బిల్ ప్లేల్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

విలియం రోడ్జర్ ప్లేల్ (1938, డిసెంబరు 1 - 2019, ఫిబ్రవరి 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. 1958 - 1963 మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున ఎనిమిది టెస్టులు ఆడాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా 151 పరుగులు చేశాడు.[2]

బిల్ ప్లేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
విలియం రోడ్జర్ ప్లేల్
పుట్టిన తేదీ(1938-12-01)1938 డిసెంబరు 1
పామర్‌స్టన్ నార్త్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2019 ఫిబ్రవరి 27(2019-02-27) (వయసు 80)
కాఫ్స్ హార్బర్, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుబకెట్స్[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
బంధువులుసిరిల్ క్రాఫోర్డ్ (మామ)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1958 5 June - England తో
చివరి టెస్టు1963 15 March - England తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 8 85
చేసిన పరుగులు 151 2888
బ్యాటింగు సగటు 10.06 21.87
100లు/50లు 0/1 4/9
అత్యధిక స్కోరు 65 122
వేసిన బంతులు 118
వికెట్లు 1
బౌలింగు సగటు 94.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/11
క్యాచ్‌లు/స్టంపింగులు 4/- 81/-
మూలం: Cricinfo, 2019 4 March

క్రికెట్ కెరీర్ మార్చు

న్యూజీలాండ్‌లో మార్చు

బిల్ ప్లేల్ 18 సంవత్సరాల వయస్సులో 1956-57లో ఫస్ట్-క్లాస్ కెరీర్ ఆక్లాండ్‌తో ప్రారంభమైంది. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లలో 355 పరుగులు మాత్రమే చేశాడు.[3] 1958లో 19 ఏళ్ళవయస్సులో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ ఐదు టెస్టుల్లో 56 పరుగులు మాత్రమే చేశాడు. లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో, ఓటమిని తప్పించే నివారించే ప్రయత్నంలో, మూడున్నర గంటలపాటు క్రీజులో ఉండి 18 పరుగులు చేశాడు, ఆ సమయంలో ఏడు స్కోరింగ్ స్ట్రోక్‌లకు పరిమితమయ్యాడు".[4]

1961-62 సీజన్‌లో 72.85 సగటుతో 510 పరుగులతో (ఒటాగోపై 116 నాటౌట్‌తో సహా) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.[5] 1962-63లో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మూడు టెస్టులలో ఓపెనర్‌గా ఆడాడు. వెల్లింగ్‌టన్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో కోల్పోయిన కారణంగా 202 నిమిషాల్లో 65 పరుగులు చేశాడు.[6]

ఆస్ట్రేలియాలో మార్చు

న్యూజీలాండ్‌లో 1963-64 సీజన్ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళాడు, అక్కడ 1965-66 నుండి 1967-68 వరకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు. 1965-66లో క్వీన్స్‌లాండ్‌పై 122 పరుగులు,[7] విక్టోరియాకి వ్యతిరేకంగా 116 పరుగులు అనేవి ఇతని అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరు. షెఫీల్డ్ షీల్డ్‌లో 41.64 సగటుతో 583 పరుగులు చేశాడు.[8]

మరణం మార్చు

ప్లేల్ 2019, ఫిబ్రవరి 27న న్యూ సౌత్ వేల్స్‌లోని కాఫ్స్ హార్బర్‌లో మరణించాడు.[2][9]

మూలాలు మార్చు

  1. The Oxford Companion to Australian Cricket, Oxford, Melbourne, 1996, p. 422.
  2. 2.0 2.1 "Bill Playle, former New Zealand batsman, passes away". International Cricket Council. 4 March 2019. Retrieved 5 March 2019.
  3. Bill Playle, batting by season
  4. Wisden 1959, p. 252.
  5. Batting averages 1961–62
  6. "2nd Test, England tour of New Zealand at Wellington, Mar 1-4 1963". ESPNcricinfo. Retrieved 26 October 2019.
  7. Western Australia v Queensland 1965–66
  8. Sheffield Shield batting averages 1965–66
  9. "William Playle death notice". The Sydney Morning Herald. 11 March 2019. Retrieved 12 March 2019.

బాహ్య లింకులు మార్చు