వంకాయల సత్యనారాయణమూర్తి

సినీ నటుడు
(వంకాయల సత్యనారాయణ నుండి దారిమార్పు చెందింది)

వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]

వంకాయల సత్యనారాయణ
జననం
వంకాయల సత్యనారాయణమూర్తి

(1940-12-28)1940 డిసెంబరు 28
విశాఖపట్నం, చవల వారి వీధి
మరణం2018 మార్చి 12(2018-03-12) (వయసు 77)
ఇతర పేర్లువంకాయల
ఎత్తు5"7
పిల్లలుఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులు
  • వెంకటరామగుప్త (తండ్రి)
  • సుభద్రమ్మ (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.

ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.

సినిమాల జాబితా

మార్చు

ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

ఇతర విశేషాలు

మార్చు

కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[5][6]

వనరులు

మార్చు
  1. "వంకాయల సత్యనారాయణమూర్తి కన్నుమూత". eenadu.net. 13 March 2018. Archived from the original on 13 March 2018.
  2. ప్రజాశక్తి, ఫీచర్స్ (14 March 2018). "వంక‌పెట్ట‌లేని క్యా‌రెక్ట‌ర్ న‌టుడు". గంగాధర్‌ వీర్ల. Retrieved 17 March 2018.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (31 December 2016). "కారందోశ". Archived from the original on 8 February 2020. Retrieved 8 February 2020.
  4. "నాటకరంగ దినోత్సవంగా కందుకూరి జయంతి". www.andhrabhoomi.net. 2017-04-17. Archived from the original on 2017-04-21. Retrieved 2021-12-14.
  5. "నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి మృతి". సాక్షి (దినపత్రిక). 2018-03-12. Retrieved 2018-03-12.
  6. నమస్తే తెలంగాణ (12 March 2018). "సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత". Retrieved 12 March 2018.[permanent dead link]

బయటి లంకెలు

మార్చు