బాలభారతం(పత్రిక)

బాల భారతం పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని, విలువలను అందించాలనే లక్ష్యంతో రామోజీ ఫౌండేషన్‌ వెలువడిన మాస పత్రిక.[2]

బాలభారతం
జూన్ 2013 పత్రిక ముఖచిత్రం
జూన్ 2013 పత్రిక ముఖచిత్రం
ముద్రణకర్తరామోజీ ఫౌండేషన్
మొదటి సంచిక2013 జూన్ 1 (2013-06-01)
ఆఖరి సంచికమార్చి 1, 2021; 3 సంవత్సరాల క్రితం (2021-03-01)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రారంభం-ప్రస్థానం మార్చు

2013 మే 27న పత్రికావిష్కరణ కార్యక్రమం ఫిల్మ్‌సిటీలో జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పత్రికను ఈనాడు మేనేజింగ్ డైరక్టర్ అయిన సుమన్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత శైలజా కిరణ్ ల చిన్న కుమార్తె దివిజ ఆవిష్కరించింది. ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్‌ హోటళ్ల ఎండీ విజయేశ్వరి, సుమన్‌ల కుమారుడు సుజయ్‌ లాంఛనంగా ఆవిష్కరించాడు. 2013 జూన్ 1 వ తేదీన తొలి సంచిక విడుదలైంది. నాణ్యమైన కాగితంపై 84 పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది. డిసెంబరు 2019 లో పత్రిక ధర 20 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం సంచికలు ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో వున్నాయి. మార్చి2021 సంచికతో పత్రిక మూతపడింది. [1]

శీర్షికలు-అంశాలు మార్చు

ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి.[3] పిల్లల నిత్య జీవితానికి ఉపకరించే అనేకానేక విశేషాలతోపాటు, నీతి కథలు, రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునేలా పత్రికను తీర్చిదిద్దారు. ఆరోగ్యం, వర్తమాన వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రాలు, జీవజాలానికి సంబంధించిన వివిధ ఆసక్తికర విషయాలతో పిల్లలకు అర్థమయ్యే తేలికైన భాషలో ఈ పత్రిక వెలువడుతోంది. పనికిరాని వస్తువుల నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం, సులువుగా బొమ్మలు గీయడం ఎలాగో నేర్పే ఈనాడు కార్టూన్‌ ఎడిటర్‌ శ్రీధర్‌ పాఠాలు, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటివెన్నో అందిస్తుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]
  2. "బాలభారతం జాలస్థలి". Archived from the original on 2014-02-09. Retrieved 2014-01-01.
  3. "Eenadu to launch Bala Bharatam". 2013-06-03.

బాహ్య లంకెలు మార్చు