లో, అడవులో పెరిగే చెట్లు చాలావరకు నూనెగింజలను ఇచ్చెవే. మూడు దశాబ్ధాలనుండే మైదాన ప్రాంతాలలోని, అడవులలోని చెట్లనుండి నూనెగింజలను సేకరించి, నూనెను తియ్యడం మొదలైనది. ఈ విధంగా మైదానాలలో (plain lands, meadows), అడవులలో పెరిగే చెట్ల నుండి నూనెగింజల సేకరణ కొంచెం ప్రయాసతో కూడిన పని. ఈ చెట్లన్ని ఒకే చోట గుంపుగా పెరగవు. ఒకేరకమైన చెట్లు చెదురుమదురుగా వ్యాపించి వుండటం వలన నూనెగింజలను సేకరించుటకు అధిక సమయము, ఎక్కువ మనుసులను సేకరణకై వినియోగించ వలసి రావడం వలన చెట్ల నూనెగింజల సేకరణ అనుకున్నంత వేగ వంతంగా జరగటంలేదు.అవసరం అన్వేషణకు, ఆవిష్కరణకు మూలం. అందుచే సమర్ధవంతంగా, వేగవంతంగా, అధిక మొత్తంలో చెట్ల నూనెగింజల సేకరణకై ప్రయత్నాలు మొదలైనవి.

ప్రకృతి మాత్రం మనిషి అడిగిన వెంటనే కాదనకుండ అతని అవసరాలకు అమ్మలా ఆదుకుంటున్నది.మనిషే! అత్యాసకు పోయి అవసరానికి మించి అడ్డదిడ్డంగా ప్రకృతి వనరులను వాడేసి తనజాతి వినాశననికి తనే కారణమవుతూ భస్మాసుర అవతారమెత్తుతున్నాడు.

నూనెగింజలనిచ్చు చెట్లుసవరించు

గ్రామీణ ప్రాంతాలలో, పొలంగట్ల వెంబడి, రోడ్లకిరువైపుల, బయలునేలలో, పంటకు అనుకూలంకాని భూముల్లో పెరిగే మనకు సుపరిచతమైన చెట్లు కొన్నికలవు. అవి వేప, కానుగ, చింత, టేకు, కొబ్బరి (చింత పిక్కలలో నూనె 6-7% వరకున్నది) తదితరాలు. అయితే కొబ్బరిని వ్యవసాయపంటగా కొబ్బరితోటలను తీరప్రాంతభూముల్లో సాగుచేస్తారు. అడవుల్లో పెరిగే గుగ్గిలం (sal), ఇప్ప, వంటివి ఉన్నాయి. ఈ చెట్ల నుండి నూనెగింజలను సేకరించి నూనెను తీయడం దశాబ్ధలక్రితమే మొదలైనది. మామిడిపండ్ల టెంకలనుండి కూడా నూనెను తీస్తున్నారు. ఈదిగువన అడవుల్లో పెరిగే, నూనెగింజలనిచ్చే చెట్ల వివరాలు పొందుపరచడం జరిగింది.

వేప చెట్టుసవరించు

 
వేప గింజలు

ఈచెట్టు మెలియేసి కుటుంబానికి చెందినది.వృక్షశాస్త నామం:అజడిరక్ట ఇండికా (Azadirachta Indica). సంస్కృతంలో నింబ, హిందిలో నీం, గుజరాత్‍లో లిండొ, మహారాష్ట్రలో కుడులింబొలి, దక్షిణ భారతంలో వేప అని పిలుస్తారు.భారతదేశమంతా వ్యాప్తిచెందివున్నది. బయలుప్రదేశాలలో, ఇంటి ఆవరణలలో, అడవుల్లో పెరుగుతుంది. వేపచెట్టు పెరిగే ఇతరదేశాలు, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండోమలయని ప్రాంతము. భారతదేశంలో, ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, హిమచల ప్రదేశ్. అస్సాము, అండమాన్ నికోబార్ దీవులలో వేప విస్తృతంగా పెరుగుతుంది. ఒకచెట్టునుండి ఏడాదికి 37-55 కిలోలవరకు నూనెగింజలను సేకరించెవీలున్నది. వేపగింజల సేకరణ ఉత్తరభారతంలో జూన్-జూలై మధ్యకాలంలో, దక్షిణాన మే-జూన్ నెలలో చేస్తారు. వేపకాయలో (Dry fruit) నూనె 20% వరకుంటుంది. వేపగింజలనుండి వేపనూనె తీయుదురు. వేపగింజలను ఎక్సుపెల్లర్లను నూనెతీయుయంత్రాల ద్వారా, సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో తీయుదురు.

వేపనూనె= ప్రధానవ్యాసంవేపనూనె చూడండి.

కానుగ చెట్టుసవరించు

ఈ చెట్టు ఫాబేసికు చెందిన చెట్టు. వృక్షశాస్తనామం: పొంగమియా పిన్నట పెర్రె (ponagamia pinnata perre). సంస్కృతంలో కరంజ్, హింది, ఉత్తరభారతంలో కరంజ, తమిళంలో పొంగం, ఇంగ్లిసులో ఇండియన్ బీచ్ (Indian beach) అని పిలుస్తారు. పశ్చిమఘాట్ లో విస్తారమధికం. నదుల ఒడ్దులలో, ఆవరణలలో, బయలు ప్రదేశాలలో, అడవుల్లో విస్తరించి ఉంది. భారతదేశంలో ఆంధ్ర, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, ఉత్తరప్రదేశ్ లలో బాగా వ్యాప్తిచెందివున్నది. ఒకచెట్టునుండి ఏడాదికి 50-90 కిలోలగింజలను సేకరించు అవకాశమున్నది. విత్తనం (kernel) లో నూనెశాతం 27-39% వరకుండును. గింజలనుండి కానుగ నూనె ను ఎక్సుపెల్లరులద్వారాను, కేకునుండి సాల్వెంట్ విధానంలో సంగ్రహించెదరు.

కానుగ నూనె= ప్రధాన వ్యాసం కానుగ నూనె చూడండి.

చింత చెట్టుసవరించు

 
చింత గింజలు

ఈ చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది.వృక్షశాస్త్రనామము:టమారిండస్ ఇండికా.సాధారణ పేర్లు:మరాఠీలో చించ్ (chich) ;మలయాళం లలో పులి (puli) ;కన్నడలో హూలి;బెంగాలి, గుజరాతిలలో అమ్లి;హింది, పంజాబిలలో ఇమ్లి/చించ్‍పాల/తింతిదిక (tintidika).చింతచెట్లు బయలుప్రదేశాలలో పెరుగును.బాటలకిరువైపుల పెంచెదరు.కొన్నొచోట్ల గుంపుగా చింతతోట/తోపులుగా పెంచెదరు.మైదాన ప్రాంతాలంతా వ్యాప్తి ఉంది.దేశంలో ఆంధ్ర, బెంగాల్, బీహరు, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, హిమాలయ దిగువపరిసర ప్రదేశాలలో వ్యాపిచెంది ఉంది.చింత పిక్కల నుండి చింతపిక్కల నూనె తీయుదురు. చింతపిక్కలో 7-8% వరకు నూనె లభించును.

చింతపిక్కల నూనె= ప్రధానవ్యాసం చింతపిక్కల నూనె చూడండి

గుగ్గిలం కలప చెట్టుసవరించు

దీనిని తెలుగులో తంబచెట్టులేదా సర్జకాము అనికూడా అంటారు.వృక్షశాస్త్రనామము:షొరియ రొబస్టా (shorea robusta).ఇది డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన చెట్టు.ఇంగ్లిషులో సాక్ (sal) అంటారు.సంస్కృతంలో అశ్వకర్ణ, హిందిలో సాల్/సాఖు, కేరళలో మరమరం, తమిళంలో కుగ్గిలము, కర్నాటకలో కబ్బ, ఓడిస్సాలో సాల్వ, /సేక్వ అనిపిలుస్తారు.ఇది అడవుల్లో పెరిగే చెట్టు.భారతదేశంలో అస్సాం, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నేపాల్, దక్కను పీఠభూమిప్రాంత అడవుల్లో విస్తారంగా వ్యాపించివున్నది.సాల్ గింజలనుండి తీసిన నూనెనూసాల్‌సీడ్ నూనె అంటారు.

సాల్‌సీడ్ నూనె= ప్రధానవ్యాసం సాల్‌సీడ్ నూనెచూడండి.

కొకుమ్ చెట్టుసవరించు

ఈచెట్టుగట్టిఫెరె (Guttiferac) కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామము:గర్సినియ ఇండికా చొయిసి (Garcinia indica choisy).భారతదేశంలో వ్యవహారిక పేర్లు:సంస్కృతంలో రక్తపురక్, హిందిలో కొలిమ్, కర్నాటకలో మురుగల, కేరళలో పునముపులి, తమిళనాడులో మురుగల్, గుజరాతిలో కొకుమ్, మహారాష్ట్రలో బిరుండ్/కొకుమ్/రతంబ, ఒడిస్సాలో తింతులి, ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్/రెడ్ మాంగొస్టెన్.ఆవాసం:వర్షాయుత పశ్చిమ కనుమల ప్రాంతాలైన మైసూరు, కూర్గ్, వైనీడ్, ఖసి, జైంతల కొండలు, తూర్పు కనుమలో బెంగాల్, అస్సాం, అందమాన్ నికోబార్ దీవులు.నూనెను కొకుం నూనెఅందురు.

కొకుం నూనె= ప్రధానవ్యాసం కొకుం నూనె చూడండి

మామిడిచెట్టుసవరించు

 
మామిడి గింజలు

మామిడి చెట్టును ఆంగ్లంలో మ్యాంగో (mango) అంటారు.తీపిరుచి కలిగిన ఫలాలనిచ్చును.వృక్షశాస్త్రనామము:మాంగిఫెర ఇండిక లిన్ (Mangifera indica linn).ఇది అనకార్డియేసి (anacardiaceae) కుటుంబానికిచెందిన చెట్టు.మామిడిపండులోని మృదువైన తీపిగుజ్జులోన గట్టి టెంక (shell) కలిగిన మామిడి విత్తనం/పిక్క వుండును.మామిడి పిక్కలో6-8% వరకు నూనె వుండును.మామిడిపిక్కలనుండి తీసిన నూనెను మామిడిపిక్కనూనె అంటారు.ఈనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు అధికశాతంలో వుండటం వలన గదిఉష్ణోగ్రతవద్ద ఘనస్ధితిలో వుండును.భౌతిక, రసాయనలక్షణాలు కొకో బట్టరును పోలివుండును.

మామిడిపిక్కనూనె=ప్రధాన వ్యాసం మామిడిపిక్కనూనెచూడండి.

ధూప చెట్టు /ధూప దామరసవరించు

ధూప చెట్టు యొక్క వృక్షశస్త్రనామం:వెటెరియ ఇండిక లిన్ (veteria indica linn).ఈచెట్టు డిప్టెరోకార్పేసి (dipterocarpaceae) కుటుంబానికి చెందినది.

ఇతరభాషలో పేరు :సంస్కృతంలో ధూప/కుందుర/అజకర్ణ, హిందిలో ఖరుబ/సఫేద్ దామరు, మరాఠిలో ధూప/రాల్, తెలుగులో ధూప, కేరళలో పైని, తమిళంలో ధూప్/పినె, కర్నాటకలో ధూప/సాల్ ధూప.ఆంగ్లంలో ఇండియన్ కొపల్ ట్రీ (Indian copal tree).

ఈ చెట్లు తేమకలిగిన సతతహరిత, పార్శిక హరితఅడవులో అధికంగా వుండును.పశ్చిమకనుమల్లో పర్వతపాదప్రాంతాలలో కర్నాటకనుండి కేరళ వరకు, అలాగే దక్కను పీఠభూమిలోను వ్యాప్తి ఉంది.సముద్రమట్టం నుండి 60 నుండి 1200మీటర్ల ఎత్తులో (altitude) పెరుగును.మహరాష్ట్ర, ఒడిస్సాలో కూడా కొంతమేరకు వ్యాపించి ఉన్నాయి.ఇతరదేశాలకొస్తె ఈస్ట్ఇండిస్ లో ఉన్నాయి.గింజలనుండి తీసిన నూనెనుధూప నూనెఅందురు.ధూపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా వుండుటవల్ల ధూపనూనెను, ధూప కొవ్వు/బట్టరు అనికూడా పిలవడంకద్దు.

ధూప నూనె= ప్రధాన వ్యాసం ధూప నూనె చూడండి.

నాగకేసరిచెట్టుసవరించు

ఈచెట్టును తెలుగులో నాగకేశర్ అనికూడా వ్యవహరిస్తారు.ఇది గట్టిఫెరె కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశస్త్రనామము:మెసుయ ఫెర్రె .లి. (Mesua ferrea.linn). ఈచెట్టును హిందిలో నహొర్/నాగ్‍కేశర్, కర్నాటకలో నాగసంపిగె, కేరళలో నంగు/ఛురాలి, తమిళనాడులో నంగల్/సురులి, మరాతి, గుజరాత్‍లో నాగ్‍చంప, అస్సాంలో నహొర్, ఒడిస్సాలో నగెస్‍వరొ (nageshwaro) బెంగాలిలో నగ్‍కెసర్ అనియు, ఆంగ్లంలో పగొడ చెట్టు (pogoda tree) అని వ్యవహరిస్తారు. ఆచెట్లు తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమ (western ghats) లు, కర్నాటక, కేరళలలోని సతతహరిత అడవుల్లో, అలాగే అస్సాం, బెంగాల్, అండమాన్‍దీదులలోని అడవుల్లోను వ్యాప్తి ఉంది.దక్షిణ భారతంలోని వీటి వునికి ఉంది.తమిళనాడులోని తిరువన్‍మలై అటవీ ప్రాంతంలో పెరియ నుంగు రకం, అలాగే కేరళలోని పాలఘాత్లోని సైలంట్ వ్యాలిలో వ్యాప్తి చెందివున్నాయి.సముద్రమట్టంనుండి 200 అడగుల ఎత్తువరకు పెరుగును.నాగకేసరి నూనెను ఎక్కువగా హిందిపేరుతో నహొర్ ఆయిల్అని పిలుస్తారు.

నాగకేసరి నూనె= ప్రధాన వ్యాసం నాగకేసరి నూనె చూడండి.

రబ్బరు చెట్టుసవరించు

 
రబ్బరు గింజలు

రబ్బరు (Rubber) అనునది ఇంగ్లిషు పదం.ఇదేపదం కొంచెం పదవుచ్ఛరణ తేడాతో భారతదేశభాషలలో వాడుకలో వున్నది (rabar, rabbara, rabbaru etc.).రబ్బరుచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం హెవియ బ్రాసిలిన్‍సిస్ ముల్ (Hevea brasiliensis muell).ఈచెట్టు యుఫోర్బియేసి (euphporbiaceae) కుటుంబానికి చెందినది.మూల జన్మస్దానం అమెజాన్ లోయలు, వెనెజుల, పెరు, యుకడారు, కొలంబియా.భారతదేశంలో కేరళ, తమిళనాడు, కర్నాటకలలో రబ్బరుచెట్ల తోటలసాగు జరుగుతున్నది.రబ్బరు గింజలనుండి తీసిన నూనెను రబ్బరుగింజల నూనెఅందురు.

రబ్బరుగింజల నూనె= ప్రధాన వ్యాసం రబ్బరుగింజల నూనె చూడండి.

ఇప్ప చెట్టుసవరించు

ఇప్పచెట్టు పూలనుండి గిరిజనులు ఇప్పసారా తయారుచేయుదురు.పూలను ఆహారంగా కూడా తీసుకుంటారు.ఇప్పచెట్టు సపోటేసి (sapotacae) కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:బస్సియ లేదా మధుక లాంగిఫొలియ (Bassia or Madhuca langifolia). ప్రాంతీయభాష్లలోపేర్లు:

  • సంస్కృతం:మధుక
  • హింది :మౌహ (mahua)
  • గజరాత్:మహుడ (mahuda)
  • మహరాష్ట్ర:మొహ
  • ఒడిస్సా:మొహల, కర్నాటక:హిప్పె, కేరళ:ఇళుప (ilupa)

దేశంలో అంధ్ర, బీహరు, కర్నాటక, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్దాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, బెంగాల్ అటవి ప్రాంతంలో పెరుగుతున్నది.ఇప్పచెట్టు గింజలనుండి తీయునూనెనుఇప్పనూనె అంటారు.

ఇప్పనూనె= ప్రధాన వ్యాసం ఇప్పనూనె చూడండి.

మోదుగచెట్టుసవరించు

మోదుగ చెట్టు 10-15 అడుగులు ఎత్తు పెరుగు చెట్టు.ఈచెట్టుఫాబేసికుటుంబానికి చెందినది.ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:బుటియ మోనొస్పెర్మా.ఇందులోనే మరొరకంచెట్టు బుటియ ఫ్రొండొస కొయిన్ (Butea frondosa koen).

ఇతరభాషల్లో పిలువబడు పేర్లు: సంస్కృతంలో పలాష్ (palash, హిందిలో పలాష్, ఛల్చ (chalcha, కేరళలో మురికు (muriku, కర్నాటకలో మధుగ (madhuga, తమిళంలో పరసు/పరొసమ్ (parasu/porosum, ఒడిస్సాలో కింజుకొ, బెంగాలిలో కినక/పలస (kinaka/palasa, ఆంగ్లంలో 'flame of the fotest'/butea gum tree' అంటారు.ఈ చెట్టు గింజలలో 17-19%శాతం వరకు నూనె ఉంది.ఈ నూనెను వంట నూనెగా కాకున్నను పరిశ్రమలలో ఇతర ప్రయోజనాలకై వినియోగించవచ్చును.గింజలనుండి తీసిననూనెను మోదుగనూనెఅంటారు.హిందిలో పలాష్ ఆయిల్ అంటారు.

ఇప్పనూనె= ప్రధాన వ్యాసం ఇప్పనూనెచూడండి.

పొన్న/పున్నాగ చెట్టుసవరించు

ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:కాలోపైలం ఇనొపైలం (calophyllum inophyllum.linn).ఇది గట్టిఫెరె కుటుంబానికిచెందిన మొక్క.తెలుగులో పున్న/పొన్న/పున్నాగ/నమేరు అనికూడా పిలుస్తారు.హిందిలో సుల్తాను చంప, మహారాష్ట్రలో యుండి (Undi) అనిపిలుస్తారు.గింజలనుండి తీసిననూనెను పొన్ననూనె అంటారు.

పొన్ననూనె= ప్రధాన వ్యాసం పొన్ననూనె చూడండి.

అడవిఆముదం చెట్టుసవరించు

అడవిఆముదం గుంపుగా కొమ్మలు కలిగిన పొదవంటి చెట్టు.3-4 మీటర్ల ఎత్తు పెరుగును.తెలుగులో 'నేపాలం', ఉండిగాపు అనికూడా వ్యవహరిస్తారు.వృక్షశాస్తనామం:జట్రొఫా కురికస్ (Jatropha curcas).ఈచెట్టు యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో పలురకాలున్నాయి.ఈ చెట్లు బాటలపక్కన, బయలు నేలల్లో, పొలంగట్ల వెంట, అడవలపాద ప్రాంతాలలో కనిపిస్తాయి.ఈ చెట్టు గింజలనుండి తీసిన నూనెను అడవిఆముదం నూనె లేదా జట్రొఫా నూనె అనిఅంటారు.

అడవిఆముదం నూనె= ప్రధాన వ్యాసం అడవిఆముదం నూనె చూడండి.

బాదంచెట్టుసవరించు

బాదం (Almond) చెట్టురోసేసి కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్ (prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక, పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను బాదం నూనెఅందురు.

బాదం నూనె= ప్రధాన వ్యాసం బాదం నూనెచూడండి.

పిలు చెట్టు(Pilu)/జలచెట్టుసవరించు

పిలు అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో జలచెట్టు, వరగొగు అనిఆంటారు.ఈచెట్టుసాల్వడారేసికుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene) ;మంచి పిలు లేదా తియ్య పిలు (sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె (salvadora persica Linn) ;దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు (tooth brush tree) అంటారు.గింజలనుండి తీసిన నూనె పిలు నూనె.

పిలు నూనె= ప్రధాన వ్యాసంపిలు నూనెచూడండి.

హహొబ(jojoba)చెట్టుసవరించు

పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్ (sonoran) ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో, పొడినేలలో, చవిటి నేలలలో, అధిక ఉష్ణోగ్రత వున్న ప్రాంతాలలోకూడా పెరుగుతుంది.భారతదేశంలో 60వ దశకంలో IARI (Indian arid region ) ద్వారా ప్రవేశపెట్టబడింది.IARI ప్రస్తుతపేరుNBPGR (National Bureau and Genetic Resources). ఆసంస్థ ఆద్వర్యంలో పలుకేంద్రాలు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా లలో పనిచేస్తున్నాయి.ఉచ్చారణ హహోబ అనివున్నను అక్షరాలలో 'jojoba'అనివ్రాస్తారు. గింజలనుండి హహొబ నూనె ఉత్పత్తిచేయుదురు.

హహొబ నూనె = ప్రధాన వ్యాసం హహొబ నూనె చూడండి.

కుసుమ్(kusum)చెట్టుసవరించు

కుసుం అనేది హింది పేరు, ఉత్తరభారతంలో ఈచెట్టు ఎక్కువగా ఈపేరుతోనే వ్యవహరింపబడుతున్నది.ఇదిసపిండేసి (sapindaceae) కుటుంబానికి చెందినచెట్టు.వృక్షశాస్త్రనామం:achleichera trijuga.గింజలనుండి తీయునూనెనూకుసుమ్ నూనె' లేదా మకస్సర్ నూనె (macassar oil) అంటారు..

కుసుమ్ నూనె= ప్రధాన వ్యాసం కుసుమ్ నూనెచూడండి.

ఆప్రికాట్ చెట్టుసవరించు

ఈచెట్టురోసేసి కుటుంబానికి చెందినమొక్క.వృక్షశాస్త్రనామం:ప్రునస్ అర్మెనియక (Prunus armeniaca).గింజలనుండితీసిన నూనెను ఆప్రికాట్ నూనె అంటారు.

ఆప్రికాట్ నూనె= ప్రధాన వ్యాసం ఆప్రికాట్ నూనెచూడండి.

ఫల్వార(phulwara)/చిహరి(chiuri)చెట్టుసవరించు

ఈచెట్టును నేపాల్‍బట్టరుచెట్టు (nepal Butter tree, ఛుర (chura).ఫల్వార్ (phulware) చెట్టు అని పిలుస్తారు.తెలుగుపేరు తెలియరాలేదు.సపోటేసి కుటుంబానికి చెందినది.గింజలనుండి తీసిన నూనెను ఫల్వార నూనె లేదా చిహర నూనె అంటారు.

నారింజ చెట్టుసవరించు

నారింజ చెట్ల గింజలనుండి నారింజ విత్తన నూనె ఉత్పత్తి చెయ్యవచ్చు.గింజల్లో 56%వరకు నూనె వున్నది.నూనెలో పామిటిక్, స్టియరిక్ సంతృప్తకొవ్వూఆమ్లాలు.ఒలిక్ ఆమ్లం అనే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నవి.లినోలిక్ ఆమ్లం లేసమాత్రంగా అనవాలు స్థాయిలో వున్నది.