తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్

సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులను ఎంపిక చేయడానికి భారత రాజ్యాంగం ద్వారా రూపొందిం
(తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుండి దారిమార్పు చెందింది)

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్‌సి), భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఇది 2014 ఆగస్టు 18న ఏర్పాటైంది. భారత రాష్ట్రమైన తెలంగాణలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు[1] దరఖాస్తుదారుల యోగ్యత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్
టీజీపీఎస్‌సి లోగో
సంకేతాక్షరంటీజీపీఎస్‌సి
స్థాపన18 ఆగస్టు 2014; 9 సంవత్సరాల క్రితం (2014-08-18)
రకంరాజ్యాంగ సంస్థ
కేంద్రీకరణనియామకాలు
కార్యస్థానం
 • ప్రతిభా భవన్, ఎం.జె. రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు, 500001, తెలంగాణ
సేవా ప్రాంతాలుతెలంగాణ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్

ఈ రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపికచేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తోంది. నియామకానికి తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవి ఈ సంస్థ కార్యకలాపాలు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అమల్లోకొచ్చింది. 2015, ఏప్రిల్ 11న అప్పటి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.[2] డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఘంటా చక్రపాణి టిఎస్‌పిఎస్‌సికి మొదటి ఛైర్మన్‌గా నియమించబడ్డాడు. ఘంటా చక్రపాణిని చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ నరసింహన్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశాడు. చక్రపాణి డిసెంబర్ 18న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సి)ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా (టీజీపీఎస్‌సి)గా మారుస్తూ ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి 2024 మే 27న ఉత్తర్వులు జారీ చేసింది.[3]

చరిత్ర

మార్చు

చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1947లో పబ్లిక్ కమిషన్ ను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణరావు కాలంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ముందంజలో నిలిచింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో విలీనం చేశారు. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విభజించబడే వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉనికిలోనే ఉంది.[4]

సంస్థ

మార్చు

భారత రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ గవర్నర్ చేత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు నియమించబడుతారు.

మొదటి కమిషన్

మార్చు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొదటి చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ నరసింహన్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశాడు. చక్రపాణి డిసెంబర్ 18న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[5][6] ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా సీ.విఠల్, మతీనుద్దీన్ ఖాద్రీ, డాక్టర్ బానోతు చంద్రావతిబాధ్యతలు చేపట్టారు. వాళ్ళు ఈ పదవుల్లో 2020 డిసెంబరు 17 వరకు కొనసాగారు.[7]

చైర్మన్
సభ్యులు
 1. చింతలగట్టు విఠల్ (సీహెచ్‌. విఠల్‌) - 18.12.2014 నుండి 17.12.2020 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 2. డా.బానోతు చంద్రావతి - 18.12.2014 నుండి 17.12.2020వరకు సభ్యురాలిగా పని చేసింది.
 3. డా.మొహమ్మద్ మతీనుద్దీన్ ఖాద్రి - 18.12.2014 నుండి 17.12.2020 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 4. డి.కృష్ణారెడ్డి - 14.10.2015 నుండి 18.03.2021 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 5. డా.కె.రామమోహన్ రెడ్డి - 14.10.2015 నుండి 12.02.2021వరకు సభ్యుడిగా పని చేశాడు.
 6. సీహెచ్ విద్యాసాగర్ రావు - 14.10.2015 నుండి 25.05.2018 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 7. ప్రొ.చింతా సాయిలు [9][10]
 8. బి.మన్మధ రెడ్డి - 04.01.2016న సభ్యుడిగా భాద్యతలు చేపట్టాడు.[11]

కొత్త సిలబస్ కోసం నిపుణుల కమిటీ

మార్చు

టీఎస్పీఎస్సీ తెలంగాణ పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకోవడానికి కొత్త సిలబస్‌ను రూపొందించింది. ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొ.హరగోపాల్, వీ.ఎస్ ప్రసాద్, కోదండరామ్, కె.నాగేశ్వర్, చుక్కా రామయ్య వంటి విద్యా నిపుణులు, మేధావులతో సహా దాదాపు 30 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పరీక్షలకు కావాల్సిన సిలబస్, విధివిధానాలను రూపొందించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రెండవ కమిషన్

మార్చు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ రెండవ కార్యవర్గం 2021, మే 19న నియమించబడింది.[12] చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించగా, ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదించింది.[13][14][15] వారు 2021, మే 21న బాధ్యతలు చేపట్టారు.[16][17][18]

చైర్మన్
సభ్యులు
 1. కారం రవీందర్‌రెడ్డి టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు[19] 21.05.2021 నుండి 10.01.2024 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 2. ఆర్‌.సత్యనారాయణ (మాజీ ఎమ్మెల్సీ)[20] 21.05.2021 నుండి 10.01.2024 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 3. రమావత్‌ ధన్‌ సింగ్‌ (రిటైర్డ్‌ ఈ ఎన్సీ)
 4. బండి లింగారెడ్డి (సీబీఐటీ ప్రొఫెసర్) 21.05.2021 నుండి 10.01.2024 వరకు సభ్యుడిగా పని చేశాడు.
 5. కోట్ల అరుణ కుమారి (ఎస్డీసీ)
 6. సుమిత్రా ఆనంద్‌ తనోబా (తెలుగు భాషా పండిట్‌) - 2021 మే 21 – 2023 జనవరి 12[21]
 7. ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు (ఆయుర్వేద వైద్యులు)

రాష్ట్రంలో 2023లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వంలో నియమితులైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మిగతా ముగ్గురు సభ్యులు తమ పదువులకు రాజీనామా చేశారు.[22] చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, ముగ్గురు సభ్యుల ఆర్‌.సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్‌రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ 2024 ఫిబ్రవరి 10న ఆమోదించింది.[23]

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యురాలు సుమిత్ర ఆనంద్‌ తనోబా తన పదవికి 2023 జనవరి 12న రాజీనామా చేస్తూ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపింది.[24]

మూడవ కమిషన్

మార్చు
 1. ఎం. మహేందర్ రెడ్డి, చైర్మన్‌
 2. అనితా రాజేంద్ర (ఐఏఎస్ రిటైర్డ్)
 3. అమీర్ ఉల్లా ఖాన్ (ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్.)
 4. నర్రి యాదయ్య
 5. యారబడి రామమోహనరావు
 6. పాల్వాయి రజనీకుమారి[25]

విధులు

మార్చు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పదవులకు తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం కమిషన్ ప్రాధమిక విధులలో ఒకటి. కమిషన్ ముఖ్యమైన చట్టబద్ధమైన విధులు:[26]

 • ప్రత్యక్ష నియామకం
 • రాష్ట్ర, సబార్డినేట్ సేవలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల ఆమోదం
 • ప్రత్యేక కేసులలో కారుణ్య నియామకాలకు సమ్మతి
 • బదిలీ/ప్రమోషన్ ద్వారా నియామకం
 • క్రమశిక్షణా కేసులు
 • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం
 • అర్థ వార్షిక పరీక్షలు
 • తాత్కాలిక నియామకాలు - కమిషన్ సమ్మతి

80,039 ప్రభుత్వ ఉద్యోగాలు

మార్చు

తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు 2022 మార్చి 9న శాసనసభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. వీటిలో 80,039 నియామకాలు చేపడతామని, 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పారు.[27] ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులెవరూ వదంతులను నమ్మవద్దని, ప్రతిభను మాత్రమే నమ్ముకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదవాలని, ఆందోళనకు తావు లేకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలని తెలిపారు.[28]

గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలచేసి 503 పోస్టులకు రాతపరీక్ష నిర్వహించింది.

2022 నవంబరు 25న ఆర్థికశాఖ నుండి 9,168 గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంతో డిసెంబరు 1న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. ఇందులో అత్యధికంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నది. రెవెన్యూ శాఖలో 2,077, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో 1,245 పోస్టులు, ఉన్నతవిద్యలో 742 పోస్టులను నింపనున్నారు. డిసెంబరు 23వ తేదీ నుంచి 2023 జనవరి 12 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించి, రాతపరీక్షను 2023 ఏప్రిల్‌ లేదా మే నెలలో నిర్వహించనున్నారు.[29][30]

హెల్ప్‌‌డెస్క్‌

మార్చు

టీ‌ఎ‌స్‌‌పీ‌ఎస్సీలో నమోదు చేసుకోవడానికి సంబంధించిన వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌ (ఓ‌టీ‌ఆర్‌) ఎడి‌ట్‌ను సుల‌భ‌తరం చేసింది. ఐడీ మర్చి‌పో‌యినా, అప్పటి ఫోన్‌ నంబర్‌ ప్రస్తుతం వాడు‌కలో లేక‌పో‌వడం వంటి సమస్యల పరి‌ష్కారానికి హెల్ప్‌‌డెస్క్‌ నంబర్‌ 040–22445566 ఏర్పాటుచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా సంప్ర‌దిం‌చాడంకానీ, helpdesk@tspsc.gov.in ఈ–మె‌యి‌ల్‌కు వివ‌రాలు పంపిం‌చినాకానీ లేదా అభ్య‌ర్థులు నేరుగా నాంప‌ల్లి‌లోని టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ ఆఫీ‌సుకు వెళ్ళి లిఖిత పూర్వ‌కంగా దర‌ఖాస్తు చేసు‌కున్నాకానీ వివ‌రాలు అందింస్తారు.[31]

అవార్డులు

మార్చు
 • స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు -2015[32]

మూలాలు

మార్చు
 1. "Telangana to start hiring, picks panel chief". Deccanchronicle.com. 2014-12-18. Retrieved 19 May 2021.
 2. "TSPSC official Website Launch". Myinfoindia.com. 2015-04-12. Retrieved 19 May 2021.
 3. V6 Velugu (29 May 2024). "TSPSC ని TGPSC గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. "Telangana State Public Service Commission". Tspsc.gov.in. Archived from the original on 18 మే 2015. Retrieved 19 May 2021. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 5. Sakshi (18 December 2014). "బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి". Sakshi. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
 6. The Hindu (18 December 2014). "Ghanta Chakrapani is first Chairman of TSPSC". The Hindu (in Indian English). Retrieved 20 May 2021.
 7. The Hans India (15 December 2020). "Safety of kids on top of Telangana government's mind". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
 8. Sakshi Education (24 March 2018). "టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు". www.sakshieducation.com. Archived from the original on 9 June 2019. Retrieved 21 May 2021.
 9. Sakshi (1 April 2021). "టీఎస్‌పీఎస్సీలో ఒకే ఒక్కడు!". సాక్షి. Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
 10. Namaste Telangana (2 November 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యుడు చింతా సాయిలు పదవీ విరమణ". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
 11. "TSPSC First Commission Members List". 2024. Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
 12. Eenadu (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
 13. The Indian Express, Telangana (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
 14. నమస్తే తెలంగాణ, తెలంగాణ (19 May 2021). "టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకం". Namasthe Telangana. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
 15. The Hans India, Ravali (19 May 2021). "B Janardhan Reddy Has Been Appointed As The TSPSC Chairman". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
 16. Namasthe Telangana (21 May 2021). "కొలువుదీరిన కొలువుల కమిషన్‌". Namasthe Telangana. Archived from the original on 22 May 2021. Retrieved 22 May 2021.
 17. Eenadu (22 May 2021). "TSPSC:టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం". EENADU. Archived from the original on 22 May 2021. Retrieved 22 May 2021.
 18. The New Indian Express (22 May 2021). "Janardhan Reddy assumes charge as PSC chief; new members take oath". The New Indian Express. Archived from the original on 22 May 2021. Retrieved 22 May 2021.
 19. V6 Velugu (16 December 2023). "ఇద్దరు టీఎస్‌పీఎస్సీ మెంబర్లు రిజైన్​". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023. {{cite news}}: zero width space character in |title= at position 37 (help)CS1 maint: numeric names: authors list (link)
 20. Eenadu (15 December 2023). "తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో మరో సభ్యుడి రాజీనామా". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
 21. Andhrajyothy (13 January 2024). "నామినేటెడ్‌ పదవుల భర్తీపై సర్కారు దృష్టి". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
 22. Namaste Telangana (15 December 2023). "టీఎస్‌పీఎస్సీ సభ్యులు కారం రవీందర్‌రెడ్డి, లింగారెడ్డి రాజీనామా..!". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
 23. Eenadu (11 January 2024). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
 24. Namaste Telangana (12 January 2024). "టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల". Archived from the original on 12 January 2024. Retrieved 12 January 2024.
 25. Andhrajyothy (25 January 2024). "టీఎస్పీఎస్సీ కమిటీలో ఉమ్మడి జిల్లా వాసులు". Archived from the original on 26 January 2024. Retrieved 26 January 2024.
 26. "Telangana State Public Service Commission". Tspsc.gov.in. 2014-08-08. Archived from the original on 2015-05-18. Retrieved 19 May 2021. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 27. reserved, © Ushodaya Enterprises Pvt Ltd All rights. "తెలంగాణలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!". EENADU PRATIBHA. Retrieved 2022-03-11.
 28. telugu, NT News (2022-03-10). "ప్రతిభను నమ్ముకోండి". Namasthe Telangana. Retrieved 2022-03-11.
 29. "గ్రూప్‌-4 బొనాంజా". EENADU. 2022-12-02. Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02.
 30. telugu, NT News (2022-12-02). "కొలువుల బొనాంజా.. 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌". www.ntnews.com. Archived from the original on 2022-12-02. Retrieved 2022-12-02.
 31. telugu, NT News (2022-04-09). "OTR | ఓటీ‌ఆర్‌ ఎడిట్‌ ఇక ఈజీ!.. టీఎ‌స్‌‌పీ‌ఎ‌స్సీలో హెల్ప్‌‌డెస్క్‌ ఏర్పాటు". Namasthe Telangana. Archived from the original on 2022-04-09. Retrieved 2022-04-09.
 32. "Skoch Order of Merit Award for TSPSC". The Hans India. 8 December 2015. Retrieved 14 September 2019.

బయటి లింకులు

మార్చు