బి.వి.రాఘవులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మార్చి 2014 వరకు పనిచేశాడు. ఇతడు ఆ పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడు కూడా.[1]

బి.వి.రాఘవులు

పారంభ జీవితం

మార్చు

బి.వి.రాఘవులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని పెదమోపాడు గ్రామంలో వెంకట సుబ్బయ్య, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యను స్వగ్రామంలో పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్ విద్య కోసం గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చేరాడు. తరువాత, బాపట్ల వెళ్లి బాపట్ల వ్యవసాయ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో చేరాడు. కొన్ని కారణాల వల్ల అక్కడ మానివేసి కావలిలో బి.ఎ., కోర్సులో చేరాడు. తన చివరి సంవత్సరం గ్రాడ్యుయేషన్ కోర్సును అభ్యసిస్తున్నప్పుడు, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తుది పరీక్షలకు హాజరైన తరువాత పార్టీ పూర్తి స్థాయి కార్యకర్తగా నెల్లూరులో పనిచేయసాగాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఎమర్జెన్సీ కాలంలో, కమ్యూనిస్టు పార్టీలోని చాలా మంది అగ్ర నాయకులను అరెస్టు చేశారు. కొందరు నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళారు. దానితో పార్టీ కార్యాలయం నిర్వహించే బాధ్యత ఇతనిపై పడింది.

ఎమర్జెన్సీ కాలంలోనే పార్టీ ఇతడిని విశాఖపట్నంలో పనిచేయడానికి పంపింది. అక్కడ ఇతడు విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇతడు విశాఖపట్నంలో ఉన్నప్పుడు, ఇంగ్లీషులో డిప్లొమా పూర్తి చేసి చరిత్రలో ఎం.ఎ., చదివాడు. డిసెంబర్ 1981 వరకు, ఇతడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఆఫీసు బేరర్ గా పనిచేశాడు.

ఎం.ఎ. డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్‌గా చేరాడు. ఇంతలో, విశాఖపట్నం యూనిట్ పార్టీ కార్యదర్శి పదవి ఖాళీ కావడంతో తన పరిశోధనకు స్వస్తి చెప్పి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. 1994 లో సెంటర్ ఆర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సి.ఐ.టి.యు) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

1997 డిసెంబరులో నల్గొండలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో, రాఘవులు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఈ పదవిలో 2014 మార్చి వరకు పనిచేశాడు.

కుటుంబ జీవితం

మార్చు

ఇతడు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నప్పుడు తన సహకార్యకర్తలలో ఒకరైన ఎస్.పుణ్యవతిని వివాహం చేసుకున్నాడు. పుణ్యవతి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నది. వీరికి సృజన అనే కుమార్తె జన్మించింది. ఆమె ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో (జెఎన్‌యు) సహ విద్యార్థి మహ్మద్ జహీర్‌ను వివాహం చేసుకుంది.

మూలాలు

మార్చు
  1. Sakshi (18 June 2022). "అగ్నిపథ్‌ స్కీమ్‌ను రద్దు చేయాలి: రాఘవులు". Retrieved 19 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.