బాలమేధావి

(బాల మేధావి నుండి దారిమార్పు చెందింది)

బాలమేధావి (ఆంగ్లం : child prodigy) అంటే చిన్న వయసులో (సాధారణంగా పదమూడేళ్ళ లోపు బాలలు) ఏదైనా రంగంలో వయసుకు మించిన పరిణతి కనబరిచే వాళ్ళు. సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, విద్య మొదలైన రంగాల్లో బాల మేధావులైన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. హిందూ మతంలో వీళ్ళు పునర్జన్మలో చేసుకున్న సత్కర్మల వల్ల అలాంటి జ్ఞానం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఫాబ్లో పికాసో, గణితంలో కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, శ్రీనివాస రామానుజన్, సంగీతంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైనవారిని బాలమేధావులుగా పేర్కొనవచ్చు.

ఐదేళ్ళ లోనే కంపోజింగ్ చేసి గుర్తింపు పొందిన బాల మేధావి మొజర్ట్ ,

మూలాలు

మార్చు