జి.వరలక్ష్మి

సినీ నటి
(గరికపాటి వరలక్ష్మి నుండి దారిమార్పు చెందింది)

గరికపాటి వరలక్ష్మి (సెప్టెంబర్ 13, 1926 - నవంబర్ 26, 2006) అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటి రంగస్థల, సినిమా నటీమణి, గాయని, నిర్మాత, దర్శకురాలు. 1940 నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.

జి. వరలక్ష్మి
1951లో జి. వరలక్ష్మి
జననం
గరికపాటి వరలక్ష్మి

1926 సెప్టెంబరు 27
ఒంగోలు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
మరణం2006 నవంబరు 26(2006-11-26) (వయసు 80)
చెన్నై, భారతదేశం
వృత్తినటి
జీవిత భాగస్వామి
పిల్లలుకె. రాఘవేంద్రరావు (సవతి కొడుకు)
బంధువులుకె.బాపయ్య (బావగారి కొడుకు) ప్రకాష్ కోవెలమూడి ​​(సవతి-మనవడు)

జననం, బాల్యం

మార్చు
బారిష్టర్ పార్వతీశం సినిమాలో జి.వరలక్ష్మి పాడిన పోయిరా ప్రియుడా పాట

వరలక్ష్మి సెప్టెంబర్ 13, 1926లో ఒంగోలులో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి విజయవాడ చేరుకొని తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలైన రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. వరలక్ష్మి సక్కుబాయి, రంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది.

సినిమా రంగ ప్రవేశం

మార్చు

రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు, హెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. హెచ్.ఎం.రెడ్డి 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం బారిష్టరు పార్వతీశం సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.[1] బాలనటిగా బారిస్టర్ పార్వతీశం (1940) లో సినీ రంగ ప్రవేశం చేసి దాదాపు 4 దశాబ్దాలు చిత్ర సీమలో రాణించిన గొప్ప నటీమణి.

ఈమె 1968 లో మూగజీవులు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

కుటుంబం

మార్చు

వరలక్ష్మి తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయనకు రెండవ భార్య. వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు. కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది.

 
జి.వరలక్ష్మి

వరలక్ష్మి 2006, నవంబర్ 26మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.

చిత్ర సమాహారం

మార్చు

నటిగా

మార్చు

దర్శకురాలిగా

మార్చు

మూలాలు

మార్చు
  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 109.

బయటి లింకులు

మార్చు