వాణీ జయరామ్
వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.
వాణీ జయరామ్ | |
---|---|
జననం | వెల్లూర్, తమిళనాడు, India | 30 నవంబరు 1945
సంగీత శైలి | నేపథ్యగానం |
వృత్తి | గాయని |
వాయిద్యాలు | గానం |
క్రియాశీల కాలం | 1971-ప్రస్తుతం |
వెబ్‌సైటు | Official website |
వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ ఆల్ ఇండియా రేడియో పాల్గొన్నారు.
వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.
వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు,
తెలుగు సినిమాలుసవరించు
- స్వాతికిరణం (1992)
- పెళ్ళి పుస్తకం (1991)
- బావా మరదల సవాళ్ (1988)
- అగ్ని నక్షత్రం (1988)
- ఇల్లు ఇల్లాలు పిల్లలు (1988)
- స్వర్ణకమలం (1988)
- ఆరాధన (1987)
- శృతిలయలు (1987)
- శ్రీ శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్యం (1986)
- వసంతసేన (1985)
- ప్రతిజ్ఞ (1983)
- ఆక్రోశం (1982)
- పార్వతి (1981)
- సీతాకోకచిలుక (1981)
- సర్కస్ రాముడు (1980)
- శుభోదయం (1980)
- లక్ష్మీ పూజ (1979)
- ఇది కథకాదు (1979)
- మీరా (1979)
- ఆవేశం (1979)
- గుప్పెడు మనసు (1979)
- శంకరాభరణం (1979)
- కరుణామయుడు (1978)
- చిరంజీవి రాంబాబు (1978)
- మరోచరిత్ర (1978)
- ఐనా (1977)
- అంతులేని కథ (1976)
- సీతా కళ్యాణం (1976)
- రాగం (1975)
- చెలియా (1973)
- స్వప్నం (1973)
బయటి లింకులుసవరించు
Wikimedia Commons has media related to Vani Jairam. |