బాద్ ఖల్ సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల ఫరీదాబాద్ సమీపంలోని బాద్ ఖల్ గ్రామంలో ఉన్న ఒక సహజ సరస్సు. ఇది భారత రాజధాని ఢిల్లీ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1][2]

బాద్ ఖల్ సరస్సు
2008 నాటికి ఎండిన బాద్ ఖల్ సరస్సు
బాద్ ఖల్ సరస్సు is located in India
బాద్ ఖల్ సరస్సు
బాద్ ఖల్ సరస్సు
ప్రదేశంఫరీదాబాద్
అక్షాంశ,రేఖాంశాలు28°24′54″N 77°16′34″E / 28.415°N 77.276°E / 28.415; 77.276
ప్రవహించే దేశాలుభారతదేశం
ప్రాంతాలుఫరీదాబాద్

భౌగోళికం

మార్చు

ఆరావళి శ్రేణి కొండల అంచున ఈ సరస్సుకు మానవ నిర్మిత కట్ట ఉంది. అనేక కరువుల కారణంగా సరస్సు రెండు దశాబ్దాల క్రితం నుండి ఎండిపోవటం ప్రారంభించింది ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. దీని సమీపంలో హర్యానా టూరిజం కార్పొరేషన్ రెస్టారెంట్లు ఉన్నాయి.[3]

చుట్టూ ఉన్న ప్రదేశాలు

మార్చు

సరస్సు చుట్టూ 10 వ శతాబ్దపు పురాతన సూరజ్ ఖండ్ రిజర్వాయర్ (ఉత్తరాన 15 కి.మీ దూరంలో), అనంగ్పూర్ ఆనకట్ట (ఉత్తరాన 16 కి.మీ దూరంలో) వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఎండిపోయిన దమ్దామా సరస్సు, తుగ్లకాబాద్ కోట, ఆదిలాబాద్ శిధిలాలు, ఛతార్పూర్ ఆలయం వంటివి ఉన్నాయి.[4]

చరిత్ర

మార్చు

సమీపంలోని పొలాలకు నీటి సరఫరాను సులభతరం చేయడానికి 1947 లో దేశానికి స్వాతంత్ర్యం లభించిన వెంటనే ఈ సరస్సు నిర్మించబడింది. నీటిపారుదల కోసం రెండు లోతట్టు ఆరావళి కొండల మధ్య ఒక కట్టను నిర్మించడం ద్వారా దీనిని నిర్మించారు.[5]

కరువు

మార్చు

2009 నుండి, సరస్సు పూర్తిగా ఎండిపోయినట్లు గుర్తించబడింది. ఈ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం నమోదు కావడమే ఇందుకు కారణం.

సర్వే

మార్చు

జనవరి 2010 లో, ఈ సరస్సు, సమీపంలోని సూరజ్ ఖండ్ వంటి ప్రాంతాలు నీటితో నిండి ఉన్నాయి. కానీ మార్చి 2014 లో ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ పార్క్స్ అండ్ గార్డెన్స్ సొసైటీ (డిపిజిఎస్) విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో, ఈ సరస్సు పూర్తిగా ఎండిపోయినట్లు, నీటి కోసం వర్షాలపై పూర్తిగా ఆధారపడి ఉంది అని గుర్తించింది. ఢిల్లీలోని 611 నీటి వనరులలో 190 నీటి వనరులు ఎండిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది.[6]

పునరుద్ధరణ

మార్చు

2019 నాటికి, సరస్సును పునరుద్ధరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. కానీ దెబ్బతిన్న జలచరాలు, తక్కువ భూగర్భజల మట్టం, నీటి పరీవాహక మార్గాల భంగం వంటి వాటి వలన పునరుద్ధరణ చెందకుండా ఉంది.[7]

మూలాలు

మార్చు
  1. ASOLA BHATTI WILD LIFE SANCTUARY Archived 16 ఆగస్టు 2011 at the Wayback Machine, Department of Forest, Delhi Government
  2. पाली गांव की पहाड़ियों पर डैम बनाकर रोका जाएगा झरनों का पानी
  3. "Faridabad's Badkal lake to be given new lease of life as tourist centre". Hindustantimes.com. 28 July 2019. Retrieved 2020-01-15.
  4. "Dry for 20 years, experts seek reforestation to revive Badkhal lake (Delhi's Water Bodies-1)". Outlook. 18 May 2019. Retrieved 2020-01-15.
  5. "Badkhal". Haryana Tourism. Archived from the original on 2014-03-02. Retrieved 2014-03-18.
  6. "Delhi's water bodies face threat of extinction". India Today. 1 March 2014. Retrieved 2014-03-18.
  7. "Sewage treatment project to revive Badkhal lake hangs fire". tribuneindia.com. 9 October 2019. Retrieved 2020-01-15.