బావా మరుదుల సవాల్

(బావా మరదళ్ల సవాల్ నుండి దారిమార్పు చెందింది)

బావా మరుదుల సవాల్ 1988 లో వచ్చిన సినిమా. క్వాలిటీ పిక్చర్స్ పతాకంపై [1] పి.అప్పా రావు నిర్మించాడు.[1] సివి గణేష్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. శివాజీ రాజా సంగీతం అందించాడు.[3][4]

‌బావా మరుదుల సవాల్
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.వి.గణేష్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
డా. రాజశేఖర్,
రమ్యకృష్ణ,
జీవిత
సంగీతం శివాజీరాజా
నిర్మాణ సంస్థ క్వాలిటీ పిక్చర్స్
భాష తెలుగు

కథ సవరించు

జై కుమార్ (రాజేంద్ర ప్రసాద్), విజయకాంత్ (డాక్టర్ రాజశేఖర్) లు ప్రాణస్నేహితులు. జై పోలీస్ ఆఫీసరు, విజయ్ అడ్వకేటూ అవుతారు. వారు కుండమార్పిడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు - అంటేఒకరి చెల్లెలిని మరొకరు పెళ్ళి చేసుకుంటారు. రమ్య (రమ్య కృష్ణ), కల్పన (కల్పన)లతో కలిసి వారి స్నేహాన్ని సంబంధంగా మార్చుకుంటారు. ఇక్కడ, విజయ్‌కు కోటీశ్వరుడైన రంజీత్ కుమార్ (శరత్ బాబు) అనే మరో స్నేహితుడు ఉన్నాడు. ఇతడొక నేరస్థుడని జై అనుమానం. ఇంతలో, అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన అతడి కార్యదర్శి రూప (జీవిత రాజశేఖర్) ను చంపాడనే నేరంపై రంజీత్‌పై అభియోగాలు మోపారు. ప్రస్తుతం, జై రంజీత్‌ను అదుపులోకి తీసుకుంటాడు. విజయ్ ఆ కేసును డిఫెన్స్ న్యాయవాదిగా తీసుకుంటాడు. దాంతో వారి మధ్య విభేదాలు తలెత్తుతాయి.నిజమైన అపరాధి పరశురాం (శరత్ బాబే) అని, అతడు అచ్చు రంజీత్ ను పోలి ఉన్నట్లూ జై, విజయ్ లు తెలుసుకుంటాడు. చివరికి, బావ, మరుదులు ఐక్యమై, దుష్టులను పట్టి, రంజీత్‌ను నిర్దోషిగా విడుదల చేయిస్తారు. చివరగా, ముగ్గురు స్నేహితులూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూండగా ఈ చిత్రం ముగుస్తుంది.

నటవర్గం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

పాటలు సవరించు

ఎస్. పాట గాయకులు పొడవు
1 "నా విల్లు హరివిల్లు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 3:37
2 "మాలి మాలి సంధ్యలలో" ఎస్పీ బాల, వాణీ జయరాం 4:30
3 "వసంతల వాకిలిలో" కె.జె. యేసుదాస్, వి.రామకృష్ణ, మాధవపెద్ది రమేష్, వాణ జయరామ్, ఎస్పీ శైలజ 5:33
4 "అమ్మ డోంగా" మాధవ్‌పెద్ది రమేష్, పి.సుశీల, వాణీ జయరామ్ 4:04
5 . చిత్ర 3:07

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Bava Marudula Saval (Banner)". Know Your Films.
  2. "Bava Marudula Saval (Direction)". Spicy Onion.
  3. "Bava Marudula Saval (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2021-01-19. Retrieved 2020-08-24.
  4. "Bava Marudula Saval (Review)". Filmiclub.