బుద్దా మురళి, తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు.[1] తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా బాధ్యతలు నేరవేరుస్తున్నారు.

బుద్దా మురళి
జననం
బుద్దా మురళి

(1964-04-02) 1964 ఏప్రిల్ 2 (వయసు 60)
India తుర్కపల్లి, యాదాద్రి జిల్లా తెలంగాణ
వృత్తితెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ & జర్నలిస్టు

బాల్యం- విద్యాభ్యాసం మార్చు

బుద్దా మురళి 1964 ఏప్రిల్‌ 2వ తేదీన యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జన్మించారు. ఎం.ఏ. రాజనీతి శాస్త్రం అభ్యసించారు.

వృత్తి జీవితం మార్చు

ఆంధ్రభూమి దినపత్రికలో జర్నలిస్టుగా, చీఫ్ రిపోర్టర్ గా పనిచేశారు.

రచనాప్రస్థానం మార్చు

జనాంతికం, ఓటమే గురువు అనే పుస్తకాలను రచించారు. మాసపత్రికలో వర్తమానం శీర్షిక తో కాలం రాస్తున్నారు. అరడజను పైగా కథలు రాశారు.

సమాచార కమిషనర్‌గా మార్చు

2017 సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న రాజా సదారాం ఆగస్టు 2020లో పదవీ విరమణ చేయడంతో, ఆ అదనపు బాధ్యతలను కూడా బుద్ధ మురళి నిర్వర్తిస్తున్నారు.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. బుద్దా మురళి. "ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా రాజాసదారాం". నమస్తే తెలంగాణ. Archived from the original on 20 June 2018. Retrieved 16 September 2017.
  2. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.