బానోత్ జాలం సింగ్

బానోత్ జాలం సింగ్ (02 అక్టోబర్ 1943 -16 డిసెంబర్ 2020)[1] బంజారా లంబాడీ గిరిజన సమాజంలో తొలి తరం నాయకుడు దురాచారాలను దూరం చేసి లంబాడీ సమాజాన్ని చైతన్యం చేసిన సంఘసంస్కర్త. లంబాడీల హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడు[2].

బానోత్ జాలంసింగ్
జననంఅక్టోబర్ 02, 1943
నార్నూర్ ,నార్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
మరణండిసెంబర్,16 , 2020
నిజామాబాద్ ఆసుపత్రి
మరణ కారణంకరోనా
వృత్తిప్రజానాయకుడు,ఆలిం డియా బంజారా సేవా సంఘం జాతీయ నాయకులు
ప్రసిద్ధిబంజారా జాతి రత్నం
భార్య / భర్తదుర్పతబాయి
పిల్లలుసూరజ్ సింగ్, విజయ సింగ్,రణజీత్ సింగ్ కుమారులు,సావిత్ర,సుభద్ర,ఊర్మిళ కుమార్తెలు
తండ్రిశకృనాయక్
తల్లిసూర్తాబాయి

జననం మార్చు

బానోత్ జాలంసింగ్[3] గ్రామం నార్నూర్, తాలుకా ఉట్నూర్ జిల్లా ఆదిలాబాదు లో 1943 అక్టోబర్ 2న బానోత్ సుర్తాబాయి, సక్రునాయిక్,లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు.నాల్గు ఏళ్ళవయసులోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు.అతని నానమ్మ ముందడిబాయి,చిన్నమ్మచిన్నాన సుందల్ బాయి,దగ్డూనాయక్ దంపతుల పెంపకంలో పెరిగాడు.ఐదో యేట స్వస్థలం నార్నూర్ బడిలో చేరి తెలుగు భాషలో బోధన లేక పోవడంతో మరాఠీ భాషల్లో ఒకటి,రెండు తరగతులు పూర్తి చేశారు.ఆ తర్వాత దక్షిణభారత హిందీ ప్రచారసభ హైదరాబాదు వారు నిర్వహించిన పదవ తరగతి తత్సమాన విలువ గల ప్రథమ పరీక్షకు సంసిద్ధమై "ప్రథమా"పరీక్ష యందు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. తన 16వ యేట ధుర్పతబాయి అనే పదమూడేళ్ల అమ్మాయితో బాల్య వివాహమయింది.

రాజకీయ జీవితం మార్చు

జాలంసింగ్ ప్రజానాయకుడు,1967లో నయాపైసా ఆశించకుండా రాజకీయ రంగంలోకి అడుగ పెట్టి‌ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు.తన ఆలోచనని ఆచరణలో పెట్టి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి1967లో నార్నూర్ గ్రామపంచాయతీకి ఉపసర్పంచ్ ఎన్నికయ్యారు.1970లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నార్నూర్ సర్పంచిగా ఎన్నికయి 2002 వరకు సర్పంచుగా సేవలు అందించారు. దాదాపు 32 సంవత్సరాలు సుధీర్గకాలం పదవిలో కొనసాగుతు గ్రామ అభివృద్దికై కృషి చేశారు.1979-1980లో తాలుకా ఉట్నూర్ బ్లాక్ పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షపదవి కోసం పోటి చేసి 450ఓట్లతో ఓటమిపాలయ్యారు.1982లో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ స్థాపించారు.రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తు తనదైన ముద్ర వేస్తున్న బానోత్ జాలంసింగ్ కృషిని గమనించిన తెలుగుదేశం అధినేత నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించి.1985లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దేలుగుదేశం పార్టీ నుండి ఖానాపూర్[4] నియోజకవర్గపు టిక్కెట్టు కేటాయించారు.కాంగ్రెసు పార్టీ నుండి కోట్నాక భీంరావు,స్వతంత్ర అభ్యర్థిగా ఆజ్మేరా గోవింద్ నాయక్ పోటీ చేశారు.జాలంసింగ్ 1200 వందల అతి స్వల్ప ఓట్లతో ఆజ్మీరా గోవింద్ నాయక్ చేతుల్లో పరాజయం పాలయ్యారు.అతని సేవలను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ యందు జిసిసి డైరెక్టర్ నామినేటెడ్ పోస్టును కట్టబెట్టింది 1984-1986 దాదాపు రెండు సంవత్సరాలు జిసిసి డైరెక్టర్ పదవిలో కొనసాగుతు,అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అటవీ ఉత్పత్తులను దళారి వ్యాపారస్థుల నుంచి కాపాడే లక్ష్యంగా కృషి చేసి గిరిజనుల అభివృద్ధికోసం పాటుపడుతు వంద మంది గిరిజన నిరుద్యోగులకు గిరిజన సహకార సంస్థలో ఉద్యోగం కల్పించడానికి కృషి చేశారు.2001-2002లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి.తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జెడ్పీటీసీ నార్నూర్ టిక్కెట్ కేటాయించింది.నార్నూరు జెడ్పీటీసీ గా విజయం సాధించి 2002 సంవత్సరం నుండి 2007 సంవత్సరం వరకు ఐదు సంవత్సరాలు నార్నూర్ జెడ్పీటీసీగా సేవలు అందించారు.2013-2014 లో జరగిన మండల పరిషత్ ఎన్నికలు నార్నూర్ ఎంపీటీసీ గా గెలుపొంది,2014 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు ఎంపీటీసీ గా సేవలు చేశారు.

ఇతర వివరాలు మార్చు

1.బంజారా సమాజంతో పాటు అన్ని వర్గాల పక్షాన ఉండి ఆదర్శంగా నిలిచారు.

2.బంజారా సమాజాన్ని ఏకతాటి పై నడిపించిన మహోన్నతమైన వ్యక్తి[5].

3. సమాజం జాగృతి సంస్కృతి సంప్రదాయాలను అనుగుణంగా జాతిని చైతన్య పర్చడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది.

4. 1965 నుంచి ఆయన ఆధ్యాత్మికత భక్తిమార్గంలో అహింస,వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ సమాజాన్ని జాగృతం చేశారు.

5. బంజారాల సమస్య పై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి సహాకారంతో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ దృష్టికి తీసుకువెళ్ళి తెలంగాణలో నివసిస్తున్న లంబాడీ లను షెడ్యూల్డ్ ట్రైబ్ లో చేర్చేందుకు కృషి చేసిన వారిలో ఒకరు.

6. మండలంలో విద్య వైద్య అభివృద్ధి కోసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా దీక్ష చేపట్టి గురుకుల కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ముప్పై పడకల ఆస్పత్రి మంజూరు చేయించారు.

7.1991లో నార్నూర్ లోబాలాజీ మందిరం నిర్మాణానికి ప్రారంభించారు.

మరణం మార్చు

బానోత్ జాలంసింగ్ కరోనా తో 2020 డిసెంబర్ 16,న నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన జయంతి, వర్థంతిని పురస్కరించుకొని నార్నూర్ లోని అయన విగ్రాహన్న అన్ని వర్గాల ప్రజలు శ్రధ్ధాంజలి ఘటించడానికి వస్తారు[6].

మూలాలు మార్చు

  1. "గాంధేయవాది బానోత్ జాలంసింగ్ జయింతి సందర్భముగా : : -రాథోడ్ శ్రావణ్, పూర్వ అధ్యక్షులు ఉట్నూర్ సాహితీ వేదిక ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా.9491467715". 2021-10-01. Retrieved 2024-03-10.
  2. Correspondent, Special (2018-04-05). "Lambadas' concern over their safety". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-10.
  3. "PEN POWER" (in ఇంగ్లీష్). Retrieved 2024-03-14.
  4. "Khanapur Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com. Retrieved 2024-03-10.
  5. Sravan, Rathod (2021-01-01). Banjara jathi Ratnam B.Jalam Singh by Rathod Sravan (in Telugu). Rathod Sravan.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  6. "ఆదిలాబాద్‌లో జాలం సింగ్ విగ్రహావిష్కరణ". Samayam Telugu. Retrieved 2024-03-14.