తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్, (ఆంగ్లం: Telangana State Information Commission) అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాచారం హక్కును పటిష్ఠంగా అమలుచేయడంకోసం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన కమిషన్. దాఖలు చేసిన ఫిర్యాదులు, అప్పీళ్లతో పాక్షిక న్యాయవ్యవస్థగా ఈ కమిషన్ వ్యవహరిస్తుంది. ఈ కమిషన్‌లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, 5మంది రాష్ట్ర సమాచార కమిషనర్లు గవర్నర్‌చే నియమించబడతారు. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నేతగా సభ్యులుగా ఉన్న ఒక కమిటీ సిఫార్సుపై కమిషనర్ల ఎంపిక జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ | |
---|---|
తెలంగాణ ప్రభుత్వ లోగో | |
కమిషన్ అవలోకనం | |
స్థాపనం | 13 సెప్టెంబరు 2017 |
అధికార పరిధి | తెలంగాణ |
ప్రధాన కార్యాలయం | హైదరాబాద్ |
కమిషన్ కార్యనిర్వాహకుడు/లు | బుద్దా మురళి, (ప్రధాన కమిషనర్) కట్టా శేఖర్ రెడ్డి మైదా నారాయణరెడ్డి గుగులోత్ శంకర్‌నాయక్ సయ్యద్ ఖలీలుల్లా మహ్మద్ అమీర్ హుస్సేన్ |
వెబ్‌సైటు | |
అధికారిక వెబ్సైటు |
ఏర్పాటు
మార్చుసమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబరు 13న తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సభ్యుల ఎంపిక కోసం త్రిసభ్యకమిటీ ఏర్పాటు చేస్తూ 2017 సెప్టెంబరు 14న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చైర్‌పర్సన్‌గా ఏర్పాటైన ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డిలను సభ్యులుగా నియమించబడ్డారు.[1] 2017 సెప్టెంబరు 25న కమిషన్ తన కార్యకలాపాలు ప్రారంభించింది.
విధులు
మార్చు- సమాచార హక్కు చట్టం, 2005 కింద అందిన ఫిర్యాదులు, వాటి ప్రతిస్పందనల గురించి రాష్ట్రంలో పనిచేస్తున్న వివిధ శాఖల నుండి కమిషన్ వార్షిక నివేదికను పొందాలి.
- రాష్ట్ర సమాచార కమిషన్ సమాచార హక్కు చట్టం, 2005 అమలుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.[2]
అధికారాలు
మార్చు- రాష్ట్ర సమాచార కమిషన్ చట్టంలోని నిబంధనల అమలుపై నివేదికను సిద్ధం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి వార్షిక నివేదికను సమర్పించడం[3][4][5]
- చట్టానికి సంబంధించిన ఏదైనా అంశంపై సహేతుకమైన కారణాలపై కమిషన్ విచారణకు ఆదేశించడం.
- ఏ వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదునైనా స్వీకరించి విచారణ జరపడం
- ఏదైనా ఫిర్యాదుకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయడం
కమిషన్ సభ్యులు
మార్చుప్రగతిభవన్ వేదికగా సమావేశమైన త్రిసభ్యకమిటీ సభ్యుల ఎంపికపై సుదీర్ఘ చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా డాక్టర్ ఎస్. రాజా సదారాం, కమిషనర్‌గా బుద్దా మురళి లను ఎంపికచేయగా 2017 సెప్టెంబరు 15న రాష్ట్ర గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ఆమోదించి సభ్యులకు నియామక ఉత్తర్వులు జారీచేశాడు.[6] 2020 ఫిబ్రవరిలో సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి మూడేళ్లపాటు (వారికి 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) ఈ పదవిలో కొనసాగుతారు.[7] రాష్ట్ర సమాచార కమిషన్‌లోని ఏదైనా ఖాళీని ఖాళీ అయిన తేదీ నుండి ఆరు నెలలలోపు భర్తీ చేయాలి.[8] ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీతాలు, అలవెన్సులు, ఇతర సేవా నిబంధనలు, షరతులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సమానంగా ఉంటాయి.[9]
- ప్రధాన కమిషనర్: బుద్దా మురళి
- కమిషనర్లు: కట్టా శేఖర్ రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గుగులోత్ శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్
శాశ్వత భవనం
మార్చుసమాచార కమిషన్ కు శాశ్వత భవన నిర్మాణంకోసం గచ్చిబౌలీలోని సర్వే నెంబరు 91లో ఎకరం స్థలాన్ని కేటాయించింది.[10]
మూలాలు
మార్చు- ↑ "సమాచార కమిషన్ ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ". Zee News Telugu. 2017-09-14. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.
- ↑ "The decline of India's right to information regime, in four charts". livemint. 4 November 2020. Retrieved 2022-06-01.
- ↑ "Over 2.5 Lakh RTI Appeals, Plaints Pending with 26 Information Commissions across India". moneylife.in. 21 October 2021. Retrieved 2022-06-01.
- ↑ "State Information Commission: Composition, Power and Functions". jagranjosh.com. 30 March 2019. Retrieved 2022-06-01.
- ↑ "Chhattisgarh Only State To File Annual Reports Under RTI Act". ndtv.com. 12 October 2019. Retrieved 2022-06-01.
- ↑ "తెలంగాణ సమాచార ప్రధాన కమిషనర్‌గా సదారాం". Samayam Telugu. 2017-09-15. Archived from the original on 2017-09-18. Retrieved 2022-06-01.
- ↑ "సమాచార కమిషనర్ల ప్రమాణం". Sakshi. 2020-02-26. Archived from the original on 2021-05-28. Retrieved 2022-06-01.
- ↑ "SC Asks States for Updates on Vacancies, Pendency in Information Commissions". The Wire. 19 August 2021. Retrieved 2022-06-01.
- ↑ "RTI Bill 2019: Undermining autonomy of information commissions and transparency in governance". indiatoday.in. 19 July 2019. Retrieved 2022-06-01.
- ↑ "సమాచార కమిషన్ స్థల పరిరక్షణకు చర్యలు: సీఐసీ". EENADU. 2022-05-29. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.
బయటి లంకెలు
మార్చు- అధికారిక వెబ్సైటు Archived 2022-06-08 at the Wayback Machine