బీద మస్తాన్ రావు

బీద మస్తాన్‌రావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ నేత.

బీద మస్తాన్ రావు
బీద మస్తాన్ రావు


రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 జూన్ 22 - 2028

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం కావలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958 జులై 2
ఇస్కపల్లి గ్రామం, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

జననం, విద్యాభాస్యం

మార్చు

ఇతడు జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన బీకాం, సీఏ(ఇంటర్‌) వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మొదట బోగోలు మండలం జెడ్‌పీటీసీ సభ్యుడిగా, ఆ తరువాత 2009 ఎన్నికల్లో కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2014 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.

బీద మస్తాన్ రావు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటినుంచి ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ అధికార పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చాడు. 2020 లో తాను రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు, శాసనసభకు కానీ, లోక్ సభకు కానీ పోటీ చేయనని తెలిపాడు.[1] 2022 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యాడు.[2][3]

విద్యాభ్యాసం

మార్చు

ఇతడు బీకాం, సీఏ(ఇంటర్‌) చదివాడు

మూలాలు

మార్చు
  1. India, The Hans (2020-09-16). "Kavali ex-MLA Beeda Mastan announces retirement from politics". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-05-17.
  2. "Andhra News: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు". EENADU. Retrieved 2022-05-17.
  3. Sakshi (17 May 2022). "బీద మస్తాన్‌రావు: వ్యాపార, రాజకీయాలతోనే కాదు." Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.