బి. విజయలక్ష్మి
బి. విజయలక్ష్మి (మరణం : 12-5 -1985) భారతీయ శాస్త్రవేత్త.[1] ఈమె అతిచిన్న వయసులోనే 11 అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనలను ప్రచురించారు.
బి. విజయలక్ష్మి | |
---|---|
జాతీయత | భారతీయులు |
రంగములు | భౌతిక శాస్త్రము |
విద్యాభ్యాసం
మార్చుఈవిడ తిరుచిరాపల్లి లోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి 1974 లో మద్రాసు విశ్వవిద్యాలయం లోని థియోరిటికల్ భౌతికశాస్త్ర శాఖలో పి.హెచ్.డి. కోసం చేరారు. ఈవిడ పరిశోధనాంశం "Relativistic wave equations and their proportions".
అదేకాలంలో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వచ్చింది. వారి పరిశోధనకోసం రావాల్సిన గ్రాంట్లు వచ్చేవికావు. దాంతో పరిశోధనలు కొససాగించడం సమస్యగా మారింది. విజయలక్ష్మి తన పరిశోధన మాత్రమేకాక, తోటి విద్యార్థులకు "రిసెర్చి స్కాలర్ల సంఘం" ద్వారా సహాయం చేస్తూ వుండేది. దాని మూలంగా విశ్వవిద్యాలయ అధికారులకు ఆమె అంతగా నచ్చేది కాదు.
కెరీర్ , పరిశోధనలు
మార్చువిజయలక్ష్మిగారు1978 లో తన పరిశోధనలను ప్రారంభించారు on characterizing a spinning particle in non-relativistic quantum mechanics. This was a novel idea of the interplay of geometry and topology. This also produced an interesting dual relation between massless particles and the monopoles of electromagnetic theory. 1979 లో "Consistency of spin-1 theories in external electromagnetic fields" అనే పరిశోధనా వ్యాసాన్ని ఎం. సీతారామన్, పి. ఎం. మాత్యూస్ అనుసంధానంతో ప్రచురించారు.[2]
1980 ఆమె కొచ్చి విశ్వవిద్యాలయం లోని అటామిక్ ఎనర్జీశాఖ ఆధ్వర్యంలో జరిగిన ద్వివార్షిక హై ఎనర్జీ భౌతికశాస్త్రం సమావేశంలో తన పరిశోధనలను శాస్త్రవేత్తలందరికీ తెలియజేసారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నా, పరిశోధనలను కొనసాగిస్తూ, ఐదు పరిశోధనాంశాలను అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురించి, తన పి.హెచ్.డి.ని కూడా పూర్తిచేశారు.
అదే కాలంలో సూపర్ సిమ్మెట్రీ అనే అంశం ప్రాధాన్యత వహిస్తున్నది. దానిగురించి కూడా పరిశోధన చేసిన విజయలక్ష్మి ఐ.ఐ.టి., కాన్పూర్ సందర్శించి కొన్ని నెలలు అక్కడ కూడా పరిశోధన చేశారు. అక్కడ ఆమె కెప్టెన్ లక్ష్మీ సెహ్గల్ ను కలిసారు. ఆవిడ ప్రోత్సాహంతో బెంగుళూరు, Indian Instititute of Science లోని సెంటర్ ఫర్ థియేరిటికల్ ఫిజిక్స్ లో మరికొంతకాలం సూపర్ సిమ్మెట్రీ మీద పరిశోధనలను కొనసాగించి, మరో రెండు పరిశోధనాంశాలను ప్రచురించారు.
మరో రెండు సంవత్సరాలు పరిశోధనల కోసం జయరామన్ తో కలిసి ఆమె ట్రీస్టెలోని ICTP వెల్దామనుకుంటున్న తరుణంలో ఆమె ఆరోగ్యం క్షీణించి 1985 మే 12 తేదీన శాశ్వతంగా నిద్రించింది.
వ్యక్తిగత జీవితం
మార్చుఈమె జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి టి. జయరామన్ తర్వాత 1978లో ఇద్దరూ వివాహం చేసుకొని భార్యాభర్తలుగా మారారు. అతనితో విజయలక్ష్మి రాజకీయాల గురించి చర్చించి నెమ్మదిగా కమ్యూనిష్టు భావజాలానికి మారారు. జయరామన్ ఆమెకు చాలా మానసికంగా కావలసిన ధైర్యాన్ని ఇచ్చేవారు. అతని ద్వారా స్నేహితులు, అత్తమామలు ఆమె ఆరోగ్యం క్షీణించినప్పుడు చాలా సహకారం అందించారు. జీర్ణాశయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె, ఆ వ్యాధి ఎముకలకు వ్యాపించడంవలన,, రేడియేషన్, కీమోథిరపీ వైద్యాల మూలంగా కొంతకాలం పూర్తిగా నడవలేక చక్రాలకుర్చీతోనే కదలగలిగారు.
అకాల మరణం
మార్చుఈమె జరిపిన జీవనపోరాటం, పరిశోధనలు, చిన్ననాటి విషయాల గురించి ఒక గంట డాక్యుమెంటరీ “Vijayalakshmi: The Story of a Young Woman with Cancer”గా చిత్రీకరించారు. ఇది 1980లలో దూరదర్శన్లో ప్రసారం చేయబడింది.
అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిపిన ఈ మహిళా శాస్త్రవేత్త 32 సంవత్సరాల ప్రాయంలోనే క్యాన్సర్ వ్యాధితో మరణించింది.
మూలాలు
మార్చు[1][permanent dead link] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు.