బి.నాగేంద్ర
బి. నాగేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు కుడ్లగి, బళ్లారి రూరల్ నియోజకవర్గాల నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
బి.నాగేంద్ర | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 | |||
ముందు | ఎన్.వై. గోపాలకృష్ణ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బళ్లారి రూరల్ | ||
పదవీ కాలం 2008 – 2018 | |||
ముందు | అనిల్ లాడ్ | ||
తరువాత | ఎన్.వై. గోపాలకృష్ణ | ||
నియోజకవర్గం | కుడ్లగి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బళ్ళారి | 1971 సెప్టెంబరు 15||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ (2008-2018) | ||
జీవిత భాగస్వామి | మంజుశ్రీ | ||
సంతానం | విష్ణు తారక్ , రాణాక్ రత్న | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుబి. నాగేంద్ర బీజేపీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, 2008లో కూడిగి నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.వెంకటేష్ పై 8757 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆయన 2013లో బీజేపీకి దూరమై కూడిగి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 24803 ఓట్ల భారీ మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.
బి.నాగేందర్ 2018 శాసన సభ ఎన్నికలకు ముందు హొసపేటెలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో బళ్లారి రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి సణ్ణ పక్కీరప్పపై 2679 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆయన 2023 ఎన్నికల్లో బళ్లారి రూరల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బి. శ్రీరాములు పై నాగేంద్ర 29,300 ఓట్ల మెజారిటీతో వరుసగా నాలుగోవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికై[1][2][3], సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో 2023 మే 27న రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసులు & కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4][5]
మూలాలు
మార్చు- ↑ Election Commission of India (15 May 2023). "2023 Karnataka Election Results". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
- ↑ Eenadu (15 May 2023). "ఆ ముగ్గురు ఇంటికి.. ఆయన అసెంబ్లీకి". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
- ↑ Eenadu (15 May 2023). "గనినాడుకు మంత్రి పదవి దక్కేనా?". Archived from the original on 15 May 2023. Retrieved 15 May 2023.
- ↑ Eenadu (28 May 2023). "ఆలస్యమైనా.. అమృత ఫలమే". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.
- ↑ Eenadu (28 May 2023). "గనినాడుకు అమాత్య యోగం". Archived from the original on 28 May 2023. Retrieved 28 May 2023.