బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు

బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు ఫ్రెంచిపలిపాలనకాలపు యానాంలో ప్రముఖులు, సుప్రసిద్ధ రాజకీయనాయకులు.

బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు
బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు

మన్యం జమిందారి దివాన్


స్థానికసభా సదస్యులు
పదవీ కాలం
10 జూను 1928 – 1934
ముందు కాళ్ళ వెంకటరత్నం
తరువాత తోట నరసింహస్వామి
నియోజకవర్గం యానాం

యానాం క్రిమినల్ న్యాయస్థానంలో న్యాయపీఠసభ్యులు
పదవీ కాలం
1917 – 1920
ముందు ఫ్రాన్స్ ఇజ్ఞేస్
తరువాత సమతం లక్ష్మీనరసయ్య

యానాం క్రిమినల్ న్యాయస్థానంలో న్యాయపీఠసభ్యులు
పదవీ కాలం
1934 – 1934
ముందు మొహమ్మదు సాలెహా
తరువాత మొహమ్మదు సాలెహా

వ్యక్తిగత వివరాలు

జననం 1866 c.a or 1873c.a
 యానాం, ఫ్రెంచిండియా
మరణం 13 సెప్టెంబరు 1941
జాతీయత ఫ్రాన్స్ ఫ్రెంచి
రాజకీయ పార్టీ బాపనయ్య-సమతం పార్టి
జీవిత భాగస్వామి బులుసు సూర్యప్రకాశం
సంతానం జగనాథ శాస్త్రి లక్ష్మీనారాయణ మూర్తి సత్యనారాయణ మూర్తి
నివాసం ఫ్రాన్స్ యానాం, ఫ్రెంచిండియా
మతం హిందూ

జననము

మార్చు

వీరు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఫ్రెంచి యానాంలో 1866లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బులుసు జగన్నాథశాస్త్రులు, వెంకటనరసమ్మ గార్లు. జగన్నాథశాస్త్రులుగారికి వెంకటనరసమ్మ రెండవభార్య. వీరిని అమ్మమ్మగారయిన వీరుభొట్ల మహలక్ష్మమ్మగారు పెంచి పెద్దచేశారు[1]. మనవడి కోసం ఆవిడ నిమ్మలూరు నుండి యానాం అగ్రహారం వచ్చారు. అగ్రహారంలో అగ్నిప్రమాదంవల్ల అక్కడి ఇళ్ళన్ని కాలిపోగా వీరి ఇల్లు మాత్రం చిత్రముగా ఏమి కాలేదుట. తర్వాత అక్కడి నుండి తరలి వేలంపాటలో వెంకన్నబాబుగుడి దగ్గరలోని జలదంకి సందులో కుమ్మరివాళ్ళ స్థలం వేలంపాటలో కొని అక్కడ స్థిరపడ్డారు.

తొలినాళ్ళు

మార్చు

చిన్నతనంలోనే మన్యం జమిందారిలో శ్రీ మన్యం మహలక్ష్మమ్మగారి దగ్గర చాలా కాలం దివానుగా పనిచేశారు. వీరి నిజాయితి, పనితనంవల్ల మునుపు దివాళ తీసిన జమిందారి మళ్ళి గాడిలో పడినట్లు అప్పట్లో మహలక్ష్మమ్మగారు 1902లో ఒకానొక సందర్భంలో వాంగ్మూలమిచ్చారట[2]. కాలక్రమేణా యానాంలో భూస్వామిగా ఎదగడమేగాక అప్పటి ఫ్రెంచిండియా గవర్నరు మెచ్చుకొనేంతస్థాయిలో పేరుగడించారు.

వివాహం

మార్చు

నరసాపురం దగ్గర నడిపూడి గ్రామ వాస్తవ్యులైన కళా లక్ష్మినారాయణ, సోదెమ్మల జ్యేష్ట (లేదా రెండవ) పుత్రిక అయిన కళా సూర్యప్రకాశంతో శాస్త్రులు వివాహం జరిగింది. సుప్రసిద్ధ కాంగ్రేసు నాయకుడు, స్వాతంత్రసమరయోధుడు అయిన కళా వెంకటరావు గారు శాస్త్రులుగారికి బావమరిది. శాస్త్రులుగారి తోడల్లుడు ఆంధ్రరాష్ట్ర తొలి ఆస్థానకవి అయిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు[3]. కృష్ణమూర్తి శాస్త్రి గారి జ్యేష్టపుత్రిక వచ్చి ప్రముఖ కవయిత్రి అయిన కల్లూరి విశాలాక్షమ్మ గారు.

రాయకీయ జీవితం

మార్చు

ఆయన యానాం క్రిమినల్ కోర్టులో ధర్మాసనంలో న్యాయపెద్దగా (ఫ్రెంచిలో అస్సెస్సోర్ అప్పెలె ఆ ఫేర్ సెర్విస్ దె ల కూర్ క్రిమినెల్ల్ దె యానాఁ) 1917[4], 1918[5], 1919[6], 1920[7], 1934[8] సంవత్సరాల్లో ఎన్నికై పనిచేసారు. తర్వాత కొన్సెల్ లొకాల్ దె యానాఁగా పిలవబడే యానాం స్థానికసభలో సభ్యునిగా 1928లో 'సమతం-బాపనయ్య పార్టీ' తరపున ఎన్నికై 1934 వరుకు ఆ పదవిలో కొనసాగారు.[9]. ఆ సభ తొలుత మూడేళ్ళు (1928 నుండి 1931) బెజవాడ బాపనయ్య అధ్యక్షతన నడించింది. ఆ సమయంలో శాస్త్రులు, గిరి మాధవరాయ్డు ఎన్నిక చెల్లదంటు కామిచెట్టి వేణుగోపాలరావునాయుడు వేసిన వ్యాజ్యం వీగిపోయింది. కాని 1931లో జగిన ఉపఎన్నికల్లో సమతం-బాపనయ్య పార్టీ ఓటమి చవిచూడగా కామిచెట్టి నాయుడు పక్షం గెలిచి నాయుడు సభాధ్యక్షులు అయ్యారు. ఆనక కొన్నేళ్ళలోనే పుదుచ్చేరిలో బెజవాడ బాపనయ్య హత్య జరిగిన తర్వాత శాస్త్రులు యానాం రాజకీయలనుండి శాస్వతంగా విరమించుకుని తప్పుకున్నారు.

మరణము

మార్చు

వీరు 1941 సెప్టెంబరు 13 తేదీన యానాం జలదంకి సందులోని వీరి స్వగృహంలో స్వర్గస్థులయ్యారు[10].

మూలాలు

మార్చు
  1. ఫ్రెంచిపాలనలో యానాం, బొల్లోజు బాబా, p.no 31 కాకినాడ, 2012
  2. p.202, The aristocracy of southern India (1903), A. Vadivelu, Madras.
  3. శ్రీకృష్ణకవి చరిత్రము (1933), అనంతపంతుల రామలింగస్వామిగారు
  4. Journal Officiel des établissements français dans l'Inde, 1916.
  5. Journal Officiel des établissements français dans l'Inde, 1917.
  6. Journal Officiel des établissements français dans l'Inde, 1918.
  7. Journal Officiel des établissements français dans l'Inde, 1919.
  8. Journal Officiel des établissements français dans l'Inde, 1933.
  9. Journal Officiel des établissements français dans l'Inde, 1928.
  10. బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు మరణధృవీకరణపత్రం (1941), యానాం పురపాలకసంఘం, యానాం.