బారిష్టరు పార్వతీశం (సినిమా)
1940 సినిమా
- ఇతర సంబంధిత వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ బారిష్టరు పార్వతీశం చూడండి
1940లో విడుదలయ్యిన బారిస్టర్ పార్వతీశం సినిమా తెలుగులో మొట్టమొదటి హస్యకథా చిత్రం. మొక్కపాటి నరిశింహ శాస్త్రి రచించిన బారిస్టర్ పార్వతీశం నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఎచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహించాడు. లంక సత్యం ప్రధాన పాత్రలో నటించగా జి.వరలక్ష్మి పార్వతీశం భార్యగా నటించింది. ఈ సినిమా అనుకున్నంత ఆర్థిక విజయం సాధించలేకపోయినా మొదటి తెలుగు హస్యకథ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
బారిష్టరు పార్వతీశం (1940 తెలుగు సినిమా) | |
బారిస్టర్ పార్వతీశం సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | హెచ్.ఎం.రెడ్డి |
తారాగణం | లంక సత్యం, ఎల్వీ ప్రసాద్, గరికపాటి వరలక్ష్మి |
సంగీతం | కొప్పరపు సుబ్బారావు |
నిర్మాణ సంస్థ | మద్రాస్ యునైటెడ్ ఆర్టిస్ట్స్ కార్పోరేషన్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చులంక సత్యం
గరికపాటి వరలక్ష్మి
ఎల్.వి.ప్రసాద్
కె .శివరావు
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: హెచ్.ఎం.రెడ్డి
కథారచన: మొక్కపాటి నరసింహశాస్త్రి
సంగీతం: కొప్పవరపు సుబ్బారావు
నిర్మాణ సంస్థ: మోషన్ పిక్చర్స్
విడుదల:07:08:1940.
పాటలు
మార్చు- ప్రేమయే జగతి దేముడు లేని జగతి - జి. వరలక్ష్మి
- పోయిరా ప్రియుడా లండన్ పోయిరా - జి. వరలక్ష్మి