బత్తుల సుమిత్రాదేవి
(బి.సుమిత్రాదేవి నుండి దారిమార్పు చెందింది)
బి.సుమిత్రాదేవి (1918, అక్టోబరు 8 - 1980) హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు, రాజకీయ నాయకురాలు, సంఘసేవకురాలు.[1]
జననంసవరించు
ఈమె అక్టోబరు 8, 1918న హైదరాబాదులో జన్మించారు[2] 1947-48లో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలవాలని రజాకార్లపై పోరాడి జైలుకువెళ్ళారు. 1948 సెప్టెంబరులో నిజాం సంస్థానం భారతదేశంలో విమోచనం వరకు ఆమె కంటికి నిద్రలేకుండా కృషిచేశారు. ఆ తర్వాత హైదరాబాదు నగరపాలక సంస్థ ఉపాధ్యక్షులైనారు. 1957 నుంచి ఈమె ఐదు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనది. ఈమె తొలిసారి 1957లో అప్పుడే కొత్తగా ఏర్పడిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎన్నికైంది. 1962లో హైదరాబాదు తూర్పు నియోజకవర్గం నుండి, 1967, 1972 లో మేడ్చల్ నియోజకవర్గం నుండి, 1978లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యింది.
మరణంసవరించు
1980 లో ఈమె మరణించింది.
మూలాలుసవరించు
- ↑ Devulapalli, Rahul (February 18, 2014). "One from that rare breed of politicians". The Hindu. Retrieved 3 November 2014.
- ↑ స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు మహిళలు, రచన: వాసా ప్రభావతి, పేజీ 144