బుగ్గ రాజరాజేశ్వర ఆలయం బెల్లంపల్లి

బుగ్గ రాజరాజేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది.స్వామి మూడు శిఖరాల మధ్య కొలువై ఉన్నాడు. స్వామిని నిత్యం గంగ స్వయంగా అభిషేకిస్తూ ఉంటుంది[1][2][3].

బుగ్గ రాజరాజేశ్వర ఆలయం -బెల్లంపల్లి
పెద్ద బుగ్గ శివాలయం కన్నల బెల్లంపల్లి మంచిర్యాల్
పెద్ద బుగ్గ శివాలయం కన్నల బెల్లంపల్లి మంచిర్యాల్
పేరు
ఇతర పేర్లు:పెద్ద బుగ్గ శివాలయం
ప్రధాన పేరు :పెద్దబుగ్గ శ్రీ రాజరాజేశ్వరాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల
ప్రదేశం:బెల్లంపల్లి కన్నాల గ్రామ పంచాయితి పరిధిలోని అటవీ క్షేత్రంలో
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:రాజరాజేశ్వరుడు
ఉత్సవ దేవత:పరమశివుడు
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ దేవాలయం
దేవాలయాలు మొత్తం సంఖ్య:01
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1850

ఇచట ఏ కాలమైనా ను మోచేతి లోతు నీరుండు మూడు ఊటలున్నవి. ఈ బుగ్గనీరు ఎక్కడి నుండి వస్తుందో సామాన్య ప్రజానీకానికే కాదు ఇచట పరిశోధనలు జరిపిన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖ వారికి సైతం అంతు పట్టటం లేదు. ఈ మూడు బుగ్గలలోని నీరు త్రాగడానికి, స్నానం చేయడానికి,బట్టలు ఉతకడానికి ఉపయోగపడుచున్నవి.

చరిత్ర

మార్చు

పెద్ద బుగ్గ శివాలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వం ఇచట ఒక వాల్మీకం (పుట) ఉండెదట. ఆ వాల్మీకం నుండి పోడవైన బంగారు వర్ణముగల సర్పము బయటికి వచ్చి ఆ బుగ్గనీటిలో స్నానమొనర్చి పరమశివుని దర్శించి [4]పూజించు చుండెనని స్థానికులు అంటారు.బెల్లంపల్లి పట్టణానికి ఆరు కి.మీ దూరంలో బెల్లంపల్లి,తాండూర్, కాశిపేట్ మండలాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో మూడు గుట్టల మధ్య వెలసినది.దాని చేరువలో ఆంజనేయ స్వామి విగ్రహలు ఉన్నవి. చాలా కాలం వరకు ఈ శివాలయం మరుగున పడి ఉండెను. 1940లో సింగరేణి కాలరీస్ కార్మికుడు సత్యం అను పేరు గల భక్తుడు తనకు శివుడు స్వప్న మందు సాక్షాత్కరించి,తాను అడవీలో లింగరూపమున ఉన్నట్లు తనకొక ఆలయం నిర్మించాలని చెప్పినాడని అతను తోటి కార్మికులకు సమాచారం అందించడంతో కార్మికులందరు సత్యం మాటను నమ్మి అడవిని గాలించి శివలింగమును కనుగొనిరి తోటి కార్మికులందరూ సింగరేణి గనుల యాజమాన్యంతో సంప్రదించి వారి సహాయ సహకారముతో ఈ ఆలయ ప్రాంతము అభివృద్ధి చేయడం జరిగినది. 1972 లో సత్యం మరణించడంతో అతని కోరికమేరకు అతని సమాధి ఆలయం ముందు నిర్మించబడినది.

ఆలయ ప్రత్యేకత

మార్చు

ఈ బుగ్గ ఆలయంలో స్వామివారిని ప్రకృతి నిత్యం అభిషేకిస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా శివాలయాల్లోని గర్భగుడిలో స్వామి వారి పై అభిషేకం కోసం నీటి కుండను ఏర్పాటు చేస్తారు.కాని ఇచట గౌరీపతిని స్వయంగా గంగమ్మ తల్లి అభిషేకిస్తూ ఉండడం విశేషం.

మహాశివరాత్రి ఉత్సవాలు

మార్చు

బుగ్గ శివాలయంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచిర్యాల జిల్లా పరిసర మండలు ఐనా కాశిపేట్, బెల్లంపల్లి ,తాండూర్, మందమర్రి, మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోని పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. గుట్ట పై స్వయంభుగా వెలిసిన గంగా జలాన్ని తల పై చల్లుకుంటారు.ఈ శైవాలం భక్తులతో కిటకిటలాడుతుంది. పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు[5].

మంచిర్యాల జిల్లాలో ప్రసిద్ధి చెందిన బుగ శివాలయం జాతరకు భక్తులు హాజరై దైవ సన్నధిలో రాత్రాంత జాగారం చేస్తారు. ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మూడు రోజులు జాతర జరుగుతుంది[6].ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రద్దీన దృష్టిలో ఉంచుభకొని బారీకేడ్లు నిర్మిస్తారు.జాతరకు ప్రతి ఏటా లక్షల పై భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు[7][8].

మూలాలు

మార్చు
  1. Bharat, E. T. V. (2022-02-05). "Bugga Rajarajeswara Temple: ఆ ఆలయంలో "ముక్కంటిని స్వయంగా అభిషేకిస్తున్న గంగమ్మ"". ETV Bharat News. Retrieved 2024-07-26.
  2. admin (2022-10-21). "శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం - Sri Bugga Rajarajeswara Swamy Temple". బెల్లంపల్లి | సింగరేణి కళామతల్లి | Bellamaplly | City of Singareni (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-26.
  3. information, Temples in India (2021-12-20). "Bellampalli Bugga Rajarajeswara Temple Timings, History". Templesinindiainfo (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-26.
  4. Aamani (2021-12-14). "బెల్లంపల్లి: గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము". www.dishadaily.com. Retrieved 2024-07-26.
  5. Velugu, V6 (2024-03-08). "శివరాత్రి జాతరకు వేళాయే..వేలాల, బుగ్గ, కత్తెరశాల ఆలయాల్లో ఘనంగా వేడుకలు". V6 Velugu. Retrieved 2024-07-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  6. "బుగ్గ జాతరలో జనసంద్రోహం | bugga jatara was celebrated in bellampalli | Sakshi". www.sakshi.com. Retrieved 2024-07-26.
  7. Telugu, TV9 (2024-03-07). "Maha Shivaratri: శివలింగంపై నిత్యం జలధార.. మహా శివరాత్రి సందర్భంగా బుగ్గ జాతరకు సర్వం సిద్ధం". TV9 Telugu. Retrieved 2024-07-26.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "లక్షకు పైగా భక్తులు." Prabha News. 2021-03-14. Retrieved 2024-07-26.