బీద మస్తాన్ రావు

(బీద మస్తాన్‌రావు నుండి దారిమార్పు చెందింది)

బీద మస్తాన్‌రావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేత.

బీద మస్తాన్ రావు
బీద మస్తాన్ రావు


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 జూన్ 22 - 2024 ఆగష్టు 29

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం కావలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958 జులై 2
ఇస్కపల్లి గ్రామం, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (2024 అక్టోబరు 9 - ప్రస్తుతం)
(2009-2019)
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2019-2024)

జననం, విద్యాభాస్యం

మార్చు

ఇతడు జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన బీకాం, సీఏ(ఇంటర్‌) వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట బోగోలు మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా, ఆ తరువాత 2009 ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2014 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.

బీద మస్తాన్ రావు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటినుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చాడు. 2020లో తాను రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు, శాసనసభకు కానీ, లోక్ సభకు కానీ పోటీ చేయనని తెలిపాడు.[1] 2022లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యాడు.[2][3]

వైఎస్సార్సీపీ 2024 శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీద మస్తాన్ రావు వైసీపీ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి ఆగష్టు 29న రాజీనామా చేశాడు.[4][5] ఆయన అక్టోబరు 9న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[6][7][8]

విద్యాభ్యాసం

మార్చు

ఇతడు బీకాం, సీఏ(ఇంటర్‌) చదివాడు

మూలాలు

మార్చు
  1. India, The Hans (2020-09-16). "Kavali ex-MLA Beeda Mastan announces retirement from politics". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-17.
  2. "Andhra News: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు". EENADU. Retrieved 2022-05-17.
  3. Sakshi (17 May 2022). "బీద మస్తాన్‌రావు: వ్యాపార, రాజకీయాలతోనే కాదు." Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  4. The Hindu (29 August 2024). "Two YSRCP MPs of Rajya Sabha resign, party set to lose ground in Upper House" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  5. 10TV Telugu (29 August 2024). "వైసీపీకి షాక్.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Andhrajyothy (10 October 2024). "టీడీపీలో చేరిన మోపిదేవి, బీదా". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  7. The Hindu (9 October 2024). "YSRCP former MPs Mopidevi, Beeda Masthan Rao join TDP" (in Indian English). Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
  8. Eenadu (10 October 2024). "తెదేపాలో చేరిన మోపిదేవి, బీద మస్తాన్‌రావు". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.