బానోతు చంద్రావతి

(బానోత్ చంద్రావతి నుండి దారిమార్పు చెందింది)

బానోతు చంద్రావతి, మాజీ శాసనసభ్యురాలు.[1] ఆమె షెడ్యూల్ తెగల సామాజిక వర్గానికి చెందినది. ఆమె 2014లో సి.పి.ఐ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరింది. ఆమెను 2014 డిసెంబరు 18 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యురాలిగా నియమించారు.[2]

డా. చంద్రావతి
బానోతు చంద్రావతి


మాజీ శాసనసభ్యురాలు
పదవీ కాలం
2009 - 2014
తరువాత బానోత్ మదన్‌లాల్
నియోజకవర్గం వైరా శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1983-08-31)1983 ఆగస్టు 31
ఖమ్మం
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) (20019 - 2014)
భారత్ రాష్ట్ర సమితి (2014 - ప్రస్తుతం)
జీవిత భాగస్వామి సురేష్
నివాసం ఖమ్మం
మతం హిందూ

ప్రారంభ జీవితం

మార్చు

ఆమె ఖమ్మం జిల్లాలోని లంబాడా గిరిజన తెగకు చెందిన కుటుంబంలో 1983 ఆగస్టు 31న రాంబాయి, రామమూర్తి దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి రామమూర్తి ఆర్.టి.సిలో డిపో మేనేజరుగా పనిచేస్తున్నాడు. మాధ్యమిక విద్యను ఖమ్మం లోని వాణీ విధ్యానికేతన్ లో పూర్తిచేసింది. 2001లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తిచేసింది. 2007లో ఆంధ్రా మెడికల్ కళాశాల నుండి ఎం.బి.బి.ఎస్ చేసింది. 2009లో సి.పి.ఐ పార్టీలోకి చేరి శాసనసభ్యురాలిగా వైరా నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందింది. [3][4]

వృత్తి జీవితం

మార్చు

బానోతు చంద్రావతి 2009లో ఆంధ్రప్రదేశ్ శానసభకు ఎన్నికయ్యింది. ఆమె అప్పటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలు.[5] ఆమెకు 2011లో బాల్యమిత్రుడైన సురేష్ తో వివాహం జరిగింది.[1] అతను సాప్టువేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.[6]

ఆమెకు మహిళ, యువత, వైద్యం , ఆరోగ్యం, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీఓలు, జూనియర్ వైద్యుల సంఘం, అసంఘటిత రంగాలు , కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో అనుభవం ఉంది. రాష్ట్రంలోని యువత , మహిళల ప్రతినిధిగా ఆమె లక్ష్యం తెలంగాణ రాష్ట్ర శాంతియుత ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధిని నిర్ధారించడం.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-02-21. Retrieved 2020-06-09.
  2. India, The Hans (2014-12-25). "No scope for corruption in TSPSC: Chandravathi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-09.
  3. Sakshi (14 March 2019). "చిన్న వయసులోనే.. పెద్ద రికార్డు". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  4. "అఫిడవిట్" (PDF). Retrieved 21 May 2021.
  5. "Car parking row in House". 6 March 2010 – via www.thehindu.com.
  6. "CPI MLA marries childhood friend". The Siasat Daily - Archive (in అమెరికన్ ఇంగ్లీష్). 2001-11-30. Retrieved 2020-06-09.
  7. "Telangana State Public Sercice Commission". www.tspsc.gov.in. Archived from the original on 2020-06-09. Retrieved 2020-06-09.

బాహ్య లంకెలు

మార్చు
  1. "Dr. Banoth Chandravathi Interview - Part 3". www.youtube.com. Retrieved 2020-06-09.